బండ్ల‌కి ప‌వ‌న్ మాటిచ్చేశాడా?

ప‌వ‌న్ క‌ల్యాణ్ పేరు చెప్ప‌గానే ఊగిపోయి, స్టేజీ మీద ర‌చ్చ ర‌చ్చ చేసేస్తుంటాడు బండ్ల గ‌ణేష్‌. `గ‌బ్బ‌ర్ సింగ్‌`తో బండ్ల జీవిత‌మే మారిపోయింది. దానికి కార‌ణ‌మైన ప‌వ‌న్ అంటే బండ్ల‌కు అందుకే అంతిష్టం. తీన్ మార్ తో వ‌చ్చిన న‌ష్టాల్ని పూడ్చుకోవ‌డానికి `గ‌బ్బ‌ర్‌సింగ్‌` సినిమా ఛాన్సిచ్చాడు ప‌వ‌న్‌. దాంతో బండ్ల నిల‌దొక్కుకోగ‌లిగాడు. అందుకే ప‌వ‌న్ కి భ‌క్తుడైపోయాడు. ఈమ‌ధ్య బండ్ల ప్రొడ‌క్ష‌న్‌కి దూరంగా ఉంటున్నాడు. త్వ‌ర‌లోనే ఓ సినిమా చేయ‌డానికి రంగం సిద్ధం చేసుకుంటున్నాడు. ప‌వ‌న్ తో మ‌రో సినిమా చేయాల‌న్న‌ది బండ్ల ఆలోచ‌న‌. అందుకోసం ఇది వ‌ర‌కే ర‌క‌ర‌కాల ప్ర‌య‌త్నాలు చేసినా అవేం స‌త్ఫ‌లితాలు ఇవ్వ‌లేదు. ఇప్పుడు మాత్రం బండ్ల ఆ చాన్స్ కొట్టేసిన‌ట్టే క‌నిపిస్తోంది.

ఇటీవ‌ల ప‌వ‌న్ ని క‌లిశాడు బండ్ల గ‌ణేష్‌. ఆ సంద‌ర్భంగా సినిమా ప్ర‌స్తావన వ‌చ్చిన‌ట్టుంది. ప‌వ‌న్ భోళా శంక‌రుడు క‌దా. బండ్ల‌కు అడిగిన వెంట‌నే వ‌రం ఇచ్చేసిన‌ట్టున్నాడు. అందుకే.. `మా బాస్ ఓకే అనేశాడు. మ‌రోసారి నా క‌ల నిజం అవుతోంది` అంటూ ప‌వ‌న్ క‌ల్యాణ్‌తో ఉన్న ఓ ఫొటోని ట్వీట్ చేశాడు బండ్ల బాబు. దాంతో.. ప‌వ‌న్ తో బండ్ల సినిమా ఫిక్స‌యిన‌ట్టే అనుకోవాలి. కాక‌పోతే… ఇప్ప‌టికే ప‌వ‌న్ చాలామందికి మాటిచ్చేశాడు. చాలా సినిమాలు పెండింగ్‌లో ఉన్నాయి. వాటిలో ఏది ముందు ఏది వెనుక‌…. అనేది తెలీక స‌త‌మ‌త‌మ‌వుతున్నారంతా. మ‌రి బండ్ల తో సినిమా బండెక్కేది ఎప్పుడో?

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ప్రభుత్వ పెద్దల సన్నిహితుల చానల్‌లో మంత్రి వ్యతిరేకత వార్తల అర్థమేంటి..?

తెలంగాణకు చెందిన ఓ మంత్రి రాసలీలలంటూ తెలంగాణ ప్రభుత్వ పెద్దలకు అత్యంత సన్నిహితులయిన రియల్ ఎస్టేట్ వ్యాపారి అధీనంలో ఉన్న న్యూస్ చానల్ హంగామా ప్రారంభించడం టీఆర్ఎస్‌లో కలకలం రేపుతోంది.కొద్దీ రోజులుగా ఆ...

కళ్ల ముందు కనిపిస్తున్న ఇళ్లతో టీడీపీ రాజకీయం..!

పేదలకు 30 లక్షల ఇళ్ల పట్టాలిస్తామంటూ హడావుడి చేసిన వైసీపీ సర్కార్... ఏడాదిన్నర గడిచిపోయినా ఆ దిశగా కనీసం అడుగులు వేయలేకపోయింది. ఆ పేరుతో పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడ్డారన్న అభిప్రాయం...

క్రైమ్ : అత్త – అల్లుడు – వివాహేతర బంధం- హత్య..

సమాజంలో చిత్రమైన నేరాలు అప్పుడప్పుడూ వెలుగుచూస్తూ ఉంటాయి. అలాంటిది హైదరాబాద్‌లో ఒకటి బయటపడింది. ఓ నడి వయసు మహిళ.. ఓ యువకిడితో అక్రమ సంబంధం పెట్టుకుంది. తాను పెళ్లి చేసుకోలేదు కనుక.. కూతుర్ని...

యుద్ధం మొద‌ల‌వ్వ‌క‌ముందే.. తెల్ల‌జెండా ఊపేసిన ర‌జ‌నీ!

క‌రోనా ఎంత ప‌ని చేసిందో? క‌రోనా వ‌ల్ల సినిమా షూటింగులు ఆగిపోయాయి. సినిమా విడుద‌ల‌లూ ఆగిపోయాయి. ఆఖ‌రికి... ఓ సూప‌ర్ స్టార్ రాజ‌కీయ రంగ ప్ర‌వేశానికీ బ్రేకులు ప‌డ్డాయి. ఆ స్టార్...

HOT NEWS

[X] Close
[X] Close