బింబిసార‌… ఓన్లీ ఇన్ తెలుగు

ఈమ‌ధ్య పాన్ ఇండియా సినిమాల హ‌డావుడి మ‌రింత ఎక్కువైపోయింది. యాక్ష‌న్‌, సోషియో ఫాంట‌సీ లాంటి జోన‌ర్ల‌కు అన్ని చోట్లా ఫ్యాన్ బేస్ ఉంటుంది. అందుకే ఆ త‌ర‌హా సినిమాలు భాష‌తో సంబంధం లేకుండా అన్ని చోట్లా విడుద‌ల అవుతున్నాయి. `బింబిసార‌` కూడా ద‌క్షిణాది అంత‌టా ఒకేసారి విడుద‌ల చేయాల‌నుకొన్నారు. క‌ల్యాణ్ రామ్ న‌టిస్తూ, నిర్మించిన సినిమా ఇది. సోషియో ఫాంట‌సీ నేప‌థ్యంలో సాగే ఈ సినిమాలో యాక్ష‌న్‌కి ప్రాధాన్యం ఉంది. టైమ్ ట్రావెల్ క‌థ కావ‌డంతో… మిగిలిన భాష‌ల్లోనూ చూస్తార‌న్న ధీమా ఏర్ప‌డింది. అందుకే సౌత్‌లోని మిగిలిన భాష‌ల్లోనూ ఈ సినిమా విడుద‌ల చేయాల‌నుకొన్నారు. అయితే ఇప్పుడు ఆ నిర్ణ‌యం మారింది. ఈ సినిమాని ఇప్పుడు తెలుగులో మాత్ర‌మే విడుద‌ల చేస్తున్నారు. ఇక్క‌డొచ్చిన ఫ‌లితాన్ని బ‌ట్టి, అప్పుడు మిగిలిన భాష‌ల్లో డ‌బ్ చేస్తారు. ఈ విష‌యాన్ని క‌ల్యాణ్ రామ్ స్వ‌యంగా వెల్ల‌డించారు.

”బింబిసార ఇప్పుడు తెలుగులో మాత్ర‌మే విడుద‌ల అవుతోంది. మా సినిమాకి తెలుగులో జ‌రిగిన బిజినెస్ ప‌రంగా సంతృప్తిగా ఉన్నాం. తెలుగులో రిజ‌ల్ట్ ని బ‌ట్టి, మిగిలిన భాష‌ల్లో మెల్ల‌గా విడుద‌ల చేస్తాం” అని క‌ల్యాణ్ రామ్ చెప్పారు. ఎన్టీఆర్ తో క‌లిసి న‌టించాల‌ని ఉంద‌ని, అయితే… మంచి క‌థ వ‌చ్చిన‌ప్పుడు మాత్ర‌మే అది సాధ్యం అవుతుంద‌ని క‌ల్యాణ్ రామ్ చెబుతున్నాడు. ”ఆర్‌.ఆర్‌.ఆర్ త‌ర‌వాత మ‌ల్టీస్టార‌ర్ సినిమా అంటే ఓ బెంచ్ మార్క్ ఏర్ప‌డింది. అంత బ‌ల‌మైన క‌థ ఉన్న‌ప్పుడు మాత్ర‌మే మ‌ల్టీస్టార‌ర్ గురించి ఆలోచించాలి” అన్నాడు క‌ల్యాణ్ రామ్.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఇప్పటం రైతులు చేసిందేంటి , అమరావతి రైతులు చేయనిదేంటి పవన్ కళ్యాణ్ ?

ఇప్పటం రైతుల్లా పోరాడితే అమరావతి తరలిపోయేది కాదని జనసేన పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. అసలు ఇప్పటం రైతులు చేసిన పోరాటం ఏమిటి..? అమరావతి రైతులు చేయనిది ఏమిటి...

అమరావతి రైతుల పాదయాత్ర ఆగిపోయినట్లేనా ?

అమరావతి రైతుల పాదయాత్ర ఆగిపోయినట్లుగానే కనిపిస్తోంది. ఆంక్షలు సడలించడానికి హైకోర్టు నిరాకరించడం కేవలం ఆరు వందల మంది రైతులు మాత్రమే పాల్గొనాలని మద్దతిచ్చే వారు కలిసి నడవకూడదని.. రోడ్డు పక్కన ఉండాలని చెప్పడంతో...

హ‌మ్మ‌య్య‌… నితిన్‌కి మూడొచ్చింది!

మాచ‌ర్ల నియోజ‌క వ‌ర్గం త‌ర‌వాత నితిన్ సినిమా ఏదీ ప‌ట్టాలెక్క‌లేదు. వ‌క్కంతం వంశీ క‌థ‌కు నితిన్ ప‌చ్చ జెండా ఊపిన‌ప్ప‌టికీ.. ఆ సినిమాని ఎందుక‌నో హోల్డ్ లో పెట్టాడు. ఈ క‌థ‌పై త‌ర్జ‌న‌భ‌ర్జ‌న‌లు...

బీజేపీ, టీఆర్ఎస్ మధ్య “సీజ్ ఫైర్” !?

బీజేపీ, టీఆర్ఎస్ పార్టీలు దర్యాప్తు సంస్థలతో చేస్తున్న యుద్ధంలో కాల్పుల విరమణ అవగాహన కుదిరిందా ? హఠాత్తుగా ఎందుకు వేడి తగ్గిపోయింది ?. బీఎల్ సంతోష్‌ను ఎలాగైనా రప్పించాలనుకున్న సిట్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close