ప్ర‌భాస్ కోసం భాగ్య‌శ్రీ వ‌చ్చింది… వెళ్లింది

ప్ర‌భాస్ కొత్త సినిమా ‘జాన్‌’ (వ‌ర్కింగ్ టైటిల్‌)లో మ‌రో స్పెష‌ల్ ఆఫ్ ఎట్రాక్ష‌న్ చేరింది. ఈ సినిమాలో అల‌నాటి బాలీవుడ్ అందాల తార భాగ్య‌శ్రీ న‌టిస్తోంది. ప్ర‌భాస్ త‌ల్లిగా భాగ్య‌శ్రీ క‌నిపించబోతోంది. ఈనెల 17 నుంచి హైద‌రాబాద్‌లో `జాన్` కొత్త షెడ్యూల్ మొద‌లైన సంగ‌తి తెలిసిందే. ఈ షెడ్యూల్‌లోనే భాగ్య‌శ్రీ అడుగు పెట్టింది. ఈరోజు (బుధ‌వారం)తో ఆమెపై తెర‌కెక్కించాల్సిన స‌న్నివేశాలు పూర్త‌యిపోయాయి. ఆమె షూటింగ్‌కి పేక‌ప్ చెప్పేసి ముంబై వెళ్లిపోయింది కూడా. ఈ షెడ్యూల్‌లో ప్ర‌భాస్, భాగ్య‌శ్రీ‌పై కొన్ని ఎమోష‌న‌ల్ సీన్స్ తెర‌కెక్కించిన‌ట్టు స‌మాచారం. ‘సాహో’లానే ‘జాన్‌’ని కూడా పాన్ ఇండియా సినిమాగా విడుద‌ల చేస్తున్నారు. అందుకే కీల‌క‌మైన న‌టీన‌టుల్ని బాలీవుడ్ నుంచి దిగుమ‌తి చేసుకుంటున్నారు. అందులో భాగంగానే భాగ్యశ్రీ వ‌చ్చి చేరింది. అనువాద చిత్రం ‘ప్రేమ పావురాలు’తో భాగ్య‌శ్రీ తెలుగు ప్రేక్ష‌కుల మన‌సుల్ని గెలుచుకుంది. అప్ప‌టి నుంచీ.. ప్రేమ పావురాలు అన‌గానే భాగ్య‌శ్రీ గుర్తుకు వ‌స్తుంటుంది. ఇంత కాలానికి ఆమెను తెలుగు తెర‌పై చూడ‌బోతున్నాం. మ‌రి ఆమె రాక ఈ సినిమాకి ఎంత వ‌ర‌కూ ప్ల‌స్ అవుతుందో చూడాలి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

టికెట్ల రేట్ల పెంపు.. సామాన్యుడిపై మ‌రింత భారం

ప్రేక్ష‌కుల్ని మ‌ళ్లీ థియేట‌ర్ల‌కు ర‌ప్పించ‌డం ఎలా? అనే విష‌యం ఎలాగో తెలీక‌... చిత్ర‌సీమ త‌ల‌లు ప‌ట్టుకుంటోంది. ఇది వ‌ర‌కే... థియేట‌ర్ల‌కు రావ‌డం బాగా త‌గ్గిపోయింది. ఇప్పుడు ఓటీటీల హ‌వా ఎక్కువ‌య్యాక‌.... అది...

దుబ్బాక వర్సెస్ తిరుపతి..! ఏపీ బీజేపీ ఎక్కడుంది..!?

దుబ్బాకలో బీజేపీ గెలిచిందని.. తాము తిరుపతిలో గెలిచేస్తామని ఏపీ బీజేపీ నేతలు ప్రకటనల మీద ప్రకటనలు చేస్తున్నారు. ఇక గెలిచేసినట్లుగానే ఊహించుకుని సంబరాలకు సిద్ధమవుతున్నారు. కానీ దుబ్బాకలో బీజేపీ నేతలు పడిన కష్టంలో.....

తిరుపతి టీడీపీ అభ్యర్థి ఇంత వరకూ నోరు తెరవలేదేమి..!?

తిరుపతి ఉపఎన్నికకు టీడీపీ అభ్యర్థిగా పనబాక లక్ష్మిని చంద్రబాబు ఖరారు చేశారు. వారం రోజులు గడుస్తున్నా.. ఆమె వైపు నుంచి అధికారిక స్పందన రాలేదు. దీంతో ఆమె పోటీకి విముఖత చూపుతున్నారన్న ప్రచారాన్ని...

అమరావతికి ఎంత ఖర్చు పెట్టారో కూడా చెప్పలేరా..!?

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాజధాని అమరావతికి ఎంత మొత్తం ఖర్చు పెట్టారో చెప్పాలని హైకోర్టు చాలా రోజుల కిందట ఆదేశించింది. ముఖ్యమంత్రి సమీక్ష చేస్తే... అణా.. పైసలతో సహా క్షణాల్లో లెక్కలు తీసుకెళ్లే అధికారులు...

HOT NEWS

[X] Close
[X] Close