శశికళ కలకలం వెనుక బీజేపీ !?

తమిళనాడులో శశికళ మళ్లీ అలజడి రేపుతున్నారు. ఈ రోజుకు అన్నాడీఎంకే ఏర్పడి యాభై ఏళ్లు అవుతోంది. పార్టీకి ఇప్పటి వరకూ భారీ ప్రజాకర్షక నేత అధ్యక్ష బాధ్యతల్లో ఉంటూవచ్చారు. ఇప్పుడు ఎవరూ లేరు. కానీ ఆధిపత్యం కోసం పోరాటం మాత్రం ప్రారంభమయింది. రాజకీయాలకు ఇక దూరమన్న శశికళ ఇప్పుడు అన్నాడీఎంకే తనదేనంటూ రంగంలోకి దిగిపోయారు. శనివారమే ఆమె అన్నాడీఎంకేలో రచ్చ చేసేశారు. జయలలిత సమాధికి నివాళులు అర్పించి .. తనను అన్నాడీఎంకే నుంచి ఎవరూ దూరం చేయలేరని ప్రకటించారు.

అన్నాడీఎంకే ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొని నిలబడిందని.. ఇక నుంచి అందరం కలిసి కాపాడుకుంటామని ప్రకటించారు. శశికళ వ్యాఖ్యలు తమిళ నాట హాట్ టాపిక్‌గా మారాయి. ఎందుకంటే అన్నాడీఎంకే నుంచి శశికళను ఎప్పుడో బహిష్కరించారు. ఆమెకు పార్టీలో చోటు లేదని అటు పన్నీరు సెల్వం.. ఇటు పళని స్వామి చాలా సార్లు ప్రకటించారు. శశికళ ప్రకటన తర్వాత కూడా అదే చెప్పారు. అన్నాడీఎంకేకు శశికళ సేవలు అవసరం లేదన్నారు. కానీ శశికళ అంతర్గతంగా ఇప్పటికే ఆపరేషన్ పూర్తి చేశారు. ఈపీఎస్, ఓపీఎస్‌లను పక్కకు పెట్టేసి పార్టీ పగ్గాలు చేపట్టేందుకు సిద్ధమయ్యారు.

ప్రస్తుతం అన్నాడీఎంకేతో పొత్తులో ఉన్న బీజేపీ కూడా శశికళ అన్నాడీఎంకే బాధ్యతలు చేపట్టడానికి సానుకూలంగా ఉంది. అసలు ఆమె విడుదలకు కూడా బీజేపీ సహకారం ఉందన్న ప్రచారం ఉంది. శశికళ అన్నాడీఎంకే పగ్గాలు చేపడితే ఆమె వర్గానికి చెందిన ఐదు శాతం ఓటు బ్యాంక్ కలసి వస్తుందని రానున్న లోక్‌సభ ఎన్నికల్లో మెరుగైన ఫలితాలు వస్తాయని బీజేపీ అగ్రనేతలు భావిస్తున్నారు. అందుకే ఆమెను ప్రోత్సహిస్తున్నారని అంటున్నారు. దానికి తగ్గట్లుగానే శశికళ గ్రౌండ్ రెడీ చేసుకుంటున్నారు. అందుకే ఏ క్షణమైనా అన్నాడీఎంకే శశికళ చేతుల్లోకి వెళ్లవచ్చన్న ప్రచారం జరుగుతోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ప్రభుత్వ వేధింపులపై “గొట్టిపాటి” న్యాయపోరాటం .. సుప్రీంలో ఊరట !

అద్దంకి ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్‌ కుటుంబానికి చెందిన కిషోర్‌ గ్రానైట్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌కు సుప్రీంకోర్టులో ఊరట లభించింది. ఏపీలో జగన్ ప్రభుత్వం వచ్చిన తర్వాత క్వారీల్లో తనిఖూలు చేసి కిషోర్‌ గ్రానైట్స్‌...

తెలంగాణలో “బియ్యం స్కాం” బద్దలవబోతోందా !?

తెలంగాణలో వరి ధాన్యం కొనుగోలు చుట్టూ రాజకీయాలు నడుస్తున్నారు. సీఎం కేసీఆర్ ప్రస్తుతం ఆ ఆంశంపైనే దృష్టి కేంద్రీకరించి బీజేపీని నిలుపుదల చేయాలని చూస్తున్నారు. అయితే కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ కేసీఆర్...

కరోనా బాధిత జర్నలిస్టు కుటుంబాలకు తెలంగాణ సర్కార్ అండ !

జర్నలిస్టుల సంక్షేమంలో మాటలు చెప్పడం కన్నా అంతో ఇంతో ఆచరణలో చూపిస్తోంది తెలంగాణ ప్రభుత్వం. గతంలో కరోనా బారిన పడిన జర్నలిస్టులకు రూ. ఇరవై వేల చొప్పున ఇచ్చిన ప్రభుత్వం.. ...

“అన్నమయ్య”పై కదిలిన కేంద్రం.. రాష్ట్రం కవరింగ్ !

అన్నమయ్య ప్రాజెక్ట్ కొట్టుకుపోయిన విషాదం వెనుక తప్పిదం ఎవరిదో తేల్చి శిక్షించాలని కేంద్రం నిర్ణయం తీసుకున్నట్లుగా కనిపిస్తోంది. బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిదేనని చెప్పిన కేంద్ర మంత్రి షెకావత్‌పై వైసీపీ నేతలు...

HOT NEWS

[X] Close
[X] Close