అనంతపురంలో రైలు ప్రమాదం

అనంతపురం జిల్లాలో ఈ రోజు తెల్లవారుజామున సుమారు 2.30 గంటల సమయంలో ఘోర రైలు ప్రమాదం జరిగింది. మడకశిర నుండి తాడిపత్రికి గ్రానైట్ తీసుకువెళుతున్న లారీ బ్రేకులు ఫెయిల్ అవడంతో పెనుగొండ సమీపంలో మడకశిర వద్ద రైల్వే లెవెల్ క్రాసింగ్ వద్ద మూసి ఉన్న గేటును డ్డీకొని ట్రాక్ మీదకు చొచ్చుకుపోయి అదే సమయంలో అటుగా వెళుతున్న రైలును లారీ డ్డీ కొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో లారీ డ్రైవర్ అక్కడికక్కడే మరణించగా రైలులో ప్రయాణిస్తున్న కర్నాటకలోని దేవ్ దుర్గ్ ఎమ్మెల్యే వి. వెంకటేష్ నాయక్ తో సహా మరో నలుగురు మరణించారని సమాచారం. యస్-1 నుండి యస్-5వరకు బోగీలు పట్టాలు తప్పడంతో 30మందికి గాయాలయ్యాయి.

లారీలో సుమారు 20 టన్నుల గ్రానైట్ పలకలున్నాయి. లారీ రైలును చాలా బలంగా డ్డీ కొనడంతో వాటిలో కొన్ని పలకలు హెచ్-1 బోగీలోకి దూసుకుపోయాయి. ఆ బోగీలోనే ఉన్నఎమ్మెల్యే వి. వెంకటేష్ నాయక్ తో సహా మరో నలుగురు మరణించారు. ప్రమాదం గురించి తెలుసుకోగానే జిల్లా డిప్యూటీ కలెక్టర్ లక్ష్మీకాంతం, పోలీసులు, వైద్య, సహాయ సిబ్బంది అక్కడికి చేరుకొని తక్షణమే సహాయ చర్యలు చేప్పట్టారు. గాయపడినవారిని ధర్మవరం, పెనుగొండ, అనంతపురం ఆసుపత్రులలో చేర్చి చికిత్స అందిస్తున్నారు. మిగిలిన వారిని బస్సులలో వారివారి గమ్యస్థానాలకి పంపిస్తున్నారు.

జిల్లా మంత్రి పరిటాల సునీత, స్థానిక ఎమ్మెల్యే వికె పార్ధసారధి కూడా అక్కడికి చేరుకొని సహాయక చర్యలు పర్యవేక్షిస్తున్నారు. ప్రయాణికులకు పాలు, నీళ్ళు, ప్రాధమిక చికిత్సకు అవసరమయిన ఏర్పాట్లను చేసారు. ప్రమాదం జరిగిన సమయంలో యస్-1బోగీలో చాలా తక్కువ మంది ప్రయాణికులు ఉండటంతో చాలా ప్రాణనష్టం తప్పింది. ప్రమాదం జరిగిన ప్రదేశం కర్ణాటక రైల్వే జోన్ పరిధిలో ఉన్నందున కర్నాటకకు చెందిన రైల్వే అధికారులు కూడా అక్కడికి చేరుకొన్నారు. ఆ మార్గంగా గుండా వెళ్ళవలసిన అనేక రైళ్ళను వేరే మార్గాలకు మళ్ళించారు. మరికొన్ని రైళ్ళను నిలిపివేశారు. రైల్వే శాఖ హెల్ప్ లైన్ నెంబర్లను ఏర్పాటు చేసింది. హెల్ప్ లైన్ నెంబర్లు: పెనుగొండ:08555 220249 ధర్మవరం:08559 222555, అనంతపురం:08554 236444.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఎక్స్‌క్లూజీవ్‌: పాట‌లే లేకుండా రౌడీ ప్ర‌యోగం

ఇది వ‌ర‌కు సినిమా అంటే ఆరు పాట‌లు ఉండాల్సిందే అనే అలిఖిత నిబంధ‌న ఉండేది. నిన్నా మొన్న‌టి వ‌ర‌కూ ఇదే కొన‌సాగింది. అయితే... ఇప్పుడు సినిమాలో ఒక్క పాట ఉన్నా చాలు, జ‌నాల్లోకి...

ఒకటో తేదీన పించన్లిస్తారా ? మరో 30 మంది వృద్ధుల బలి కోరతారా ?

మళ్లీ ఒకటోతేదీ వస్తోంది. పించన్లు పంచే సమయం వస్తోంది. వారం రోజుల ముందు నుంచే ప్రతిపక్ష పార్టీలు ప్రభుత్వాన్ని అప్రమత్తం చేయడం ప్రారంభించాయి. ప్రభుత్వ యంత్రాంగాన్ని ఉపయోగించుకుని ...

ఎక్ల్‌క్లూజీవ్: ర‌వితేజ ‘దొంగ – పోలీస్‌’ ఆట‌!

ఇటీవ‌ల 'టైగ‌ర్ నాగేశ్వ‌ర‌రావు'లో గ‌జదొంగ‌గా క‌నిపించాడు ర‌వితేజ‌. ఇప్పుడు మ‌ళ్లీ దొంగ‌త‌నాల‌కు సిద్ధ‌మైపోయాడు. ర‌వితేజ క‌థానాయ‌కుడిగా జాతిర‌త్నాలు ఫేమ్ అనుదీప్ ద‌ర్శ‌కత్వంలో ఓ చిత్రం రూపుదిద్దుకొంటోంది. పీపుల్ మీడియా ఫ్యాక్ట‌రీ ఈ చిత్రాన్ని...

ఐటెమ్ గాళ్‌…. పెద్ద స‌మ‌స్యే!

ఇది వ‌ర‌కు ఏ సినిమాలో ఏ హీరోయిన్‌ని తీసుకోవాలా? అని ద‌ర్శ‌క నిర్మాత‌లు త‌ర్జ‌న భ‌ర్జ‌న‌లు ప‌డేవారు. అనుకొన్నంత స్థాయిలో, సంఖ్య‌లో హీరోయిన్లు లేక‌పోవ‌డం, స్టార్ హీరోల క్రేజ్‌కు స‌రిప‌డా క‌థానాయిక‌లు దొర‌క్క‌పోవ‌డంతో...

HOT NEWS

css.php
[X] Close
[X] Close