సింగీతం ప్లాన్ మారిందా?

వెట‌ర‌న్ ద‌ర్శ‌కుడు సింగీతం శ్రీ‌నివాస‌రావు సుదీర్ఘ విరామం త‌ర‌వాత మ‌ళ్లీ మెగా ఫోన్ ప‌ట్టుకోవాల‌నుకున్నారు. అందుకు సంబంధించిన స్క్రిప్టు కూడా త‌యారు చేసుకున్నారు. బెంగ‌ళూరు నార‌త్న‌మ్మ జీవిత క‌థ ఆధారంగా తెర‌కెక్కే చిత్ర‌మిది. ఆ పాత్ర‌లో స‌మంత లాంటి స్టార్ హీరోయిన్ ని తీసుకోవాల‌న్న ప్ర‌య‌త్నాల్లో ఉన్నారు. ఇప్ప‌టికే స‌మంత‌తో సంప్ర‌దింపులు మొద‌ల‌య్యాయి. దాదాపుగా ఆమెతోనే ఈ సినిమా ప‌ట్టాలెక్క‌బోతోంది.

అయితే.. ఈ సినిమా విష‌యంలో సింగీతం ప్లాన్ మారింది. ఆయ‌న ద‌ర్శ‌క‌త్వానికి దూరంగా జ‌ర‌గాల‌ని భావిస్తున్నార‌ని స‌మాచారం. త‌న ద‌గ్గ‌ర శిష్య‌రికం చేసి ఇప్పుడు పెద్ద స్థాయిలో ఉన్న ద‌ర్శ‌కుల‌లో ఒక‌రికి ఆ బాధ్య‌త అప్ప‌గించి – తాను ద‌ర్శ‌కత్వ పర్య‌వేక్ష‌ణ చేయాల‌న్న నిర్ణ‌యానికొచ్చార‌ని తెలుస్తోంది. సంగీతం వ‌య‌సు మీరిపోతోంది. దానికి తోడు.. ఈమ‌ధ్య క‌రోనా సోకింది. ఇత‌ర అనారోగ్య స‌మ‌స్య‌లేవీ లేవు కానీ.. ఇది వ‌ర‌క‌టి ఉత్సాహం త‌గ్గుతుంది క‌దా. పైగా ఇప్ప‌టి సినిమా ప్రొడ‌క్ష‌న్‌, మేకింగ్ అన్నీ మారిపోయాయి. స‌మంత తో పాటు స్టార్ కాస్టింగ్ కూడా భారీగా ఉండే సినిమా ఇది. వాళ్లంద‌రినీ, ఈ వ‌య‌సులో డీల్ చేయ‌డం క‌ష్టం అవుతుంద‌ని సింగీతం భావిస్తున్నార్ట‌. అందుకే… ఈసారికి ఆయ‌న ద‌ర్శ‌కత్వ ప‌ర్య‌వేక్ష‌ణ‌కు ప‌రిమితం అయ్యే అవ‌కాశాలున్నాయ‌ని తెలుస్తోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

దుబ్బాకలో టీఆర్ఎస్ గెలుపుపై కేసీఆర్ ఎంత నమ్మకమో..!?

దుబ్బాక ఉపఎన్నిక విషయంలో టీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ చాలా క్లారిటీగా ఉన్నారు. ధరణి పోర్టల్ ప్రారంభించిన తర్వాత మీడియా ప్రతినిధులతో పిచ్చాపాటిగా మాట్లాడిన కేసీఆర్.. దుబ్బాకలో గెలుపు ఎప్పుడో డిసైడైపోయిందని తేల్చారు....

సంచైతకు కౌంటర్‌గా ఊర్మిళా గజపతి..!

విజయనగరం రాజుల ఫ్యామిలీలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి సర్కార్ పెట్టిన చిచ్చును.. రాజకీయంగానే ఎదుర్కోవాలని... ఇంక ఏ మాత్రం సహించకూడదని... గజపతుల కుటుంబం నిర్ణయానికి వచ్చినట్లుగా కనిపిస్తోంది. మాన్సాస్ ట్రస్ట్ చైర్ పర్సన్‌గా...

రాయలసీమ ఎత్తిపోతలను రిస్క్‌లో పెట్టేసిన ఏపీ సర్కార్..!

ముందూ వెనుకా చూసుకోకుండా.... రాయలసీమ ఎత్తిపోతల ప్రాజెక్ట్ పై దూకుడుగా వెళ్లిన ఏపీ సర్కార్.. ఆ ప్రాజెక్ట్‌ను పూర్తిగా రిస్క్‌లో పడేసింది. టెండర్లు ఖరారు చేసి..మేఘా కన్సార్టియంకు పనులు అప్పగించేసిన తర్వాత ఇప్పుడు......

ఏపీలో మద్యం ధరలు భారీగా తగ్గింపు..! తాగమని ప్రోత్సాహమా..?

ఆంధ్రప్రదేశ్‌లో మందు బాబులతో తాగడం మాన్పించాలని మద్యం రేట్లు షాక్ కొట్టేలా పెంచేసిన ప్రభుత్వానికి తత్వం బోధపడినట్లుగా ఉంది. షాక్ కొట్టేలా రేట్లు పెంచితే...ఆ మద్యాన్ని కొని షాక్ కొట్టించుకోకుండా... పక్క రాష్ట్రాల...

HOT NEWS

[X] Close
[X] Close