డ్ర‌గ్స్ కేసు : ఈసారి అంతా ర‌హ‌స్య‌మే

తొలి ద‌శ డ్ర‌గ్స్ విచార‌ణ‌ని సిట్ విజ‌వంతంగా ముగించేసింది. అయితే… ఎన్నో విమ‌ర్శ‌ల్ని ఎదుర్కోవాల్సివ‌చ్చింది. సినిమావాళ్ల‌ని మాత్రమే సిట్ టార్గెట్ చేసింద‌ని, డ్ర‌గ్స్ బాధితుల్ని – డ్ర‌గ్స్ నేర‌స్థుల రేంజులో ప్ర‌శ్నిస్తోంద‌న్న విమ‌ర్శ‌లు వినిపించాయి. అందుకే ఇక మీద‌ట కాస్త ఆచి తూచి స్పందించాలన్న నిర్ణ‌యానికి వ‌చ్చిన‌ట్టు స‌మాచారం అందుతోంది. రెండో విడ‌త జాబితా సిద్ధం చేసిన‌ప్ప‌టికీ, దాన్ని బయ‌ట‌కు వ‌ద‌ల‌క‌పోవ‌డానికి ప్ర‌ధాన కార‌ణం ఇదే. ఇక మీద‌ట విచార‌ణ అంతా గోప్యంగా జ‌ర‌పాల‌ని సిట్ నిర్ణ‌యించుకొంది. ఎవ‌రికి నోటీసులు అందాయో ఇక మీద‌ట ఎవ్వ‌రికీ చెప్ప‌ద‌ట‌. తొలిసారి 12 మంది పేర్లు.. మీడియాకు ముందే లీక్ అయిపోయాయి. వాళ్ల‌ను అడ‌గ‌బోయే ప్ర‌శ్న‌లేంట‌న్న విష‌యంలోనూ మీడియాకు ముందే ఉప్పందేసింది. అంతేకాదు… సిట్‌విచార‌ణ సంద‌ర్భంగా ఎవ‌రెవ‌రు ఎలా స్పందించారు, ఎలాంటి జ‌వాబులు ఇచ్చారు, అక్క‌డ వారి మాన‌సిక ప‌రిస్థితి ఎలా ఉంది? అనే విష‌యంలోనూ మీడియాకు లీకేజీలు అందేశాయి. దాంతో… ఈ విమ‌ర్శ‌లు మ‌రింత ఎక్కువ‌య్యాయి.

ఇక మీద‌ట ఇలాంటి లీకేజీల‌కు అవ‌కాశం ఇవ్వ‌కూడ‌ద‌ని సిట్ భావిస్తోందట‌. విచార‌ణ కూడా.. చాలా ర‌హ‌స్యంగా, వేర్వేరు ప్ర‌దేశాల్లో జ‌ర‌పాల‌ని సిట్ భావించింద‌ని తెలుస్తోంది. సో.. రెండో జాబితా ఎప్పుడొస్తుందో ఇక మీడియాకు తెలిసే అవ‌కాశం లేదు. బహుశా…ఇప్ప‌టికే కొంత‌మందికి నోటీసులు అందినా.. ఆశ్చ‌ర్య‌పోవాల్సిన అవ‌స‌రం లేదు. రెండో జాబితాలో పెద్ద చేప‌ల పేర్లు ఉండ‌డంతోనే ఈ జాగ్ర‌త్త‌లు తీసుకొన్నారేమో అనే అనుమానాలు వ్య‌క్తం అవుతున్నాయి. ఇందులో నిజా నిజాలెంతో సిట్‌కే తెలియాలి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

బిగ్ బ్రేకింగ్ – షాద్ నగర్ లో ఘోర అగ్ని ప్రమాదం

షాద్ నగర్ లో ఘోర అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. నందిగామ శివార్ సమీపంలోని అలెన్ హోమియో, హెర్బల్ ప్రొడక్ట్స్ కంపెనీలో ఈ అగ్ని ప్రమాదం జరిగింది. దీంతో పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడుతున్నాయి....

సూప‌ర్ స్టార్ బ‌ర్త్‌డేని టార్గెట్ చేసిన సుధీర్ బాబు

మే 31... సూప‌ర్ స్టార్ కృష్ణ పుట్టిన రోజు. ఈ సంద‌ర్భంగా మ‌హేష్ బాబు - రాజ‌మౌళి కాంబోలో రాబోయే సినిమాకు సంబంధించిన అప్ డేట్ ఏమైనా వ‌స్తుందా? అని మ‌హేష్...

జేడీ లక్ష్మినారాయణకు ప్రాణహాని – ఎవరి పని ?

సీబీఐ మాజీ జేడీ వీవీ లక్ష్మినారాయణ తనకు ప్రాణహాని ఉందని విశాఖ సీపీ రవిశంకర్ అయ్యన్నార్ కు ఫిర్యాదు చేశారు. ఇంత కాలం నిర్భయంగా తిరిగిన ఆయనకు హఠాత్తుగా ప్రాణభయం ఏర్పడటానికి...

వైసీపీలో చేరి అన్నీ పోగొట్టుకుని బయటకు వచ్చిన డొక్కా !

ఆయన ప్రముఖ దళిత నేత. కాంగ్రెస్ నుంచి రాజకీయాల్లోకి వచ్చారు. రాయపాటి సాంబశివరావు రాజకీయాల్లోకి తీసుకు వచ్చారు. వైఎస్ఆర్ ప్రోత్సహించారు. ఆయనకు మంత్రి పదవి కూడా ఇచ్చారు. ఆయన చనిపోయిన తర్వాత...

HOT NEWS

css.php
[X] Close
[X] Close