బీహార్ లో మరోసారి ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడటం ఖాయంగా మారింది. తొలి ట్రెండ్స్ పూర్తిగా ఎన్డీఏ కూటమికి అనుకూలంగా వస్తున్నాయి. 160 వరకూ స్థానాల్లో ఎన్డీఏ కూటమి పార్టీల అభ్యర్థులు ఆధిక్యంలో కొనసాగుతున్నారు. బీహార్ అసెంబ్లీలో మొత్తం 241 సీట్లు ఉన్న బీహార్ అసెంబ్లీలో ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి 122 మ్యాజిక్ మార్క్.
బీజేపీ, జేడీయూ అత్యధిక స్థానాల్లో ముందంజలో ఉన్నాయి. ఆర్జేడీతో కూడా బలంగా ఉన్నప్పటికీ.. కాంగ్రెస్ పార్టీ తమకు కేటాయించిన అరవై సీట్లలో కనీసం పదిహేను సీట్లలో కూడా ముందడుగు వేయలేకపోతోంది. ఫలితంగా మహాఘట్బంధన్ పరిస్థితి నిరాశజనకంగా మారింది. ఫలితాలు ఎన్నిసీట్లలో మారినా.. బీజేపీ కూటమి వెనుకబడే అవకాశాలు ఇప్పటికి లేవని అనుకోవచ్చు.
నితీష్ కుమార్ .. వివిధ కూటములు మారి అయినా సరే తొమ్మిది సార్లు ఇప్పటికే ప్రమాణ స్వీకారం చేశారు. పదో సారి ఆయన ప్రమాణ స్వీకారానికి సిద్ధమయ్యే అవకాశం ఉంది. బీహార్ లో కాంగ్రెస్, ఆర్జేడీ కూటమికి మంచి అవకాశాలు ఉన్నాయని అనుకున్నా.. బీజేపీని ఓడించడం వారి వల్ల కాలేదు.


