“కేన్స్” ఎక్కడ పెట్టుబడి పెట్టినా తెలంగాణ నుంచి పోయినట్లేనా ?

రెండు వారాల కిందట కేన్స్ టెక్నాలజీ అనే మల్టీ నేషనల్ కంపెనీ ప్రతినిధులు తెలంగాణ ప్రభుత్వ పెద్దల్ని కలిశారు. ముఖ్యమంత్రి రేవంత్ తో పాటు మంత్రి శ్రీధర్ బాబు ఇతర నేతలతో సమావేశమయ్యారు. తెలంగాణలో తమ పెట్టబడి ప్రణాళికల్లో ఏ మాత్రం కోత విధించడం లేదని స్పష్టం చేశారు. కొంగరకలాన్ లో ఇప్పటికే సిద్ధమైన ఎలక్ట్రానిక్స్ యూనిట్ ను ప్రారంభిస్తున్నట్లుగా తెలిపారు.

అయితే తాజాగా ఇదే కేన్స్ టెక్నాలజీస్ గుజరాత్‌లో సెమీకండక్టర్ పరిశ్రమ పెట్టేందుకు సిద్ధమయింది. కేంద్రం ఆమోదం తెలిపింది. దీంతో ఈ సెమీ కండక్టర్ పరిశ్రమ తెలంగాణలో పెట్టాల్సిందేనని కాంగ్రెస్ చేతకాని తనం వల్లనే వెళ్లిపోయిందని ప్రచారం చేయం ప్రారంభించారు. కేటీఆర్ కూడా ఓ పేపర్ క్లిప్పింగ్ ను ట్వీట్ చేసి.. కాంగ్రెస్ సర్కార్ పై మండిపడ్డారు. తమ గుజరాత్ పెట్టుబడుల ప్రణాళికల వల్ల తెలంగాణలో పెట్టుబడులు పెట్టాలనుకున్న విషయంలో ఎలాంటి ప్రభావం ఉండదని.. తెలంగాణలో తమ ప్రణాళికలు కొనసాగుతాయని కేన్స్ సంస్థ రెండు వారాల కిందటే స్పష్టత ఇచ్చింది.

సెమీ కండక్టర్ పరిశ్రమకు గుజరాత్ లో కేంద్రీకృతమవుతోంది. అక్కడ ఇప్పటికే నాలుగు పరిశ్రమలకు కేంద్రం అనుమతి ఇచ్చింది. గుజరాత్ లో సెమీకండక్టర్ యూనిట్ తమకు స్ట్రాటజిక్ గా ఎంతో ముఖ్యమని కేన్స్ టెక్నాలజీస్ చెబుతోంది. ఆగస్టు 23న కొంగరకలాన్‌లో ఈఎంఎస్‌ను కేన్స్‌ సంస్థ ప్రారంభించింది. సెమీకండక్టర్లకు సంబంధించిన అనుబంధ వస్తువులైన సబ్‌స్ట్రేట్‌, కో-ప్యాకేజ్‌ ఆప్టిక్స్‌, లైట్‌ స్పీడ్‌ ఫోటోనిక్స్‌ తదితరవాటిలో కొన్నింటిని కొంగరకలాన్‌లో తయారు చేస్తామని యాజమాన్యం తెలిపింది.

మొత్తంగా తెలంగాణలో పెట్టుబడిని కొనసాగిస్తామని ఆ సంస్థ యాజమాన్యం అధికారికంగా ప్రకటించినా… గుజరాత్ లో ఆ సంస్థ పెట్టుబడి పెట్టడమే .. కాంగ్రెస్ ప్రభుత్వ తప్పన్నట్లుగా ప్రచారం జరుగుతోంది. దీన్ని కాంగ్రెస్ ఎలా తిప్పి కొడుతుందో ?

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

తిరుపతి లడ్డూ ఇష్యూ : అడ్డంగా దొరికినా అదే ఎదురుదాడి !

వైసీపీ సిగ్గులేని రాజకీయాలు చేస్తుంది. అడ్డంగా దొరికిన తర్వాత కూడా ఎదురుదాడి చేసేందుకు ఏ మాత్రం సిగ్గుపడటం లేదు. తిరుమల శ్రీవారి ప్రసాదం లడ్డూలో నాణ్యత లేని నెయ్యిని.. పశువుల కొవ్వుతో కల్తీ...

తిరుప‌తి ల‌డ్డు చుట్టూ వివాదం… ఇంత‌కు ఈ ల‌డ్డూ ఎందుకింత స్పెష‌ల్?

తిరుప‌తి ల‌డ్డూ. తిరుమ‌ల‌లో శ్రీ‌వారి వెంక‌న్న ద‌ర్శ‌నాన్ని ఎంత మ‌హాభాగ్యంగా భావిస్తారో... తిరుప‌తి ల‌డ్డూను అంతే మ‌హాభాగ్యంగా భావిస్తారు. ఉత్త‌రాది, ద‌క్షిణాది అన్న తేడా ఉండ‌దు... ఆ రాష్ట్రం, ఈ రాష్ట్రం అన్న...

అడియోస్ అమిగో రివ్యూ: అపరిచితుల జీవయాత్ర

సినిమా అనగానే ఇంట్రడక్షన్, పాటలు, ఫైట్లు, స్క్రీన్ ప్లే లో త్రీ యాక్ట్.. ఇలా కొన్ని లక్షణాలు ఫిక్స్ అయిపోతాయి. కానీ అప్పుడప్పుడు ఆ రూల్స్ ని పక్కన పెట్టి కొన్ని చిత్రాలు...

తిరుప‌తి ల‌డ్డూ నెయ్యి వివాదం- ఆధారాలు బ‌య‌ట‌పెట్టిన టీడీపీ

తిరుమ‌ల వెంక‌న్న ల‌డ్డూ ప్ర‌సాదం అంటే ఎంతో సెంటిమెంట్. క‌ళ్ల‌కు అద్దుకొని తీసుకుంటారు. వెంక‌న్న‌ను ద‌ర్శించుకున్నంతగా భావిస్తారు. కానీ ఆ ల‌డ్డూ త‌యారీలో వాడిన నెయ్యిని గొడ్డు మాసం కొవ్వుతో త‌యారు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close