రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా డిసెంబర్ 5న రెపో రేట్‌ను మరో 25 బేసిస్ పాయింట్లు తగ్గించి 5.25 శాతానికి తీసుకురావడంతో దేశంలో హోమ్ లోన్ వడ్డీ రేట్లు మరింత తగ్గుతున్నాయి. ప్రస్తుతం అతి తక్కువ రేటు 7.35 శాతం.
బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, బ్యాంక్ ఆఫ్ ఇండియా, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ – ఈ ఐదు బ్యాంకులు 7.35 శాతం నుంచి హోమ్ లోన్ ఆఫర్ చేస్తున్నాయి. అయితే సిబిల్ స్కోర్ 800 పైన ఉన్న ఉద్యోగులకు , మహిళలకు, ప్రభుత్వ ఉద్యోగులకు వర్తిస్తుంది. మహిళలకు అదనంగా 0.05 శాతం తగ్గింపు కూడా లభిస్తోంది.
ప్రైవేట్ రంగంలో బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్ 7.40 శాతానికి లోన్లు ఇస్తున్నాయి. కెనరా బ్యాంక్ 7.40 శాతం , స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 7.50 శాతం, హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ 7.90 శాతం నుంచి లోన్లు ఇస్తున్నాయి. రెపో రేట్‌కు లింక్ అయిన ఫ్లోటింగ్ రేట్ లోన్ల వల్ల రానున్న రోజుల్లో ఈ రేట్లు మరింత తగ్గే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు.ఈ మార్పుతో దేశవ్యాప్తంగా గృహ కొనుగోలు డిమాండ్ గణనీయంగా పెరుగుతుందని రియల్ ఎస్టేట్ నిపుణులు అంచనా వేస్తున్నారు.
