మీడియా వాచ్‌: ఈనాడులో 16 మందికి క‌రోనా?

ఈనాడులో క‌రోనా క‌ల‌క‌లం. ఏకంగా ఒకేసారి 16 మందికి క‌రోనా సోకిన‌ట్టు ఓ వార్త‌… మీడియా వ‌ర్గాల్లో క‌ల‌క‌లం సృష్టిస్తోంది. సోమాజీగూడ‌లోని ఈనాడు ప్ర‌ధాన కార్యాల‌యంలో రాండ‌మ్‌గా 125 మందికి క‌రోనా టెస్ట్‌లు చేయిస్తే… అందులో 16 మందికి పాజిటీవ్ అని తేలింది. దాంతో.. యాజ‌మాన్యం షాక్‌కి గురైంది. ఈ ప‌ద‌హారు మంది ఎవ‌రెవ‌రితో కాంటాక్ట్స్‌లో ఉన్నారు? అనే విష‌యాన్ని ఇప్పుడు ఆరా తీస్తున్నారు. వాళ్ల కుటుంబ స‌భ్యుల‌కూ క‌రోనా ప‌రీక్ష‌లు చేయిస్తున్నారు. ఈనాడు మ‌రో కార్యాల‌యం రామోజీ ఫిల్మ్‌సిటీలో ఉంది. ప్ర‌స్తుతానికి మేజ‌ర్ వ‌ర్క్ అంతా అక్క‌డి నుంచే జ‌రుగుతోంది. ఫిల్మ్‌సిటీ ఉద్యోగుల‌కు టెస్ట్ లు చేయిస్తే.. ఇంకెన్ని కేసులు బ‌య‌ట‌ప‌డ‌తాయో అని ఈనాడు యాజ‌మాన్యం భ‌య‌ప‌డుతోంది. ఇప్ప‌టికే ఫిల్మ్‌సిటీలోనూ 2 కేసులు న‌మోదైన‌ట్టు స‌మాచారం. కేవలం 125 మందికి, అందునా రాండ‌మ్ టెస్ట్ చేయిస్తే ఇన్ని కేసులంటే.. అంద‌రికీ టెస్టులు చేయిస్తే, ఇంకెన్ని కేసులు బ‌య‌ట‌ప‌డ‌తాయో అనే భ‌యం ప‌ట్టుకుంది. క‌రోనా భ‌యాల మ‌ధ్య రిపోర్ట‌ర్లు, స‌బ్ ఎడిట‌ర్స్ ఆఫీసుల‌కు వెళ్ల‌డానికే భ‌య‌ప‌డుతున్నారు. కానీ యాజ‌మాన్యం మాత్రం వ‌రుస‌గా సెల‌వ‌లు తీసుకుంటున్న‌వాళ్ల‌పై సీరియ‌స్‌గా దృష్టి పెడుతోంది. వెళితే క‌రోనా భ‌యం. వెళ్ల‌క‌పోతే.. ఉద్యోగం పోతుందేమో అన్న ఆందోళ‌న‌. ఈ రెండింటిమ‌ధ్య బతుకు వెళ్ల‌దీస్తున్నారు ఈనాడు ఉద్యోగులు.
v

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ప్రభాకర్ రావు వచ్చాకే అసలు ట్యాపింగ్ సినిమా !

ఫోన్‌ట్యాపింగ్‌ కేసులో నిందితులైన హైదరాబాద్‌ మాజీ టాస్క్‌ఫోర్స్‌ డీసీపీ రాధాకిషన్‌రావును గురువారం రాత్రి పోలీసులు అరెస్ట్‌ చేశారు. ఆయన గట్టు మల్లును ఇన్స్‌పెక్టర్ ను పెట్టుకుని ఓ మాఫియా నడిపారని...

డేరింగ్ అండ్ డాషింగ్ కేజ్రీవాల్

అవినీతి వ్యతిరేక ఉద్యమం చేసి వచ్చి అవినీతి కేసులో అరెస్టు అయ్యాడన్న ప్రచారం చేస్తున్నారు. సామాన్యుడు కాదు లంచగొండి అని గట్టిగా ప్రజల మైండ్లలోకి ఎక్కించే ప్రయత్నం చేస్తున్నారు. తన సీఎం...

విజయవాడ వెస్ట్ రివ్యూ : సుజనా చౌదరి నమ్మకమేంటి ?

ఏపీలో పొత్తుల్లో భాగంగా బీజేపీకి వెళ్లిన నియోజకవర్గం విజయవాడ వెస్ట్. అక్కడ్నుంచి అభ్యర్థిగా సుజనా చౌదరిని ఖరారు చేయడంతో కూటమిలోని పార్టీలు కూడా ఒప్పుకోక తప్పలేదు. నిజానికి అక్కడ జనసేన...

టీడీపీ @ 42 : సర్వైవల్ సవాల్ !

సాఫీగా సాగిపోతే ఆ జీవితానికి అర్థం ఉండదు. సవాళ్లను ఎదుర్కొని అధిగమిస్తూ ముందుకు సాగితేనే లైఫ్ జర్నీ అద్బుతంగా ఉంటుంది. అలాంటి జర్నీ ఒక్క మనిషికే కాదు.. అన్నింటికీ వర్తిస్తుంది. ...

HOT NEWS

css.php
[X] Close
[X] Close