హ‌మ్మ‌య్య… ముఖేష్ గాడి గోల లేదు

ఏ సినిమాకెళ్లినా… ముఖేష్ యాడ్ ని భ‌రించాల్సిందే. హాయిగా సినిమా చూద్దామ‌ని వస్తే.. ఈ గోలేంట్రా అని త‌ల‌లు ప‌ట్టుకుంటుంటారు ప్రేక్ష‌కులు. కాక‌పోతే.. ధూమ‌పానం, మద్య‌పానం గురించి ప్ర‌జ‌ల్ని అప్ర‌మ‌త్తం చేయాల్సిన బాధ్య‌త తో జోడించిన ప్ర‌కట‌న అది. సినిమాల్లో సిగ‌రెట్ తాగ‌డం చాలా కామ‌న్‌గా క‌నిపిస్తుంది. కాబ‌ట్టి.. ప్రేక్ష‌కుల్ని ఆ రూపంలో మేల్కొల‌పాల్సిందే. అయితే.. `ఎఫ్ 3`లో ఈ గోల లేదు. ఇందులో ముఖేష్ యాడ్ క‌నిపించ‌దు. ఎందుకంటే.. ఈ సినిమాని వీలైనంత క్లీన్ గా చూపించాల‌న్న ఉద్దేశంతో సిగ‌రెట్టు, మ‌ద్యం.. ఇలాంటి స‌న్నివేశాల్ని ఈ సినిమాలో చూపించ‌లేదు. అందుకే సెన్సార్ కూడా క్లీన్ `యూ` స‌ర్టిఫికెట్ ఇచ్చింది. కుటుంబ స‌మేతంగా ప్రేక్ష‌కుల్ని థియేట‌ర్ల‌కు ర‌ప్పించాల‌ని దిల్ రాజు కంక‌ణం క‌ట్టుకొని తీసిన సినిమా ఇది. అందుకే `ఈ సినిమాలో ఎవ‌రూ సిగ‌రెట్ తాగ‌కూడ‌దు. మ‌ద్యం ముట్ట‌కూడ‌దు` అని దిల్ రాజు స్ట్రిక్ట్ రూల్ పాస్ చేశార్ట‌. అందుకే ఒక్క స‌న్నివేశంలో కూడా అవేం క‌నిపించ‌కుండా జాగ్ర‌త్త ప‌డ్డాడు అనిల్ రావిపూడి. ఫ్యామిలీ ఆడియ‌న్స్‌ని టార్గెట్ చేసే సినిమాల‌న్నీ… ఈ నిబంధ‌న పాటిస్తే బాగుంటుందేమో..?

ర‌న్ టైమ్ కూడా చాలా షార్ప్ గా కట్ చేశారు. 2 గంట‌ల 20 నిమిషాలంటే.. ప‌ర్‌ఫెక్ట్ టైమింగ్ అని చెప్పాలి. ఎఫ్ 2లో పూర్తిగా ఫ‌న్ మీదే దృష్టి పెట్టాడు రావిపూడి. అయితే సారి ఫ‌న్ డోస్ పెంచుతూనే, ఎమోష‌న్‌పైనా గురి పెట్టాడ‌ట‌. ద్వితీయార్థంలో కొన్ని ఎమోష‌న్ సీన్లు బాగా డిజైన్ చేశాడ‌ని, అవ‌న్నీ కుటుంబ ప్రేక్ష‌కుల‌కు న‌చ్చుతాయ‌ని చిత్ర‌బృందం న‌మ్మ‌కంగా ఉంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

అమరావతిలో “కట్టిన గ్రాఫిక్స్” అద్దెక్కిస్తున్న జగన్ సర్కార్ !

అమరావతి భూముల్ని వేలం వేయడమే కాదు ఇప్పుడు అక్కడ కట్టిన భవనాలను కూడా అద్దెకు ఇవ్వాలని సీఎం జగన్ నిర్ణయించారు. ఈ మేరకు సీఆర్డీఏ ప్రతిపాదించింది. సీఎం జగన్ ఆమోదించేశారు. అమరావతిలో...

ఏపీలో ధియేటర్లు మూతబడతాయా !?

ఆన్‌లైన్ టిక్కెట్లు, సినిమాల కలెక్షన్లను గుప్పిట పెట్టుకోవాలని ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలు వర్కవుట్ కావట్లేదు. తమ ఆదాయాన్నంతా ప్రభుత్వం చేతుల్లో పెట్టి.. ప్రభుత్వం ఇచ్చే దాని కోసం వెయిట్ చేయడం కన్నా ...

ఏపీలో మోడీ బహిరంగసభ లేనట్లే !

హైదరాబాద్‌లో రెండు రోజుల పాటు జాతీయ కార్యవర్గ సమావేశాలు నిర్వహించాలని ప్లాన్ చేసిన బీజేపీ నేతలు.. ఓ బహిరంగసభకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. పది లక్షల మందిని సమీకరిస్తామని బీజేపీ నేతలు...

లక్ష మెజార్టీ రాలే.. లక్ష ఓట్లొచ్చాయ్ !

ఆత్మకూరు అసెంబ్లీ ఉపఎన్నికల్లో లక్ష ఓట్ల మెజార్టీ తెచ్చుకోవాలని తాపత్రయపడిన వైసీపీకి లక్ష ఓట్లే రావడంతో ఆ ఆశ నెరవేరలేదు. పోలింగ్ శాతం బాగా పడిపోవడంతో... పోలైన ఓట్లలో లక్ష వైసీపీకి.....

HOT NEWS

css.php
[X] Close
[X] Close