పైసా వ‌సూల్ కోసం బిగ్ బీ..??

ఎన్ని ఫ్లాపులు ఇచ్చినా, త‌న సినిమాకి ముందు ఊహించ‌నంత క్రేజ్ సంపాదించుకోవడంలో పూరి దిట్ట‌. ‘పైసా వ‌సూల్‌’పైనా మెల్ల‌మెల్ల‌గా అంచ‌నాలు పెరిగిపోతున్నాయి. టీజ‌ర్ చూశాక‌… ఈ సినిమాపై అభిమానులు ఆశ‌లు పెంచేసుకొన్నారు. బ‌య్య‌ర్లు కూడా ఫ్యాన్సీ రేట్ల‌తో ముందుకు వ‌స్తున్నారు. ఈ సినిమాపై వీలైనంత ఎక్కువ‌గా బిజినెస్ జ‌ర‌పాల‌ని, ఈ క్రేజ్ ఇంకా.. ఇంకా పెంచేయాల‌ని పూరి భావిస్తున్న‌ట్టు స‌మాచారం.

అందుకే… ఆడియో ఫంక్ష‌న్ కూడా వినూత్న రీతిలో చేయాల‌న్న నిర్ణ‌యానికి వ‌చ్చాడ‌ట‌. ఈ ఫంక్ష‌న్‌కి బాలీవుడ్ సూప‌ర్ స్టార్ అమితాబ్ బ‌చ్చ‌న్‌ని ఆహ్వానించాల‌ని భావిస్తున్న‌ట్టు స‌మాచారం. అమితాబ్‌తో పూరి ఓ హిందీ సినిమా తీశాడు. అప్ప‌టి నుంచీ బిగ్ బీకీ – పూరీ కి మంచి అనుబంధం ఏర్ప‌డింది. ఓ దశ‌లో అభిషేక్ బ‌చ్చ‌న్‌తోనూ ఓ సినిమా తీస్తార‌ని అనుకొన్నారు. కొన్ని కార‌ణ‌ల వ‌ల్ల ఆ ప్రాజెక్టు వ‌ర్క‌వుట్ కాలేదు. అయినా స‌రే.. పూరి – అమితాబ్‌ల అనుబంధం కొన‌సాగుతూనే ఉంది. అది దృష్టిలో ఉంచుకొనే.. ఈ ఆడియో ఫంక్ష‌న్‌కి బిగ్ బిని ఆహ్వానించాల‌ని భావిస్తున్నాడ‌ట‌.

బిగ్ బి డేట్ ఇచ్చాకే ఆడియో డేట్ డిక్లేర్ చేస్తార‌ని తెలుస్తోంది. ఒక‌వేళ హైద‌రాబాద్ వ‌చ్చేంత టైమ్ బిగ్ బీకి లేక‌పోతే.. ముంబైలోనే ఆడియో ఆవిష్క‌రించాల‌ని పూరి భావిస్తున్నాడ‌ట‌. పూరి ప్లాన్ వ‌ర్క‌వుట్ అయితే.. పైసా వ‌సూల్ కి మ‌రింత క్రేజ్ ఏర్ప‌డ‌డం ఖాయం.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com