బీహార్లో మరోసారి ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడుతుందని అన్ని ఎగ్జిట్ పోల్స్ ప్రకటించాయి. చివరికి దేశంలో మంచి స్ట్రైక్ రేట్ ఉన్న సర్వే సంస్థగా పేరున్న యాక్సిస్ మై ఇండియా ఎగ్జిట్ పోల్స్ లోనూ ఎన్డీఏ విజయం ఖరారు అయింది. ఆ సంస్థ పూర్తిగా డీప్ రూట్స్ గా ఎనాలసిస్ చేసింది. ఆ ఎనాలసిస్ లో తేలిందేమింటే.. కాంగ్రెస్ పార్టీ మరోసారి ఆర్డేడీని ఓటమి పాలు చేస్తోంది.
బీజేపీ కూటమిలో అన్ని పార్టీలకూ మంచి స్థానాలు
బీజేపీ కూటమిలో బీజేపీ, జేడీయూ ప్రధాన పార్టీలు. ఈ రెండు పార్టీలు చెరో వంద సీట్లకుపైగా పోటీ చేశారు. రామ్ విలాస్ పాశ్వాన్ కుమారుడి పార్టీకి, ఇతర చిన్న పార్టీలకు సీట్లు ఇచ్చాయి. అందరూ తమ తమ పరిధిలో సగానికిపైగా స్థానాలు గెల్చుకుంటున్నారు. దాంతో 243 స్థానాలున్న అసెంబ్లీ వారు మాజిక్ మార్క్ 122 ను దాటేసి.. ఐదో పదో ఎక్కువ సీట్లు సాధిస్తున్నారని ఎగ్జిట్ పోల్స్ అంచనా వేశాయి.
కాంగ్రెస్ కూటమిలో కాంగ్రెస్ ఫెయిల్
ఆర్జేడీతో పొత్తు పెట్టుకుని 61 సీట్లతో పాటు మరో పది సీట్లలో ఫ్రెండ్లీ ఫైట్ అని పోటీ చేసిన కాంగ్రెస్ పార్టీ.. ఫలితాల్లో పూర్తి వెనుకబడుతుందని అంచనాలు వేస్తున్నాయి. మొత్తంగా పది నుంచి పదిహేను సీట్లు మాత్రమే గెల్చుకునే అవకాశం ఉంది. ఆదే ఆర్జేడీ 75 సీట్లను, కమ్యూనిస్టులు ఇతర మిత్రపక్షాలు కలిసి ఇరవై సీట్లను గెల్చుకుంటాయి. అంటే దాదాపుగా వంద సీట్లు ఆర్జేడీ, ఇతర మిత్రపక్షాలు గెలుస్తాయి.కానీ ఇరవై ఐదు సీట్లను కాంగ్రెస్ గెలిస్తే చాలు ప్రభుత్వం ఏర్పడుతుంది. కానీ అరవై, డెబ్భై సీట్లలో పోటీ చేసిన కాంగ్రెస్.. పది నుంచి పదిహేనుకే పరిమితం కావడంతో ప్రభుత్వం వారి చేతుల నుంచి చేజారిపోతుందని దాదాపుగా ఎగ్జిట్ పోల్స్ చెబుతున్నాయి.
గతంలోనూ కాంగ్రెస్ వల్లే అధికారం పోగొట్టుకున్న తేజస్వీ
గత ఎన్నికలలోనూ కాంగ్రెస్ పార్టీ ఆర్జేడీపై ఒత్తిడి తెచ్చి 71 సీట్లలో పోటీ చేసి..పది స్థానాలకే పరిమితం కావడంతో ఆర్జేడీ, కమ్యూనిస్టులు మంచి ఫలితాలు సాధించినా అధికారానికి దూరంగా ఉండాల్సి వచ్చింది. ఈ సారి కూడా అదే పరిస్థితి వస్తోందని అంచనాలు వస్తున్నాయి. అదే నిజమైతే ..కాంగ్రెస్ పార్టీ బీజేపీ కోవర్ట్ అనుకోవాల్సి వస్తుంది.


