గుజరాత్ అల్లర్లలో మోదీ పాత్ర.. బీబీసీ డాక్యుమెంటరీ – బ్యాన్ !

2002 గుజరాత్‌ అల్లర్లు, ఆ ఉదంతంలో ప్రధాని నరేంద్రమోదీ పాత్రపై బీబీసీ డాక్యుమెంటరీ సోషల్ మీడియాలో కనిపించకుండా ప్రభుత్వం బ్యాన్ చేసింది. అల్లర్లకు మోదీనే బాధ్యుడని బ్రిటన్‌ ప్రభుత్వ రహస్య విచారణలో తేలిందని బీబీసీ తేల్చింది. ‘ఇండియా: ది మోదీ క్వశ్చన్‌’ పేరిట రూపొందించిన రెండు భాగాల్లో మొదటి ఎపిసోడ్‌ను గురువారం యూట్యూబ్‌ లో అప్‌లోడ్‌ చేసింది. అయితే, అప్‌లోడ్‌ చేసిన కొద్ది గంటల్లోనే కేంద్ర ఐటీశాఖ ఈ వీడియోను తొలగించింది. ప్రభుత్వాన్ని అపఖ్యాతి చేయడానికి, ప్రచారంలో భాగంగానే బీబీసీ ఈ డాక్యుమెంటరీ తీసుకొచ్చిందని కేంద్రం ఆరోపించింది.

ఈ బీబీసీ డాక్యుమెంటరీ లింక్‌లను తీసివేయాలనిట్విట్టర్ , యూట్యూబ్‌లను కూడా కేంద్రం ఆదేశించింది. కేంద్రం ఆదేశాల ప్రకారం “ఇండియా: ది మోడీ క్వశ్చన్” అనే డాక్యుమెంటరీకి సంబంధించిన అనేక ట్వీట్లు మరియు యూట్యూబ్ వీడియోలు ఇకపై మైక్రోబ్లాగింగ్ మరియు వీడియో-షేరింగ్ వెబ్‌సైట్‌లలో కనిపించడం లేదు. నేరుగా బీబీసీకే కేంద్రం తన అభ్యంతరాలు వ్యక్తం చేసింది. అయితే బీబీసీ మాత్రం చాలా లోతుగా అధ్య‌య‌నం చేసి ఆ డాక్యుమెంట‌రీ తీసిన‌ట్లు స్పష్టం చేసింది.

ఆ బీబీసీలో ఎంత నిజాలున్నాయో.. ఎన్ని అబద్దాలున్నాయో ప్రజలు తెలుసుకోకుండా కేంద్రమే చేయడం ఆశ్చర్యకరంగా మారింది. ప్రధానిగా మోదీ బాధ్యతలు చేపట్టక ముందు ప్రపంచంలో ఆయన ఇమేజ్ చాలా తేడాగా ఉండేది. ఆయనకు ప్రపంచంలోని ప్రముఖ దేశాలు వీసాలు ఇచ్చేవి కావు. అయితే ఆ ఆల్లర్లలో ఆయన పాత్ర లేదని ఇటీవలే కేంద్ర దర్యాప్తులు సంస్థలు తేల్చాయి. కానీ అంతర్జాతీయ సమాజం మాత్రం నమ్మడం లేదు. ప్రభుత్వాల రహస్య విచారణల్లో.. ఆయన పాత్ర తేలిందని బీబీసీ లాంటి వేదికలు ప్రచారం చేస్తూనే ఉన్నాయి. ఈ డాక్యుమెంటరీని నిషేధించడం వల్ల…. దీని గురించి మరింత విస్తృత ప్రచారం జరిగే అవకాశాన్ని కేంద్రమే కల్పించినట్లయింది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఎన్టీఆర్ స్పందించకపోతే ఐ డోంట్ కేర్ : బాలకృష్ణ

మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్ట్ పై సినీ పరిశ్రమ స్పందన తీరుపై చాలా విమర్శలు వస్తున్నాయి. చంద్రబాబు పాలనలో ఎంతో అభివృద్ధి సాధించిన సినీ పరిశ్రమ, అలాగే లబ్దిపొందిన చాలా...

జగన్ రెడ్డి ఢిల్లీ వెళ్లేది నిజం – మోదీ, షాలతో భేటీ డౌట్ !

లండన్ లో ఉండి చంద్రబాబును అరెస్టు చేయించి ఇండియాకు రాక ముందే ఢిల్లీ పర్యటన పేరుతో ప్రచారం చేసుకుని మోడీ , షాలతో భేటీ అవుతారని ప్రచారం చేయించుకున్న జగన్ రెడ్డి తాపత్రయం...

చంద్రబాబుకు డబ్బు ముట్టినట్లు ఆధారాలున్నాయా ?: ఏసీబీ కోర్టు జడ్జి

చంద్రబాబును కస్టడీకి ఇవ్వాలని సీఐడీ దాఖలు చేసిన పిటిషన్, అలాగే బెయిల్ కోసం చంద్రబాబు దాఖలు చేసుకున్న పిటిషన్లపై విచారణ ఏసీబీ కోర్టులో జరిగింది. ఉదయం చంద్రబాబు తరపు లాయర్ దూబే, మధ్యాహ్నం...

సుధీర్ బాబుకి ‘హంట్’ నేర్పిన గుణపాఠం

సుధీర్ బాబు 'హంట్' సినిమా బాక్సాఫీసు వద్ద డిజాస్టర్ అయ్యింది. కెరీర్ లో పలు ప్రయోగాలు చేసిన సుధీర్ బాబు.. హంట్ కూడా తనకు మరో ప్రయోగాత్మక చిత్రం అవుతుందని బలంగా నమ్మాడు....

HOT NEWS

css.php
[X] Close
[X] Close