సీత కష్టాలు సీతవి

దర్శకుడు తేజ వ్యవహారం కాస్త డిఫరెంట్ గా వుంటుంది. ఆయన ఎవడి మాటా వినని సీతయ్య టైపు. సినిమా మొదలయ్యిందంటే ఆయన మాటే నెగ్గుతుంది. ఆయనే ఏదయినా చెప్పాలి. చేయాలి. నిర్మాతకు, హీరోకి పెద్దగా సీన్ వుండదు. ఇప్పుడు ఆయన ఎకె ఎంటర్ టైన్ మెంట్స్ లో సీత అనే సినిమా చేస్తున్నారు. బెల్లంకొండ శ్రీనివాస్, కాజల్ అగర్వాల్ కాంబినేషన్.

ఈ సినిమా ఇప్పటికి రెండుసార్లు ఇదిగో వస్తుదని, అదిగో వస్తుందని వినిపించి వాయిదా పడింది. ఇటీవల టీజర్ విడుదల చేసారు. ఏప్రియల్ 25 పక్కా అని కూడా వినిపించేసింది. కానీ ఇప్పుడు లేటెస్ట్ విషయం ఏమిటంటే సీత సినిమా మే 16కు వాయిదా పడిందని. ఏప్రియల్ 25న ఎవెంజర్స్ పెద్ద ఎత్తున విడుదలవుతోంది. అందువల్ల ఓవర్ సీస్ లో థియేటర్లు దొరకడం కష్టం.

ఇక్కడ కూడా ముందువారం నాని నటించిన జెర్సీ విడుదలవుతోంది. అది కూడా మల్టీ ఫ్లెక్స్ మూవీనే. కాంచన విడులవుతోంది. అది బి, సి సెంటర్ల సినిమా. ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని మే 16 కు వెళ్తోంది అంటున్నారు. కానీ ఆ ముందు వారం మహేష్ బాబు సినిమా వుంది. తన సినిమాకు ముందు వారం, వెనుక వారం ఏ సినిమా రావడానికి మహేష్ బాబు ఒప్పుకోరని టాక్ ఇండస్ట్రీలో వుంది.

పైగా ఇది మహేష్ తో తరువాత సినిమా నిర్మించే ఏకె ఎంటర్ టైన్ మెంట్స్ సినిమా. అందువల్ల మహేష్ ను ఇబ్బంది పెట్టే పని వారు పొరపాటున కూడా చేయరు. అందువల్ల మే 16న కూడా వస్తుందన్నది డౌటే. ఆ తరువాత వారం మీద రుమాలు వేసుకోవాలేమో?

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

video

‘ప్ర‌స‌న్న‌వ‌ద‌నం’ ట్రైల‌ర్‌: కొత్త పాయింటే ప‌ట్టారు

https://www.youtube.com/watch?v=uy8tkUFAsnA సుహాస్‌పై ప్రేక్ష‌కుల‌కు ఓ మంచి అభిప్రాయ‌మే ఉంది. త‌ను క‌చ్చితంగా విభిన్న ప్ర‌య‌త్నాలు చేస్తాడ‌నది అంద‌రి న‌మ్మ‌కం. క‌ల‌ర్ ఫొటో నుంచి అంబాజీ పేట మ్యారేజీ బ్యాండు వ‌ర‌కూ త‌న ట్రాక్ రికార్డ్...

హరీష్ రావు ఉత్తుత్తి రాజీనామా – కామెడీ చేసిన కాంగ్రెస్ !

తెలంగాణ ఉద్యమం కోసం ఇప్పటికే ఎన్నో సార్లు రాజీనామా చేశానని.. తనకు పదవులు ఓ లెక్క కాదంటూ చెప్పే హరీష్ రావు.. తాజాగా చేసిన రాజీనామా ఆయనను ట్రోల్ చేసేలా ఉంది....

చేసింది పొన్నవోలే కానీ చేయించింది జగన్ కాదట !

సీబీఐ చార్జిషీట్‌లో వైఎస్ఆర్ పేరును సోనియా గాంధీ పెట్టించారంటూ ఇంత కాలం జగన్ చేస్తున్న ప్రచారానికి షర్మిల ఒకే ఒక్క డైలాగ్ తో చెక్ పెట్టారు. పొన్నవోలు ద్వారా...

నారా భువనేశ్వరి డీప్ ఫేక్ ఆడియోతో వైసీపీ అరాచకం !

ఇంట్లో సొంత కుటుంబసభ్యుల్ని అత్యంత హీనంగా దూషిస్తున్న జగన్మోహన్ రెడ్డి పార్టీ.. ఆ పార్టీ సోషల్ మీడియా విభాగం పూర్తిగా కంట్రోల్ తప్పిపోయింది. ఏకంగా నారా భువనేశ్వరి ఆడియో పేరుతో డీప్ ఫేక్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close