భారత్‌లో అడేందుకు నిరాకరించిన బంగ్లాదేశ్ క్రికెట్ జట్టుకు రూ. 300 కోట్లుకుపైగా నష్టం వాటిల్లనుంది. ఐసీసీ నుంచి లభించే రెవెన్యూ షేర్, స్పాన్సర్షిప్ డీల్స్ ,ప్రసార హక్కుల ద్వారా వచ్చే ఆదాయంపై ఈ ప్రభావం తీవ్రంగా ఉండనుంది. కేవలం ఐసీసీ ఇచ్చే గ్రాంట్ల రూపంలోనే దాదాపు రూ. 50 కోట్ల నుంచి రూ. 100 కోట్ల వరకు తక్షణ నష్టం వాటిల్లుతుంది. దీనికి అదనంగా, ఆ జట్టు ప్రదర్శన ఆధారంగా వచ్చే ప్రైజ్ మనీ, ఐసీసీ కమర్షియల్ హక్కుల ద్వారా వచ్చే వాటా కూడా నిలిచిపోతుంది. ప్రపంచకప్ వంటి వేదికలపై తమ బ్రాండ్‌ను ప్రదర్శించుకునే అవకాశం కోల్పోవడం వల్ల భవిష్యత్తులో స్థానిక , అంతర్జాతీయ స్పాన్సర్లు బంగ్లాదేశ్ క్రికెట్ వైపు మొగ్గు చూపరు.
దీర్ఘకాలికంగా చూస్తే, ఈ ఆర్థిక నష్టం బంగ్లాదేశ్ దేశీయ క్రికెట్ మౌలిక సదుపాయాలపై మరియు ప్లేయర్ల వేతనాలపై ప్రతికూల ప్రభావం చూపుతుంది. ఆదాయం పడిపోతే అకాడమీల నిర్వహణ, ఏ-జట్టు పర్యటనలు మరియు మహిళా క్రికెట్ అభివృద్ధికి నిధుల కొరత ఏర్పడుతుంది కేవలం ఒక టోర్నీకి సంబంధించిన నష్టం మాత్రమే కాదు, బంగ్లాదేశ్ క్రికెట్ దశాబ్దాల పురోగతిని వెనక్కి నెట్టే పరిణామం.
ద్వైపాక్షిక సిరీస్‌ల ద్వారా వచ్చే మీడియా హక్కుల ఆదాయం కూడా భారీగా తగ్గుతుంది. బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు దివాలా తీయడం ఖాయంగా కనిపిస్తోంది. ఈ పరిణామాలు ఆ దేశ యువ క్రికెటర్ల భవిష్యత్తును , క్రికెట్ పట్ల ఉన్న క్రేజ్‌ను కూడా ప్రభావితం చేసే అవకాశం ఉంది. కేవలం రాజకీయ పరమైన కారణలతో భారత్ ను శత్రువుగా చూపాలన్న పాక్ కుట్రల్లో భాగమైన బంగ్లా మూల్యం చెల్లించుకుంటోంది.