ఒక్క రోజు డిక్లరేషన్ ఆపి ఏం సాధించుకున్నారు మాస్టర్ !

పశ్చిమ రాయలసీమ నియోజకవర్గ పట్టభద్రుల నియోజకవర్గం నుంచి గెలిచిన భూమిరెడ్డి రామగోపాల్ రెడ్డికి రిటర్న్ అధికారి ప్లస్ కలెక్టర్ పిలిచి మరీ డిక్లరేషన్ ఇచ్చారు. ఆయన రానంటే… ఇంటికి వెళ్లి బతిమాలి ఇవ్వాల్సి వచ్చేది. అందులో సందేహం లేదు. ఈ విషయం ఆర్వో.. కలెక్టర్‌కు తెలియనిది కాదు. కానీ ఆమె మాత్రం ఏం చేస్తారు..? నేరుగా సీఎం ఫోన్ చేసి ఇవ్వొద్దని చెప్పారు. ఆమె పాటించారు. అది ఆయన అధికార పరిధి కాకపోయినా పాటించకపోతే ఎల్లుండి నుంచి ఎలాంటి పరిస్థితులు ఉంటాయో ఆమెకు తెలుసు.

అందుకే కొన్ని చీవాట్లు… మరికొన్ని విమర్శలతో అయినా తట్టుకోవచ్చని ఇవ్వకుండా ఇంటికెళ్లిపోయారు. కొన్ని గంటల తర్వాత పిలిచి ఇచ్చారు. ఇప్పుడు ఇలా కొన్ని గంటలు ఆపడం వల్ల టీడీపీ నేతలకు.. గెలిచిన అభ్యర్థికి నష్టం ఏమైనా వచ్చిందా ? . ఏమీ లేకపోగా… ప్రభుత్వం ఇలా ప్రజాస్వామ్య విరుద్ధంగా వ్యవహరిస్తోందని… ప్రజా తీర్పును లెక్క చేయడం లేదని మరక మాత్రం పడిపోయింది.

పాలకులకు అధికారంతో ఏమైనా చేయవచ్చన్న ఓ దురహంకారం కళ్లను కప్పేసినట్లుగా అందరికీ ఓ స్పష్టత వచ్చింది. దీని వల్ల ఎవరికి నష్టం. ప్రజాస్వామ్యంలో ఇలాంటి పోకడులు అంతిమంగా నష్టమే చేస్తాయి. తాత్కలిక మానసిక ఆనందం కోసం ఏదైనా చేసుకుంటే… మొదటికే మోసం వస్తుంది. గుర్తించనంత కాలం… ఈ పతనం కొనసాగుతూనే ఉంటుంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

అప్పట్లో డాక్టర్ సుధాకర్.. ఇప్పుడు డాక్టర్ అచ్చెన్న !

దళిత వైద్యులైన సుధాకర్, అచ్చెన్నల్లా తాను ప్రాణాలు పోగొట్టుకోవడానికి సిద్ధంగా లేనని... అందుకే ఏపీ వదిలి వచ్చేశానని ఎమ్మెల్యే డాక్టర్ శ్రీదేవి ప్రకటించారు. డాక్టర్ సుధాకర్‌ గురించి రాష్ట్రం మొత్తం తెలుసు. మరి...

ఈ సారి టీడీపీ ఆవిర్భావ హడావుడి హైదరాబాద్‌లోనే !

తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని ఈ సారి హైదరాబాద్‌లోనే నిర్వహిస్తున్నారు. నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ వేదికగా 29న టీడీపీ 41వ ఆవిర్భా వ దినోత్సవం జరుగనుంది. రెండు తెలుగు రాష్ట్రాల...

సజ్జలను బలిచ్చేయడానికి రంగం సిద్ధం !

వైసీపీలో ఏదైనా వ్యూహాత్మకంగా జరుగుతుంది . ఇప్పటి వరకూ ఈ వ్యూహాల వెనుక సజ్జల రామకృష్ణారెడ్డి ఉన్నారని అనుకుంటారు. కానీ ఇప్పుడు ఆయనపైనే వ్యూహాలు అమలవుతున్నట్లుగా తాడేపల్లి ప్యాలెస్‌లో గుసగుసలు ఎక్కువ అవుతున్నాయి....

మహారాష్ట్ర జడ్పీలపై బీఆర్ఎస్ జెండా ఎగరాలి : కేసీఆర్

బీఆర్ఎస్ పార్టీని మ‌హారాష్ట్ర‌లోనూ రిజిస్ట‌ర్ చేయించామని.. రానున్న స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల్లో పోటీ చేస్తామని. ప్ర‌తి జిల్లా ప‌రిష‌త్‌పై గులాబీ జెండా ఎగరేస్తామని కేసీఆర్ ధీమా వ్యక్తం చేశారు. స్థానిక...

HOT NEWS

css.php
[X] Close
[X] Close