సంగీత దర్శకుడు భీమ్స్ మ్యూజిక్ జర్నీ చాలా విలక్షణంగా జరిగింది. కెరీర్ బిగినింగ్ లోనే వైరల్ సాంగ్ ఇచ్చిన ఆయనకి ఆశించిన సినిమాలు రాలేదు. ఒకదశలో కెరీర్ ఆగిపోయింది. రవితేజ బెంగాల్ టైగర్ తో మళ్ళీ కొత్త ఊపిరి వచ్చింది. బలగం, ధమాకా, మ్యాడ్, టిల్లు సినిమాలు లైమ్ లైట్ లోకి తెచ్చాయి. సంక్రాంతికి వస్తున్నాంతో టాప్ లీగ్ కి వచ్చాడు. ఇప్పుడు బోలెడు క్రేజీ ప్రాజెక్ట్స్ అయిన చేతిలో వున్నాయి.
ఈ సంగీత ప్రయాణంలో సినిమా ఫలితాలని ఎలా తీసుకుంటారనే ప్రశ్నకు భీమ్స్ చాలా ఆసక్తికరమైన సమాధానం ఇచ్చారు. పబ్లిక్ ఫ్లాట్‌ఫాంలో వున్నప్పుడు చప్పట్లు కొడతారు తేడా వస్తే చెప్పుతో కొడతారు. రెండిటిని సమానంగా తీసుకోవాలి. అందరం తప్పులు చేస్తాం. కాకపోతే చేసిన తప్పుని మళ్ళీ రిపీట్ చేయకూడదు. నేను కూడా ఇదే ఫాలో అవుతా. పని చేస్తాం. ఫలితం మన చేతిలో లేదు. ప్రజలు ఇచ్చిన ఫలితాన్ని తీసుకోవాలి’ అని చెప్పుకొచ్చారు భీమ్స్.
అన్నట్టు భీమ్స్ మ్యూజిక్ ఇచ్చిన మాస్ జాతర డిజాస్టర్ అయ్యింది. ఈ సినిమా ఫలితం మీద కూడా ఆయన స్పందించారు. ప్రతి సినిమా హిట్ కావాలనే పని చేస్తాం. అది హిట్ కావాల్సిన సినిమానే. కాకపొతే రాంగ్ టైమింగ్ అని విశ్లేషించుకున్నారు భీమ్స్. నరేష్ రైల్వే కాలనీకి భీమ్స్ మ్యూజిక్ ఇచ్చారు. ఈ సినిమా చూసిన తర్వాత భీమ్స్ మాస్ సినిమాలే కాదు థ్రిల్లర్స్ కూడా చేయగాలుతాడనే నమ్మకం ఆడియన్స్ లో వస్తుందని నమ్మకంగా ఉన్నాడు. ఈ వారమే సినిమా ప్రేక్షకులు ముందుకు వస్తోంది.

