మాజీ ప్రధాని పీవీ నరసింహారావుకు భారతరత్న

దేశ ఆర్థిక వ్య‌వ‌స్థ‌ను గాడిన పెట్టి, ఎన్నో అవంత‌రాల‌ను ఎదుర్కొంటూ దేశాన్ని ప్ర‌పంచం ముందు సొంత కాళ్ల‌పై నిల‌బెట్టిన మాజీ ప్ర‌ధాని పీవీ న‌ర్సింహ‌రావుకు గొప్ప గౌర‌వం ద‌క్కింది. మాజీ ప్ర‌ధాని పీవీకి కేంద్ర ప్ర‌భుత్వం దేశ అత్యున్న‌త పుర‌స్కారం అయిన భార‌త ర‌త్న పుర‌స్కారం ప్ర‌క‌టించింది.

భార‌త ర‌త్న పొందిన తొలి తెలుగు వ్య‌క్తిగా పీవీకి గౌర‌వం ద‌క్క‌గా… పీవీ న‌ర్సింహ‌రావు తెలంగాణ‌లోని ఉమ్మ‌డి వ‌రంగల్ జిల్లాకు చెందిన న‌ర్సంపేటలో జ‌న్మించారు. ఉమ్మ‌డి ఆంధ్ర‌ప్ర‌దేశ్ లోని నంధ్యాల ఎంపీగా గెలిచి ప్ర‌ధాని అయ్యారు పీవీ.

పీవీ న‌ర్సింహ‌రావు ఏపీ నుండే కాదు మ‌హారాష్ట్రలోని రామ్ టెక్ లోక్ స‌భ స్థానం నుండి వ‌రుస‌గా రెండుసార్లు గెలుపొంద‌గా, ఒడిశాలోని బ్ర‌హ్మ‌పుర్ స్థానం నుండి కూడా లోక్ స‌భ‌కు గెలుపొంద‌టం విశేషం.

మైనారిటీ ప్ర‌భుత్వాన్ని కేంద్రంలో స‌క్సెస్ ఫుల్ గా న‌డిపిన పీవీ… దేశంలోని అన్ని భాష‌ల్లోనూ ఆయ‌న‌కు ప్రావీణ్యం ఉండ‌టం విశేషం. దాదాపు 17 భార‌తీయ భాష‌ల‌తో పాటు ఇత‌ర దేశాల భాష‌ల్లోనూ ఆయ‌న అన‌ర్గ‌ళంగా మాట్లాడ‌గ‌ల స‌త్తా ఉన్న వ్య‌క్తి.

అప్ప‌టి వాజ్ పేయి ప్ర‌భుత్వం 1998లో నిర్వ‌హించిన న్యూక్లియ‌ర్ ప‌రీక్ష‌లు 1996లోనే చేయాల్సింది. అప్ప‌టి ప్ర‌ధానిగా పీవీ ప్ర‌త్యేక దృష్టి పెట్టి స‌హ‌య స‌హ‌కారాలు అందించ‌గా, 1996 ఎన్నిక‌ల్లో ప్ర‌భుత్వం మారిపోవ‌టంతో న్యూక్లియ‌ర్ ప‌రీక్ష‌లు వాయిదా ప‌డ్డాయి. దీంతో పీవీ… అప్ప‌టి ప్ర‌ధాని వాజ్ పేయి తో మాట్లాడి, న్యూక్లియ‌ర్ ప‌రీక్ష‌లు జ‌ర‌గ‌టంలో చొర‌వ చూపార‌ని అప్ప‌ట్లో ద‌గ్గ‌ర చూసిన వారు అంటుంటారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

నోరు జారిన ర‌చ‌యిత‌.. ఫైర్ అవుతున్న ఫ్యాన్స్

తోట‌ప‌ల్లి మ‌ధు... ఈ త‌రానికి పెద్ద‌గా ఈ ర‌చ‌యిత పేరు తెలియ‌క‌పోవొచ్చు కానీ, 90ల్లో వ‌చ్చిన కొన్ని సినిమాల‌కు ఆయ‌న మాట‌లు అందించారు. కొన్ని పెద్ద హిట్లు కొట్టారు. న‌టుడిగానూ త‌న‌దైన ముద్ర...

బడా బాయ్ కి కోపమొచ్చింది… ఛోటా బాయి కి సమన్లు వచ్చాయి..!!

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, మోడీని బడా భాయి అని పిలిచినా,సరదాగా ఆహ్వానించినా రాజకీయాల్లో తమ్ముడు.. తమ్ముడే.. పేకాట.. పేకాటే అని నిరూపిస్తున్నారు బీజేపీ నేతలు. బడా భాయి అని మోడీని ఉద్దేశించి...

లోక్ సభ ఎన్నికలు…బీఆర్ఎస్ కు సెంటిమెంట్ అస్త్రం దొరికిందోచ్

లోక్ సభ ఎన్నికలు బీఆర్ఎస్ కు జీవన్మరణ సమస్యగా మారాయి. ఈ ఎన్నికల్లో ఎలాగైనా గెలిచి తీరాల్సిన అనివార్యత బీఆర్ఎస్ కు ఏర్పడింది. కానీ, క్షేత్రస్థాయిలో ఆ పార్టీ మెజార్టీ సీట్లు గెలుచుకునే...

తండేల్ @ రూ.40 కోట్లు

నాగచైతన్య 'తండేల్' సినిమాపై బోలెడు ఆశలు పెట్టుకున్నారు. కార్తికేయ2 తర్వాత చందూ మొండేటి నుంచి వస్తున్న సినిమా ఇది. బన్నీ వాస్‌ నిర్మాత. సాయిపల్లవి కథానాయిక. అల్లు అరవింద్‌ సమర్పిస్తున్నారు. ప్రస్తుతం ఈ...

HOT NEWS

css.php
[X] Close
[X] Close