డిఫెన్సివ్ మోడ్‌లో బీజేపీ ప్రచారం..! చేసిన పనులు చెప్పుకోరా..?

భారతీయ జనతా పార్టీ అగ్రనేతలు.. తాము ఏం చేశారో చెప్పుకోలేకపోతున్నారు. మోడీ మళ్లీ వస్తే నోట్ల రద్దు, జీఎస్టీల్లాంటి బతుకుల్ని చిదిమేసే నిర్ణయాలు మరిన్ని తీసుకుంటారంటూ.. విపక్షాలు చేస్తున్న ప్రచారాల్ని మోడీ తిప్పికొట్టలేకపోతున్నారు. కనీసం వాటి ప్రస్తావన చేయడానికి కూడా ఆయన సిద్ధపడటం లేదు. కానీ మోడీ అలా వదిలి పెట్టడం ఎదురుదాడికి దిగుతున్నారు. బీజేపీకి చెప్పుకోవడానికి కారణాలు లేవు. బురదజల్లడం, సాధారణ విషయాలను వివాదాస్పదం చేయడమే తమ రాజకీయ అజెండాగా మార్చుకున్నారు.

ఐదేళ్ల పాటు పాలించి మత విద్వేషాలతో రాజకీయమా..?

నోట్లరద్దు నుంచి పెట్రో ధరల వరకు.. వైఫల్యాలన్నింటినీ లెక్క కట్టి విపక్షాలు ప్రచారం చేస్తున్నాయి. వీటిపై మోడీ ఒక్క మాట కూడా మాట్లాడటం లేదు. మోడీ మాత్రమే కాదు.. బీజేపీ యంత్రాంగం మొత్తం మాట్లాడటం లేదు. అంటే మోదీకి చెప్పుకోవడానికి ఏం లేదు. ఏ అంశాలతో ప్రజల్లోకి వెళ్లాలో తెలియడం లేదు. అందుకే విపక్ష పార్టీపై బురద జల్లి రాజకీయం చేస్తున్నారు. రఫెల్‌ స్కాం పై ..రాహుల్‌ తీవ్రమైన ఆరోపణలు చేస్తున్నా.. మోడీ నోరు తెరవలేకపోతున్నారు. సాధారణ విషయాలను వివాదాస్పదం చేసేందుకు ప్రయత్నించి స్తున్నారు. ఇపుడు మత విద్వేషాలు రెచ్చగొడుతున్నారు. పాక్‌ను బూచిగా చూపిస్తూ.. ఓట్లు రాబట్టే ప్రయత్నం చేస్తున్నారు. వైఫల్యాలు తెరమీదికి రాకుండా… మసిపూసి మారెడుకాయ చేస్తున్నారు. ఐదేళ్ల పాలనలో మోదీ నిర్ణయాలు, పాలసీలపై ప్రజలు భగ్గుమంటున్నారు. కానీ ఎన్నికలకు ముందు సైన్యం సాహసాలను తన క్రెడిట్‌గా చెప్పుకునే ప్రయత్నం చేశారు. చివరికి ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన తర్వాత .. అంతరిక్ష అద్భుతం అంటూ… శాస్త్రవేత్తలు చేసిన దాన్ని కూడా.. తన ఘనతగా ప్రచారం చేసుకున్నారు.

మోడీని వ్యతిరేకిస్తే దర్యాప్తు సంస్థలతో విరుచుకుపడతారా..?

మోదీకి వ్యతిరేకంగా గళం విప్పేవారిపై దాడులు చేస్తున్నారు. వ్యవస్థలను దెబ్బతీసి… విపక్ష నేతలకు ఊపిరి సలపకుండా చేయడం మోదీ పాలసీ. అందుకే మాయావతి, మమత బెనర్జీ, చంద్రబాబు లాంటి నేతలపై సీబీఐ, ఈడీ దాడులు జరుగుతున్నాయని విపక్షాలు అంటున్నాయి. మాట వినని వాళ్లని.. ఈడీ, ఐటీ దాడులతో దారికలోకి తెచ్చుకోవడం మోదీ మార్క్ నియంతృత్వ రాజకీయం. తనకు వ్యతిరేకంగా ఉన్న పక్షాలపై దాడులు చేయించడం.. ఐటీ దాడులతో హడలెత్తించడం.. ఇలా ప్రతిపక్ష నేతల ఆర్థిక మూల స్థంభాలను బద్ధలు కొడుతున్నారు. ఇలా ఎన్నికల్లో గెలవాలనే ప్రయత్నం ఎప్పటినుంచో సాగుతుందన్నది విపక్షాల ఆరోపణ. ఇదే కాదు… సీబీఐ, ఈడీ, ఐటీలను మోదీ పూర్తిగా నిర్వీర్యం చేశారు.

ఈసీ నిజాయితీగా ఉందని ఎవరైనా నమ్ముతారా..?

తన వైఫల్యాల కంటే.. ఎదుటి పార్టీ నేతలను బలహీనవంతులను చేయడమే మోడీ టార్గెట్‌. ఇపుడిదే బలప్రయోగం ఈ ఎన్నికల్లోనూ జరుగుతుందన్న మాటలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా ఈసీపైనా.. కేంద్రం పెత్తనం చెలాయిస్తోందంటూ విపక్షాలు రాష్ట్రపతికి ఫిర్యాదు చేశాయి. ఎన్నికల సంఘం.. బీజేపీ నేతల పట్ల సానుకూలంగా వ్యవహరించడంపైనా తీవ్ర విమర్శలు ఉన్నాయి. అధికారాలన్నీ చేతిలో పెట్టుకుని నియంతృత్వ తరహా స్వభావాలున్న వ్యక్తి నేతృత్వంలో దేశం ఎన్నికలకు వెళ్తే ఎలాంటి క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొంటుందో.. అదే పరిస్థితి ఇప్పుడు కనిపిస్తోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

హైకోర్టు తీర్పుకే వక్రభాష్యం..! ప్రభుత్వం తప్పు మీద తప్పు చేస్తోందా..?

నిమ్మగడ్డ రమేష్‌కుమార్ విషయంలో ప్రభుత్వం తప్పు మీద తప్పు చేస్తోందా.. అన్న అభిప్రాయం న్యాయనిపుణుల్లో వినిపిస్తోంది. ఇప్పటి వరకూ వివిధ కేసుల్లో హైకోర్టు తీర్పును అమలు చేయకుండా.. దొడ్డిదారి ప్రయత్నాలు చేశారు... కానీ...

ప్రభుత్వం సుప్రీంకోర్టుకు వెళ్లే వరకూ రమేష్‌కుమార్ బాధ్యతలు తీసుకోకూడదట..!

స్టేట్ ఎలక్షన్ కమిషనర్‌గా నిమ్మగడ్డ రమేష్‌కుమార్ బాధ్యతలు తీసుకున్నట్లుగా ప్రకటించుకుని.. సిబ్బందికి ఆదేశాలు జారీ చేయడం చట్ట విరుద్ధమని తాజాగా ఏపీ ప్రభుత్వం వాదన వినిపించడం ప్రారంభించింది. సోమవారం.. ఎస్‌ఈసీగా రమేష్...

అన్‌లాక్ 1 : 8వ తేదీ నుంచి హోటళ్లు, ఆలయాలు ఓపెన్..!

దేశంలో లాక్‌డౌన్‌ను కంటెన్మెంట్‌జోన్లకే పరిమితం చేస్తూ... కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. లాక్ డౌన్‌ ముగింపు కోసం.. అన్‌లాక్ పాలసీని ప్రకటించింది. దీనిలో భాగంగా జూన్ ఎనిమిదో తేదీ నుంచి ఆలయాలు, హోటళ్లు,...

ఇన్ సైడ్ న్యూస్: సొంత పత్రిక , ఛానల్ ప్రారంభించడం కోసం జనసేన కసరత్తు

త్వరలోనే సొంత పత్రిక, టీవి ఛానల్ ప్రారంభించాలనే యోచన తో జనసేన పార్టీ ఆ దిశగా అడుగులు వేస్తున్నట్లుగా సమాచారం. ఈ మేరకు పార్టీలో క్యాడర్ నుంచే కాకుండా, పార్టీ ముఖ్య నేతల...

HOT NEWS

[X] Close
[X] Close