బ‌న్నీపై ఆశ చావ‌లేదు

‘ఒక్క క్ష‌ణం’ త‌ర‌వాత వీఐ ఆనంద్ గీతా ఆర్ట్స్ కాంపౌండ్‌లోనే మ‌కాం వేశాడు. అల్లు అర్జున్‌తో ఓ సినిమా చేయ‌బోతున్నాడ‌ని ప్ర‌చారం జ‌రిగింది. అప్ప‌టికి బ‌న్నీ కూడా కొత్త క‌థ‌ల కోసం అన్వేషిస్తుండ‌డంతో… వీఐ ఆనంద్‌తో భేటీ జ‌రిగింది. ఆనంద్ ఓ క‌థ వినిపించ‌డం, అది బ‌న్నీకి న‌చ్చ‌డం జ‌రిగాయి. అయితే ఎందుకో అది ప‌క్క‌కు వెళ్లిపోయింది. ఆ త‌ర‌వాత ఈ ద‌ర్శ‌కుడికి ‘డిస్కోరాజా’ ఆఫ‌ర్ వ‌చ్చింది. అయితే ఇప్ప‌టికీ బ‌న్నీ సినిమాపై న‌మ్మ‌కాలు త‌గ్గ‌లేదు. అల్లు అర్జున్‌తో ఓ సినిమా చేస్తాన‌ని ధీమాగా చెబుతున్నాడీ ద‌ర్శ‌కుడు.

”అల్లు అర్జున్‌కి ఇది వ‌ర‌కే ఓ క‌థ వినిపించా. చేస్తా అన్నారు.కానీ అప్పుడు కుద‌ర్లేదు. భ‌విష్య‌త్తులో త‌ప్ప‌కుండా చేస్తా. గీతా ఆర్ట్స్‌లో ఓ సినిమా ఉంటుంది. అది బ‌న్నీతోనా, మ‌రో హీరో ఉంటారా? అనేది ఇప్పుడే చెప్ప‌లేను. నిఖిల్‌తో ఓ సినిమా చేస్తున్నా.. ” అని చెప్పుకొచ్చారు విఐ ఆనంద్‌. డిస్కోరాజా హిట్ట‌యితే… డిస్కోరాజాకి సీక్వెల్ తెర‌పైకి వెళ్తుంది. ఇప్ప‌టికే డిస్కోరాజా 2 చేస్తామ‌ని ర‌వితేజ ధీమాగా చెప్పేశాడు. మ‌రి సీక్వెల్ ఉంటుందా, లేదా? అనేది తెలియాలంటే శుక్ర‌వారం వ‌ర‌కూ ఆగాలి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com