వెట‌ర‌న్ భామ విల‌నిజం

ఖుషి లాంటి సినిమాల‌తో యువ‌తరం హృద‌యాల్ని దోచుకుంది భూమిక‌. క‌మ‌ర్షియ‌ల్ సినిమాలు చేసినా ప‌ద్ధ‌తిగానే క‌నిపించింది. ఆ త‌ర‌వాత లేడీ ఓరియెంటెడ్ సినిమాల‌పై దృష్టి పెట్టింది. నిర్మాత‌గానూ మారింది. కొంత బ్రేక్ తీసుకుని, ఇప్పుడు మ‌ళ్లీ వెండి తెర‌పై మెరుస్తోంది. నాని సినిమా – ఎంసీఏలో కీల‌క పాత్ర పోషించింది భూమిక‌. రూల‌ర్‌లోనూ న‌టించింది. ఇప్పుడామె చేతిలో రెండు మూడు సినిమాలున్నాయి. త్వ‌ర‌లోనే నెగిటీవ్ ట‌చ్ ఉన్న పాత్ర పోషించ‌బోతోంద‌ని తెలుస్తోంది.

”నాకు నెగిటీవ్ ట‌చ్ ఉన్న పాత్ర‌లంటే చాలా ఇష్టం. ‘మిస్స‌మ్మ‌’లో నా పాత్ర అలానే సాగుతుంది. కానీ.. చివ‌ర్లో క‌థంతా మారిపోతుంది. ఈసారి అలా కాదు. సినిమా ప్రారంభం నుంచి చివ‌రి వ‌ర‌కూ నెగిటీవ్ ట‌చ్‌లోనే నా పాత్ర సాగుతుంది. ఓ ర‌కంగా చెప్పాలంటే అది లేడీ విల‌న్ పాత్ర‌. అయితే ఆ సినిమా పేరేమిటో ఇప్పుడే చెప్ప‌ను. అంతా ఓకే అయ్యాక తెలియ‌ప‌రుస్తా” అంటోంది. ఇది ఓ స్టార్ హీరో సినిమానే అని స‌మాచారం. అయితే ఆ హీరో ఎవ‌రో, ఆ సినిమా ఎప్పుడు ప‌ట్టాలెక్కుతుంద‌న్న‌ది సస్పెన్స్‌. ఏదేమైనా భూమిక కోరిక మాత్రం ఈసినిమాతో తీర‌బోతోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

వివేకా హత్య కేసులోకి జగన్‌నూ లాక్కొస్తున్న దస్తగిరి !

మావాళ్లు చెప్పినట్లు చేయి.. ఏం జరిగినా అండగా ఉంటానని దస్తగిరికి సీఎం జగన్ స్వయంగా హామీ ఇచ్చారట. ఈ విషయాన్ని స్వయంగా దస్తగిరినే చెబుతున్నారు. వివేకాను చంపే ముందు జగన్ ఆయనతో ఫోన్...

ఖమ్మం సీటు రిస్క్ లో పడేసుకున్న కాంగ్రెస్

కాంగ్రెస్ పార్టీ అత్యంత సులువుగా గెలిచే సీటు ఖమ్మం అనుకున్నారు. మిత్రపక్షంతో కలిసి ఆ లోక్ సభ పరిధిలో ఉన్న అన్ని చోట్లా గెలిచారు. అదీ కూడా భారీ మెజార్టీలతో. ...

ఇప్పటికీ ఎన్డీఏ వెంట పడుతున్న జగన్ !

రాజకీయం అంటే విదిలించుకున్నా వదిలి పెట్టను అని కాళ్లు పట్టేసుకోవడం కాదు. కానీ వైసీపీ అధినేతకు మాత్రం అదే రాజకీయం. ఎందుకంటే వదిలిస్తే కేసులకు కొట్టుకుపోతారు. అందుకే బీజేపీ వాళ్లు విదిలించుకున్నా ...

ఆన్న ఆస్తి ఇవ్వకపోతే షర్మిల కోర్టుకెళ్లవచ్చుగా !?

సోదరుడు జగన్మోహన్ రెడ్డి ఆస్తి పంచివ్వలేదని.. ఒక్కకొసరు ఆస్తి రాసిచ్చి దాన్ని కూడా అప్పు కింద జమ చేసుకున్నారని షర్మిల వేదనకు గురయ్యారు. తన పిల్లలకు తాను ఏమీ ఇవ్వలేకపోతున్నానని ఆమె ఆవేదన...

HOT NEWS

css.php
[X] Close
[X] Close