పాక్ క్రికెట్.. అట్టర్ ఫ్లాఫ్

బంగ్లాదేశ్ జట్టు సంచలనం సృష్టించింది. తనకంటే బలమైన టీమ్‌ అయిన పాకిస్థాన్‌ టెస్ట్ క్రికెట్ లో చిత్తు చేసింది. పాకిస్థాన్‌తో రెండు టెస్టుల సిరీస్‌ను 2-0తో క్లీన్‌స్వీప్‌ చేసి చరిత్ర సృష్టించింది. పాక్‌పై బంగ్లాదేశ్‌ టెస్టు సిరీస్‌ గెలవడం ఇదే మొదటిసారి. రావల్పిండిలో జరిగిన తొలి టెస్టులో బంగ్లాదేశ్ ఇటు బ్యాటింగ్‌, అటు బౌలింగ్‌లో అదరగొట్టి పాక్‌ను 10 వికెట్ల తేడాతో మట్టికరిపించింది.

ఇప్పుడు రెండో టెస్టులో బంగ్లాదేశ్ 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది. 185 పరుగుల లక్ష్యఛేదనలో ఓవర్‌ నైట్ స్కోరు 42/0తో (రెండో ఇన్నింగ్స్‌) మంగళవారం, ఐదో రోజు ఆటను ప్రారంభించిన ఆ జట్టు 56 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి టార్గెట్‌ని అందుకుంది. జకీర్‌ హసన్‌ (40), షాద్మాన్‌ ఇస్లామ్ (24), నజ్ముల్ హొస్సేన్ శాంటో (38), మోమినుల్ హక్ (34), ముష్పీకర్‌ రహీమ్ (22), షకీబ్‌ అల్ హసన్ (21) తో రాణించారు.

బంగ్లా టెస్టు క్రికెట్‌ చరిత్రలో విదేశాల్లో ఆ జట్టుకిది ఎనిమిదో గెలుపు. సొంతగడ్డ ఆవల గత ఏడేళ్లలో ఆ జట్టుకిది మూడో విజయం. విదేశాల్లో చివరిసారిగా 2022 జనవరిలో న్యూజిలాండ్‌పై నెగ్గింది. ఇప్పటి వరకు బంగ్లా ఆడిన 143 టెస్టుల్లో ఇది 21వ విజయం.

పాకిస్థాన్‌ జట్టుకు ఈ ఓటమి తీవ్ర పరాభవం అనే చెప్పాలి. ఇప్పటికే సీనియర్లు, అభిమానులు ఆ జట్టు ఆట తీరుపై తీవ్రమైన విమర్శలు చేస్తున్నారు. జట్టుని సమూలంగా ప్రక్షాళన చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఇటు బౌలింగ్ బ్యాటింగ్ రెండిటిలో విఫలమైన పాక్ జట్టు ప్రస్తుతం గడ్డుకాలం ఎదుర్కొంటుంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్ ను కూల్చివేయండి… హైకోర్టు కీల‌క ఆదేశాలు

బీఆర్ఎస్ పార్టీ అనుమ‌తి లేకుండా పార్టీ ఆఫీసును నిర్మించింద‌ని దాఖ‌లైన పిటిష‌న్ పై హైకోర్టు సంచ‌ల‌న తీర్పునిచ్చింది. 15రోజుల్లో పార్టీ ఆఫీసును కూల్చివేయాల‌ని స్ప‌ష్టం చేసింది. న‌ల్గొండ జిల్లా కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ...

కొడాలి నాని.. వల్లభనేని వంశీ సైలెన్స్ వెనక కారణం ఇదేనా ?

కొడాలి నాని.. వల్లభనేని వంశీ...ఫైర్ బ్రాండ్ నేతలు. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడూ ప్రత్యర్ధి పార్టీల నేతలపై చెలరేగిపోయిన వీరిద్దరూ .. కూటమి అధికారంలోకి వచ్చాక పూర్తిగా సైలెంట్ అయిపోయారు. కూటమి సర్కార్ అధికారంలోకి...

కాంగ్రెస్ విన్నింగ్ ఫార్మూలా- హ‌ర్యానాలోనూ ఇక్క‌డి మేనిఫెస్టోనే!

వ‌రుస‌గా మూడోసారి కేంద్రంలో అధికారంలోకి రాలేక‌పోయిన కాంగ్రెస్ పార్టీ... అసెంబ్లీ ఎన్నిక‌ల్లో గెలుస్తూ, ఒక్కో రాష్ట్రంలో పాగా వేయాల‌న్న ఉద్దేశంతో ఉంది. అందుకే ఒక రాష్ట్రంలో స‌క్సెస్ అయిన ఫార్మూలాను ఇంకో రాష్ట్రంలోనూ...

2027లోనే ఎన్నిక‌లు…? జ‌మిలి ఎన్నిక‌ల‌పై కీల‌క అడుగు!

ఒకే దేశం-ఒకే ఎన్నిక‌లు. గ‌త ఎన్నిక‌ల‌కు ముందే ప్ర‌ధాని మోడీ, కేంద్ర ప్ర‌భుత్వం దీనికి సంబంధించి కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. మాజీ రాష్ట్రప‌తి నేతృత్వంలో సాధ్యాసాధ్యాల‌ను ప‌రిశీలించి, నివేదిక ఇవ్వ‌టం జ‌రిగిపోయాయి. తాజాగా...

HOT NEWS

css.php
[X] Close
[X] Close