151 సీట్లతో 50 శాతం ఓట్లతో గెలిచిన పార్టీకి రివర్స్‌లో అంత కంటే దారుణమైన పరాభవం ఎదురవబోతోందన్న సంకేతాలు కనిపిస్తున్నాయి. కానీ వైసీపీ నేతలు మాత్రం వాళ్లు మా ఓటర్లు కాదు.. మాకు హెచ్చరికలు కాదు.. మేం లైట్ తీసుకుంటాం లాంటి ప్రకటనలు చేస్తున్నారు. నిజానికి వైసీపీకి ఉన్న సమస్య ఇలాంటి పెత్తందారులే. సీఎం జగన్ ను డమ్మీ చేసి అన్నీ తామే చేస్తామన్నట్లుగా పార్టీని ఈ స్థాయికి తీసుకు వచ్చిన ఇతరులందర్నీ ఎలిమినేట్ చేసి తాము మాత్రమే పెత్తనం చెలాయించాలనుకునే ఈ పెత్తందార్ల వల్లే వైసీపీకి ఈ దుస్థితి ఏర్పడింది.
గత ఎన్నికలకు ముందు విజయసాయిరెడ్డి .కీలక పాత్ర పోషించేవారు. అటు తెలంగాణ ప్రభుత్వాన్ని తమ ప్రభుత్వంగా మార్చుకుని పోలీసుల్ని వాడేసుకుంటూ… డేటా చోరీ అని…అదనీ. ఇదనీ కేసులు పెట్టించి టీడీపీని ఇబ్బంది పెట్టారు. ఐ ప్యాక్ తో సమన్వయం చేసుకున్నారు. అభ్యర్థుల ఆర్తిక అవసరాలు అన్నీ ఆయన చేతుల మీదుగానే సాగాయి. అందుకే ఫలితాలు వచ్చిన తర్వాత మొదట జగన్ కౌగలించుకుంది విజయసాయిరెడ్డినే. అయితే ఇప్పుడు విజయసాయిరెడ్డి ఎక్కడ ఉన్నారో ఆ పార్టీలో ఎవరికీ తెలియదు. ఢిల్లీలో ప్రధాని, హోంమంత్రులతో భేటీ కావాలని జగన్ అనుకుంటే అప్పుడే ఆయన గుర్తొచ్చారు.
ఇప్పుడు పార్టీ అంతా సజ్జల చేతుల్లోకి వెళ్లిపోయింది. మొత్తం ఆయనే చేస్తున్నారు. సోషల్ మీడియాను ఆయన కుమారుడికి ఇచ్చారు. ఆయన పార్టీకి… జగన్ కు కాకుండా తనకు.. తన తండ్రికి ఇమేజ్ బిల్డింగ్ చేసుకుంటున్నారు. సజ్జల పెట్టిన నేతలంతా… చివరికి వైసీపీ పని అయిపోయిందనేలా చేశారు. జగన్ ఇప్పటికే అందర్నీ దూరం చేసుకున్నారు. కుటుంబం కూడా దూరం అయింది. ఒక్క సజ్జల మాత్రమే మిగిలారు. ఇప్పటికీ సజ్జలను ఇలాగే కొనసాగిస్తే…. ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత మాకేం నష్టం లేదు. .. ప్రజలకే నష్టం అనే వాదన వినిపించి… జగన్ ను ఇంట్లో కూర్చోబెట్టేస్తారు.