కేసీఆరే ప్రెసిడెంట్.. కేటీఆర్ వర్కింగే !

టీఆర్ఎస్‌కు  ఈ సారి కూడా కేసీఆరే అధ్యక్షుడిగా ఎన్నికవబోతున్నారు. కేటీఆర్‌కు వర్కింగ్ ప్రెసిడెంట్ నుంచి ప్రెసిడెంట్‌గా ప్రమోోషనల్ లభించబోందని జరుగుతున్ ప్రచారం అంతా రూమర్సేనని తేలిపోయింది. టీఆర్ఎస్‌కు అధ్యక్షుడిగా కేసీఆరే ఉండాలంటూ మంత్రులంతా ఏకగ్రీవంగా తీర్మానించడమే కాదు నామినేషన్ దాఖలు చేశారు. టిఆర్ఎస్ పార్టీ అధ్యక్ష  ఎన్నికకు రిటర్నింగ్ అధికారిగా మాజీ ఎమ్మెల్సీ ఎం. శ్రీనివాస్ రెడ్డి వ్యవహరిస్తున్నారు. ఆయనకు నామినేషన్ పత్రాలను మంత్రులు అందించారు.

టిఆర్ఎస్ రాష్ట్ర అధ్యక్షునిగా కేసీఆర్ ను బలపరుస్తూ తామంతా సమావేశమై ఏకగ్రీవ తీర్మానం చేశామని మంత్రులు తెలిపారు. టీఆర్ఎస్ పార్టీ అధ్యక్ష పదవికి 22వ తేదీ వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. 23వ తేదీన స్క్రూటినీ ఉంటుంది.25న టిఆర్ఎస్ పార్టీ ప్లీనరీ సభ జరుగనుంది. ఆ ప్లీనరీలోనే అధ్యక్షుడ్ని ప్రకటిస్తారు. ముందస్తు ఎన్నికల ఊహాగానాల నడుమ టీఆర్ఎస్ అధ్యక్ష ఎన్నిక కాస్త ఆసక్తి రేపింది.

మామూలుగా అయితే ఈ ఎన్నిక ప్రక్రియకు ప్రాధాన్యం ఇవ్వరు. కానీ ప్రాధాన్యం ఇవ్వడంతో ఏదో జరుగుతోందని అనుకున్నారు. కానీ  వచ్చే అసెంబ్లీ ఎన్నికలను కూడా కేసీఆర్ పార్టీ అధ్యక్షుడిగానే ఎదుర్కోబోతున్నారని క్లారిటీ వచ్చింది. వచ్చే ఏడాది ఆగస్టు తర్వాత కేసీఆర్ ముందస్తు ఎన్నికలకు వెళ్లే అవకాశం ఉందన్న ప్రచారం జరుగుతున్న సమయంలోనే దానికి తగ్గట్లుగానే నిర్ణయాలు తీసుకుంటూడటం ఆసక్తి రేపుతోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

జగన్ తండ్రిని కూడా వదల్లేదా..? షర్మిల సంచలన వ్యాఖ్యలు

ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల అసలు రాజకీయం ఇప్పుడు స్టార్ట్ చేశారు.వైఎస్సార్ కు వారసురాలు జగన్ రెడ్డి కాదని బలంగా చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. వైఎస్ రాజకీయ వారసత్వాన్ని కొనసాగిస్తున్నది తను...

భయపెడుతోన్న ఎండలు…వాతావరణ శాఖ బిగ్ అలర్ట్

ఎండలతో తెలుగు రాష్ట్రాలు కుతకుత ఉడుకుతున్నాయి. బయటకు వెళ్లేందుకు జనం జంకుతున్నారు. పగలూ, సాయంత్రం అనే తేడా లేకుండా ఉక్కపోత సెగలు పుట్టిస్తోంది.ఈ క్రమంలోనే వాతావరణ శాఖ బిగ్ అలర్ట్ ఇచ్చింది. రానున్న...

ఈవీఎం, వీవీ ప్యాట్ పిటిషన్లపై సుప్రీం కీలక తీర్పు

లోక్ సభ ఎన్నికల వేళ ఈవీఎం-వీవీప్యాట్‌కు సంబంధించి దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు తీర్పు వెలువరించింది. వీవీప్యాట్‌ స్లిప్పులతో ఈవీఎం ద్వారా పోలైన ఓట్లను వందశాతం సరిపోల్చాలనే పిటిషన్లను సర్వోన్నత న్యాయస్థానం తిరస్కరించింది. జస్టిస్...

పోలింగ్ ముగిసిన తర్వాత ట్యాపింగ్ కేసులో అసలైనఅరెస్టులు !

ఎన్నికల హడావుడి తగ్గిన తర్వాత ట్యాపింగ్ కేసులో ఎన్నో బ్రేక్ డాన్సులు చోటు చేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. స్పెషల్‌ ఇంటెలిజెన్స్ బ్యూరో చీఫ్‌గా పనిచేసిన ప్రభాకర్ రావుపై రెడ్ కార్నర్ నోటీసులు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close