రివ్యూ : #బిఎఫ్ఎఫ్

యూత్ ఫుల్ కంటెంట్ క్రియేట్ చేయడంలో డైసీ మీడియా తనకంటూ ఒక మార్క్ క్రియేట్ చేసుకుంది. యూట్యూబ్ వేదికగా లక్షల ఫాలోవర్స్ ని సంపాయించుకుంది. ఆ ఛానల్ లో ట్రెండింగ్ కంటెంట్ వస్తుంటుంది. అందులో వచ్చిన ”ఆడల్టింగ్” సిరిస్ పాపులర్. యూత్ ఆడియన్స్ ఆ సిరిస్ కి బాగా కనెక్ట్ అయ్యారు. ప్రతి ఎపిసోడ్ కి మిలియన్స్ వ్యూస్ దక్కాయి. ఇప్పుడు అదే సిరిస్ ని భార్గవ్ మాచర్ల దర్శకుడిగా #బిఎఫ్ఎఫ్ పేరతో రీమేక్ చేసి ‘ఆహా’ ఓటీటీలో విడుదల చేశారు. సిరి హన్మంత్, రమ్య పసుపులేటి ప్రధాన పాత్రలు పోషించిన #బిఎఫ్ఎఫ్ సీరిస్ లోకి వెళితే..

నిత్య (సిరి హన్మంత్) తార (రమ్య పసుపులేటి) ఇద్దరు ఫ్లాట్ మేట్స్. వీరిద్దరి మధ్య స్నేహం, కోపం, అలక, వారి జాబ్ లో ఎదురయ్యే సవాళ్ళు, ఫ్లాట్ కోసం వాళ్ళు పడే పాట్లు .. ఇలా ఐదు ఎపిసోడ్స్ లో చూపించారు. అయ్యయో జేబులు ఖాళీ ఆయనే, అమ్మ మేము హైదరాబాద్, ఒట్టుతీసి గట్టుమీద పెట్టు, బాస్ బాదితులు, అప్పుడు ఇప్పుడు. ప్రతి ఎపిసోడ్ ది భిన్నమైన కథ. కథ అనడం కంటే పరిస్థితి అనడం సబబు.

నిజానికి యూట్యూబ్ కంటెంట్ ఇది. లిమిటడ్ బడ్జెట్ లో ఛానల్ కి కంటెంట్ పెంచడానికి ఒక ఫ్లాట్ ని తీసుకొని రెండు పాత్రలతో అందులోనే ఎపిసోడ్లకు ఎపిసోడ్లు లాగించేసే వ్యవహారం. ఐతే ”ఆడల్టింగ్’ సిరిస్ పాపులర్ అవ్వడానికి కారణం.. ఐష అహ్మద్, యశస్వినీ దయామల కెమిస్ట్రీ మెయిన్ రీజన్. ఈ సిరిస్ చేయకముందే వాళ్ళు మంచి ఫ్రండ్స్. అలాగే పేస్ బుక్, ఇన్స్టా, ట్విట్టర్ లాంటి సోషల్ మీడియా వేదికలపై వారు చేసిన వీడియోస్ వైరల్ అయ్యాయి. ఆ క్రేజు కూడా ”ఆడల్టింగ్” కి కలిసొచ్చింది. ఐతే #బిఎఫ్ఎఫ్ లో మాత్రం నిత్య, తార పాత్రలు ఆ మ్యాజిక్ ని క్రియేట్ చేయలేకపోయాయి. ఎంత ఫాస్ట్ కల్చరైనా నార్త్ కి సౌత్ కి తేడా వుంది. నార్త్ అమ్మాయి ఆలోచనలకు సౌత్ అమ్మాయిల ఆలోచనలకు స్పష్టమైన తేడా వుంటుంది. ”ఆడల్టింగ్”కి రిమేక్ గా వచ్చిన ఈ సిరిస్ కల్చర్ వైజ్ గా పెద్ద మార్పులు చేయలేదు. డైలాగులు, పాత్రలు దాదాపు వున్నవి వున్నట్లుగానే వాడేశారు. దీంతో చాలా చోట్ల అసహజంగా అనిపిస్తుంది.

”ఆడల్టింగ్” లో పాత్రల నుండే ఫన్ పుడుతుంది. బాడీ లాంగ్వేజ్, ఎక్స్ ప్రెషన్స్ చాలా యాక్టివ్ గా వుంటాయి. #బిఎఫ్ఎఫ్ వచ్చేసరికి పాత్రలని కాస్త నీరసంగా డిజైన్ చేశారు. నిలబడి పేజీల కొద్ది డైలాగులు చెబుతుంటారే కానీ అందులో ఎమోషన్ మాత్రం కనపడదు. పైగా డాబర్ గులబరి , తెనాలి డబుల్ హార్స్ మినప గుళ్ళు , డాబర్ హనీ, వాటిక హెయిర్ ఆయిల్ ఇలా ప్రోడక్టలని ప్రోమోట్ చేసి చెప్పే డైలాగులు మరీ హాస్యాస్పదంగా వుంటాయి. ఎంత సమర్పుకులైతే మాత్రం ఈ స్థాయిలో పబ్లిసిటీ డైలాగులు రాయించుకోవడం టూమచ్ అనిపిస్తుంది.

ఎపిసోడ్ల వారిగా చూసుకుంటే.. అమ్మ మేము హైదరాబాద్, బాస్ బాదితులు కాస్త ఫర్వాలేదనిపించాయి. అమ్మ మేము హైదరాబాద్ ఎపిసోడ్ లో అమ్మ పాత్రని చాలా డిఫరెంట్ గా డిజైన్ చేశారు. పిల్లలు మందు సిగరెట్ తాగుతున్నా పెద్దగా కంప్లయింట్ చేయదు. తాగడం హెల్త్ కి మంచిదికాదని చెప్పి సరదా వాళ్ళతో కలసి మందు కొడుతుంది. ఆ సంగతి భర్తకి కూడా చెబుతుంది. ఇదో వెరైటీ మోడ్రన్ మదర్ అనుకోవచ్చు. ముంబై ఆడల్టింగ్ కాపీ పేస్ట్ అనుకోవచ్చు. బాస్ బాదితులు ఎపిసోడ్ లో జెండర్ ఇన్ ఈక్యాలిటీని చాలా లైటర్ వెయిన్ లో చూపించారు.

సిరి హన్మంత్, రమ్య పసుపులేటి తమ పాత్రల వరకూ ఓకే. ఐతే ఆడల్టింగ్ లో వున్న ఎనర్జీని మ్యాచ్ చేయలేకపోయారు. తల్లిగా కనిపించిన యాంకర్ అంజలి మెప్పించింది. ఆ పాత్రని చాలా సెటిల్ గా పోషించింది. మిగతా పాత్రలకు పెద్ద ప్రాధాన్యం లేదు. డైలాగు రైటర్ పేజీల కొద్ది మాటలు రాశాడు. దర్శకుడు నేటివిటీ మీద ఇంకాస్త వర్క్ చేయాల్సింది. నిత్య, తార కెమిస్ట్రీ వర్క్ అవుట్ అవుతుందా లేదా ? చెక్ చేసుకోవాల్సింది. ముఖ్యంగా ఫ్రీ గా బ్రౌ చేసుకునే యూట్యూబ్ కి, డబ్బులు చెల్లించి చందాదారులుగా వుండే ఓటీటీ ప్రేక్షకుల మధ్య తేడాని గుర్తించి వర్క్ చేసుకుంటే కాస్త బెటర్ గా వుండేది.

మరీ ఖాళీగా వుండి చూడటానికి కంటెంట్ ఏమీ లేకపోతే.. #బిఎఫ్ఎఫ్ క్లిక్ చేయొచ్చు., కానీ పూర్తి చేయాలంటే మాత్రం చాలా ఓపిక కావాలి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

చిరంజీవికి కిషన్ రెడ్డి ఆహ్వానం – వెళ్లక తప్పుతుందా ?

చిరంజీవి ఆకర్షించేందుకు బీజేపీ ప్రణాళికలు సిద్ధం చేసుకున్నట్లుగా కనిపిస్తోంది. భీమవరంలో జరగనున్న ఆజాదీకా అమృత్ మహోత్సవ్ వేడుకలకు చిరంజీవి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అధికారికంగా ఆహ్వానించారు. ఈ ఉత్సవాల్లో భాగంగా ప్రధానమంత్రి...

జనసేనాని జనవాణి !

జనసేన అధినేత పవన్ కల్యాణ్ అధికారంలోకి రాక ముందే ప్రజా సమస్యల పరిష్కారం కోసం నడుం బిగించారు. బాదితులను ప్రభుత్వం ఏ మాత్రం పట్టించుకోకపోతూండటమే కాదు.. అసలు అర్జీలు కూడా తీసుకోవడం...

మోహన్‌బాబు బీజేపీ మనిషట.. అయితే కోర్టులు సమన్లివ్వకూడదా ?

తాను బీజేపీ మనిషినని మోహన్ బాబు తిరుపతి కోర్టు ఎదుట బహిరంగంగా చెప్పుకున్నారు. ఆయన ఏ పార్టీ మనిషని ఏ మీడియా ప్రతినిధి అడగలేదు. కానీ ఆయనంతటకు ఆయనే చెప్పుకున్నారు. తాను బీజేపీ...

ఈ రెడ్డి ఎమ్మెల్యేపైనా వైసీపీ నేతలే కుట్ర చేస్తున్నారట !

వైసీపీలో కీలక నేతలు తమపై సొంత పార్టీ నేతలే కుట్రలు చేస్తున్నారని అనుమానంతో బతికేస్తున్నారు. రోజుకొకరు చొప్పున మీడియా ముందుకు వస్తున్నారు మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి ఈ తరహా ఆరోపణలు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close