బాల‌య్య పాట‌.. అదే బ‌ర్త్ డే గిఫ్టు

ఈనెల 10న నంద‌మూరి బాల‌కృష్ణ త‌న పుట్టిన రోజు జ‌రుపుకుంటున్నారు. ఈ పుట్టిన రోజు ఓ ప్ర‌త్యేక‌త ఉంది. ఇది ఆయ‌న 60వ జ‌న్మ‌దినం. అంటే ష‌ష్టి పూర్తి అన్న‌మాట‌. ఈ సంద‌ర్భంగా బాల‌కృష్ణ అభిమానుల‌కు ఓ కానుక ఇవ్వ‌బోతున్నారు. తాను స్వ‌యంగా పాడిన ఓ పాట‌ని ఆ రోజున విడుద‌ల చేయ‌బోతున్నారు. `పైసా వ‌సూల్‌`లో బాల‌య్య పాట పాడిన సంగ‌తి తెలిసిందే. హుద్ హుద్ బాధితుల‌కు అండ‌గా `మేమే సైతం` కార్య‌క్ర‌మాన్ని నిర్వ‌హించిన‌ప్పుడు కూడా బాల‌య్య ఓ పాట పాడి అభిమానుల్ని అల‌రించారు. ఇప్పుడు మ‌రో పాటందుకున్నారు. అయితే ఇది ప్రైవేటు గీతం. అభిమానుల్ని అల‌రించ‌డం కోసం బాల‌య్య చేసిన ఓ ప్ర‌య‌త్నం.

అయితే ఈ సంద‌ర్భంగా ‘నిన్న త‌ప్పు చేసిన‌వాళ్ల‌ని నిల‌దీసింది ఆ గ‌ళం.. ఇప్పుడు ఆబాల‌గోపాలాన్ని అల‌రించ‌డానికి పాట పాడింది అదే గ‌ళం’ అంటూ ఓ పోస్ట‌ర్ విడుద‌ల చేసింది. చిత్ర‌సీమ ప్ర‌భుత్వంతో జ‌రిపిన మీటింగుల‌పై బాల‌య్య చేసిన వ్యాఖ్య‌లు క‌ల‌క‌లం సృష్టించిన సంగ‌తి తెలిసిందే. ‘త‌ప్పు చేసిన‌వాళ్ల‌ని నిల‌దీసిన ఆగ‌ళం’ అన‌డం వెనుక అర్థం అదే. చూస్తుంటే.. మిగిలిన వాళ్లు వ‌దిలేసినా, బాల‌య్య‌, ఆయ‌న ఫ్యాన్సూ, పీఆర్ టీమూ మాత్రం ఈ వివాదాన్ని వ‌దిలేట్టు క‌నిపించ‌డం లేదు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

video

‘ప్ర‌స‌న్న‌వ‌ద‌నం’ ట్రైల‌ర్‌: కొత్త పాయింటే ప‌ట్టారు

https://www.youtube.com/watch?v=uy8tkUFAsnA సుహాస్‌పై ప్రేక్ష‌కుల‌కు ఓ మంచి అభిప్రాయ‌మే ఉంది. త‌ను క‌చ్చితంగా విభిన్న ప్ర‌య‌త్నాలు చేస్తాడ‌నది అంద‌రి న‌మ్మ‌కం. క‌ల‌ర్ ఫొటో నుంచి అంబాజీ పేట మ్యారేజీ బ్యాండు వ‌ర‌కూ త‌న ట్రాక్ రికార్డ్...

హరీష్ రావు ఉత్తుత్తి రాజీనామా – కామెడీ చేసిన కాంగ్రెస్ !

తెలంగాణ ఉద్యమం కోసం ఇప్పటికే ఎన్నో సార్లు రాజీనామా చేశానని.. తనకు పదవులు ఓ లెక్క కాదంటూ చెప్పే హరీష్ రావు.. తాజాగా చేసిన రాజీనామా ఆయనను ట్రోల్ చేసేలా ఉంది....

చేసింది పొన్నవోలే కానీ చేయించింది జగన్ కాదట !

సీబీఐ చార్జిషీట్‌లో వైఎస్ఆర్ పేరును సోనియా గాంధీ పెట్టించారంటూ ఇంత కాలం జగన్ చేస్తున్న ప్రచారానికి షర్మిల ఒకే ఒక్క డైలాగ్ తో చెక్ పెట్టారు. పొన్నవోలు ద్వారా...

నారా భువనేశ్వరి డీప్ ఫేక్ ఆడియోతో వైసీపీ అరాచకం !

ఇంట్లో సొంత కుటుంబసభ్యుల్ని అత్యంత హీనంగా దూషిస్తున్న జగన్మోహన్ రెడ్డి పార్టీ.. ఆ పార్టీ సోషల్ మీడియా విభాగం పూర్తిగా కంట్రోల్ తప్పిపోయింది. ఏకంగా నారా భువనేశ్వరి ఆడియో పేరుతో డీప్ ఫేక్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close