మీడియా వాచ్ : కోర్ టీడీపీ ఫ్యాన్స్ మద్దతు కోల్పోయిన ఏబీఎన్ !

ఏబీఎన్, ఆంధ్రజ్యోతికి ఆదరణ ఉందంటే దానికి కారణం …. వైసీపీ వ్యతిరేకత , టీడీపీ సానుకూలత. వైసీపీకి వ్యతిరేకంగా ఏం రాస్తున్నారో అని ఆ పార్టీ నేతలు ఉత్కంఠగా ఎదురు చూస్తూంటారు. టీడీపీ వాళ్లు సహజంగానే కోర్ ఆడియన్స్. కానీ ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు చూసిన మూడు రోజులు … టీడీపీ గెలుస్తూంటే.. అసలు ఆ ఫ్లేవరే ఏబీఎన్‌లో కనిపించలేదు. ఆంధ్రజ్యోతి పత్రికతో పోలిస్తే కనీసం పది శాతం కవరేజీ కూడా లేదు. కనీసం గెలుస్తున్న అప్ డేట్స్ ఇవ్వలేదు. టీడీపీకి ఫేవర్ గా వచ్చే వార్తలు ఫాస్ట్ గా ఇస్తారేమో అని టీడీపీ క్యాడర్ అంతా ఏబీఎన్ వైపు చూస్తే నిరాశే మిగిలింది. టీవీ5, ఈటీవీ బెటరని వారు సోషల్ మీడియాలో నేరుగా అసంతృప్తి వ్యక్తం చేసుకున్నారు.

నిజానికి ఏబీఎన్‌లో పరిస్థితులు మారిపోయాయి. వేమూరి రాధాకృష్ణ చానల్‌పై దృష్టి పెట్టడం ఎప్పుడో మానేశారు. దీంతో అక్కడ స్థిరంగా ఉండే మ్యాన్ పవర్ లేకుండా పోయింది. దీంతో డెస్క్ పై … ఏబీఎన్ సోల్ పై పట్టు ఉన్న వాళ్లంతా చానల్ ను వదిలేసిపోయారు. ప్రస్తుతం డెస్క్ ను లీడ్ చేస్తుంది.. పని చేస్తున్న సబ్ ఎడిటర్లు… ఇంచార్జులు అంతా తెలంగాణ. పైగా ఉద్యమంలో పాల్గొన్న బ్యాక్ గ్రౌండ్. వారికి ఏపీ విషయాలను లైట్ తీసుకుంటున్నారు. టీడీపీ అంశాలను అసలు పట్టించుకోడం లేదు.

చానల్ పై రాధాకృష్ణ అజమాయిషీ తగ్గిపోవడంతో ఉద్యోగుల వ్యవహారాలు కూడా మితిమీరిపోతున్నాయి. కొంత మంది సొంత ప్రయోజనాల కోసం చానల్ను వాడేసుకుంటున్నారన్న అనుమానాలు కూడా వినిపిస్తున్నాయి. వెంకటకృష్ణ చర్చా కార్యక్రమం తప్ప ఇతర విషయాలు పట్టించుకోవడం లేదు. మొత్తంంగా ఏబీఎన్ పరిస్థితి ఇప్పుడు గందరగోళంగా ఉంది. అందుకే టీడీపీ కోర్ ఆడియన్స్.. టీవీ5, ఈటీవీవైపు వెళ్లిపోతున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

నలుగురు ఎమ్మెల్యేల్ని సస్పెండ్ చేసిన సజ్జల !

సరైన సమయంలో చర్యలు తీసుకుంటామని ఇదేమీ ఉద్యోగం కాదని రాజకీయం అని సజ్జల రామకృష్ణారెడ్డి గురువారం వ్యాఖ్యానించి.. ఒక్క రోజు గడవక ముందే నలుగురు ఎమ్మెల్యేలపై సస్పెన్షన్ వేటు వేశారు. తాము...

చంద్రబాబు అవినీతి అంటూ అసెంబ్లీలో మరో గంటన్నర గుక్క !

వరుసగా తగులుతున్న షాక్‌లు.. నాలుగేళ్లుగా అధికారంలో ఉండి చంద్రబాబుపై తాము చేసిన ఆరు లక్షల కోట్ల అవినీతి ఆరోపణల్లో ఒక్క రూపాయి అవినీతిని బయట పెట్టలేకపోతున్న అసహనం మొత్తం కలిపి.. తాము ఏం...

13.99 శాతం వడ్డీకి అప్పులు – ఏపీ కాగ్ రిపోర్టు

సాధారణంగా 12 శాతం వడ్డీ రేటుతో రూ. లక్ష పర్సనల్ లోన్లే తీసుకోవడానికి ఎవరూ ముందుకు రారు. భారీ మొత్తం లోన్లు అయితే 9 శాతం చాలా ఎక్కువ అని ఆర్థిక నిపుణులు...

రాహుల్ గాంధీపై అనర్హతా వేటు !

ప్రభుత్వ వ్యతిరేకులు ముఖ్యంగా పోటీ దారులపై వ్యవస్థలు ఎంత వేగంగా స్పందిస్తాయో మరోసారి నిరూపణ అయింది. గురువారమే ఓ పరువు నష్టం కేసులో రాహుల్ గాంధీపై రెండేళ్ల జైలుశిక్షను గుజరాత్‌లోని సూరత్ కోర్టు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close