భారతి సిమెంట్స్‌కు జగన్ సీఎంగా ఉన్నప్పుడు కడప జిల్లాలోని ఎర్రగుంట్ల, కమలాపురం మండలాల్లో సుమారు 744 ఎకరాల సున్నపురాయి మైనింగ్ లీజును 50 ఏళ్ల పాటు కేటాయించింది. అయితే, ఈ కేటాయింపుల్లో నిబంధనల ఉల్లంఘన జరిగిందని కూటమి ప్రభుత్వం ప్రాథమికంగా నిర్ధారించింది. ముఖ్యంగా, 2015లో కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన గనులు, ఖనిజాల అభివృద్ధి నియంత్రణ సవరణ చట్టం ప్రకారం.. ప్రధాన ఖనిజాల లీజులను కేవలం బహిరంగ వేలం ద్వారా మాత్రమే కేటాయించాలి. కానీ, భారతి సిమెంట్స్‌కు పాత దరఖాస్తుల పేరుతో లీజులు ఇచ్చేసశారు. ఈవిషయాన్ని కేంద్రం గుర్తించి చర్యలు తీసుకోవాలని రాష్ట్రాన్ని ఆదేశించింది.
అధికారం అండతో అప్పనంగా దోపిడీ
ఈ వివాదం మూలాలు 2009 నాటి రఘురామ్ సిమెంట్స్ నాటివి. ఈ కంపెనీని తర్వాత జగన్ కొనుగోలు చేశారు. భారతి సిమెంట్స్ గా పేరు మార్చారు. అప్పట్లో కేటాయించిన లెటర్ ఆఫ్ ఇంటెంట్ గడువు ముగిసినా, పర్యావరణ అనుమతులు పొందకపోయినా, గత ప్రభుత్వం వాటిని పునరుద్ధరించింది. 2018లో అప్పటి ప్రభుత్వం వీటిని రద్దు చేయగా, జగన్ ముఖ్యమంత్రి అయ్యాక హైకోర్టు ఆదేశాలను తమకు అనుకూలంగా వక్రీకరించి, ఎన్నికల నోటిఫికేషన్ రాకముందే హడావిడిగా లీజులు కట్టబెట్టుకున్నారు. ఇదే తరహాలో వేలం లేకుండా లీజులు పొందిన ఏసీసీ , రామ్‌కో సిమెంట్స్ సంస్థలకు కూడా ప్రభుత్వం నోటీసులు జారీ చేసింది.
వివరణ ఇచ్చిన ఆ రెండు సంస్థలు – భారతి సిమెంట్స్ ఎదురుదాడి
తమకు లీజులు కేటాయించిన వైనంపై ఏసీసీ, రామ్‌కో ప్రభుత్వానికి వివరణ ఇచ్చాయి. కానీ భారతి సిమెంట్స్ మాత్రం ఎదురుదాడి చేస్తోంది. లీజులు కేటాయించిన నిర్ణయాల వివరాలు, నోట్ ఫైల్స్ కావాలని డిమాండ్ చేస్తోంది. అసలు దానికి, దీనికి సంబంధం ఏమిటో తెలియదు. న్యాయసలహా పేరుతో కొంత మంది మాజీ న్యాయమూర్తులను సైతం ఇందులో వాడుకుని వాళ్లను కూడా రిస్క్ లో పెట్టారు. ఇప్పుడు కూడా వాళ్లనే బలి పశువుల్ని చేసి తన లీజుల్ని కాపాడుకునేందుకు కుట్రుల చేస్తున్నారు.
భారతి సిమెంట్స్ మూసివేత తప్పదా?
ఈ లీజులు రద్దయితే భారతి సిమెంట్స్ ఉత్పత్తిపై తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉంది. సిమెంట్ తయారీకి ప్రధాన ముడిసరుకు అయిన సున్నపురాయి సొంత గనుల నుండి లభించకపోతే, కంపెనీ బయటి మార్కెట్ లేదా ఇతర ప్రైవేట్ మైనింగ్ లీజుదారులపై ఆధారపడాల్సి ఉంటుంది. సొంత గనులు లేకపోవడం వల్ల ముడిసరుకు రవాణా, కొనుగోలు వ్యయం భారీగా పెరుగుతుంది. అడ్వకేట్ జనరల్ నివేదిక , కేంద్ర గనుల శాఖ పదేపదే చేస్తున్న హెచ్చరికల కారణంగా . ఈ లీజుల రద్దు. చేయకతప్పని పరిస్థితి ఏర్పడింది. లీజులు రద్దు చేస్తూ రెండు , మూడు రోజుల్లో ఉత్తర్వులు జారీ అయ్యే అవకాశాలు ఉన్నాయి.
