యువగళానికి బ్రాండ్ అంబాసిడర్ వైసీపీ, ప్రభుత్వమే !

టీడీపీ యువనేత నారా లోకేష్ యువగళం పేరుతో ప్రారంభిస్తున్న పాదయాత్రకు ప్రభుత్వం, వైసీపీనే బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరిస్తోంది. ఈ పాదయాత్ర కోసం లోకేష్ ఆరు నెలలుగా కసరత్తు చేస్తున్నారు. ఇందు కోసంటీడీపీ మొత్తం యాక్టివ్ అయింది. రూట్ మ్యాప్ సహా.. వైఎస్ఆర్‌సీపీ ప్రభుత్వం నుంచి ఎలాంటి అడ్డంకులు రావొచ్చు.. వాటిని ఎలా ఎదుర్కోవాలన్నదానిపై ముందస్తుగా కసరత్తు పూర్తి చేశారు. అయితే అంతా లో ప్రోఫైల్‌లోనే పూర్తి చేశారు. ప్రచారం మాత్రం వైసీపీ చేస్తుందని వాళ్లు ప్లాన్ చేసుకున్నారేమో కానీ అనుకున్నట్లుగానే చేస్తున్నారు

లోకేష్ పాదయాత్ర చేయబోతున్నారని..ఆయనకు రాజకీయ ప్రత్యర్థులు, ఇతర సంఘ విద్రోహ శక్తుల నుంచి ముప్పు పొంచి ఉందని .. భద్రత కల్పించాలని రెండు వారాల కిందటే ఏపీ పోలీసులకు టీడీపీ నుంచి లేఖ వెళ్లింది. కానీ పోలీసులు స్పందించలేదు. రెండో సారి టీడీపీ రిమమైండర్ పంపిన తర్వాత పోలీసుల నుంచి స్పందన వచ్చింది. పాదయాత్ర కు సంబంధించి డీటైల్స్.. ఎన్ని రోజులు నిర్వహిస్తారు.. ఏ రోజు ఏఎక్కడ పాదయాత్ర చేస్తారు.. ఎంత మంది పాల్గొంటారు అన్న వివరాలు ఇవ్వాలని కోరారు. దీనిపై టీడీపీ మళ్లీ సమాధానం పంపింది. అయితే అనుమతి ఇస్తారా లేదా అన్నదానిపై స్పష్టత లేదు. పాదయాత్రను అడ్డుకోవడానికే ఇలా చేస్తున్నారని టీడీపీ వర్గాలు మండిపడుతున్నాయి.

ఇటీవల వైసీపీ ప్రభుత్వం జారీ చేసిన జీవో నెంబర్ వన్ లోకేష్ పాదయాత్ర జరగకుండా టార్గెట్ చేసి రిలీజ్ చేసిందేనని.. టీడీపీ వర్గాలంటున్నాయి. తెలుగుదేశం పార్టీకి ప్రజల్లో వస్తున్న ఆదరణను వైసీపీ భరించలేకపోతోందని అందుకే కట్టడి చేయాలనుకుంటోందని అంటున్నారు. మరో వైపు కుప్పంలో లోకేష్ పాదయాత్ర రోజున ఆయనను అడ్డుకుందామని.. దాడులు చేద్దామని.. వైఎస్ఆర్‌సీపీ తరపున కొంత మంది నేతలు సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారు. కుప్పం నియోజకవర్గం శాంతి పురం మండలం ఎంపీపీ కోదండరెడ్డి ఇచ్చిన ఈ పిలుపు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

లోకేష్ పాదయాత్రకు వైసీపీ ద్వారా కానీ.. ప్రభుత్వం ద్వారా కానీ ప్రస్తుతం ప్రచారం విస్తృతంగా లభిస్తోంది. ఈ పాదయాత్రకు ఆటంకాలు ఏర్పడితే ప్రభుత్వానికి.. చేతకాని పాలనకు బ్రాండ్‌గా మారిపోతుంది. జగన్మోహన్ రెడ్డి సుదీర్ఘ కాలం పాదయాత్ర, ఓదార్పు యాత్రలు చేసే అధికారంలోకి వచ్చారు. ఆయన ఎప్పుడూ అనుమతులు తీసుకోలేదు. అనుమతులు అవసరం లేదని వైసీపీ నేతలు చేసిన ప్రకటనలు కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

అలా చేస్తే రాహుల్ నపుంసకుడో కాదో తేలుతుంది..కాంగ్రెస్ నేత సంచలన వ్యాఖ్యలు

ఎన్నికలు వచ్చిన ప్రతిసారి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పెళ్లి విషయంపై బీజేపీ నేతలు కామెంట్స్ చేయడం పరిపాటిగా మారింది. ఆయనకు మగతనం లేదని అందుకే పెళ్లి చేసుకునేందుకు భయపడుతున్నారని బీజేపీ నేతలు...

బీజేపీకి రాజాసింగ్ షాక్…ఏం జరిగిందంటే..?

హైదరాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి మాధవీలత నామినేషన్ కు ఎమ్మెల్యే రాజాసింగ్ డుమ్మా కొట్టారు.హైదరాబాద్ సెగ్మెంట్ ఇంచార్జ్ గా తన అభిప్రాయాన్ని తీసుకోకుండానే ఏకపక్షంగా మాధవీలత అభ్యర్థిత్వాన్ని ఫిక్స్ చేశారని రాజాసింగ్ అసంతృప్తిగా...

తెలంగాణలో ఛాలెంజింగ్ పాలిటిక్స్

లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ హోరాహోరీగా తలపడుతున్నాయి. ప్రజాభిప్రాయం ఎలా ఉన్నా మెజార్టీ సీట్లు మావంటే మావేనని ప్రకటిస్తున్నాయి. ప్రత్యర్ధి పార్టీలపై ఆయా పార్టీల నేతలు విమర్శలు, ప్రతి విమర్శలు...

కొనసాగింపు కథల బాక్సాఫీసు వేట

‘బాహుబలి’ సినిమా సైజ్ ని పెంచింది. ప్రేక్షకులందరికీ థియేటర్స్ లోకి తీసుకురాగలిగితే బాక్సాఫీసు వద్ద ఎలాంటి మాయ చేయొచ్చు నిరూపించింది. సినిమా కథకు కూడా కొత్త ఈక్వేషన్ ఇచ్చింది. బహుబలికి ముందు దాదాపు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close