బీసీ – మాదిగ – కాపు ” కాంబినేషన్ సెట్ చేసుకున్న బీజేపీ !

తెలంగాణలో బీజేపీ గెలుపు కోసం పూర్తిగా కులాల లెక్కల్నే చూసుకుంటోంది. ఇందు కోసం మూడు సామాజికవర్గాలపై పెద్ద ప్లాన్ వేసింది. దాన్ని నేరుగా ప్రధానమంత్రి నరేంద్రమోదీ అమలు చేస్తున్నారు. బీసీ ముఖ్యమంత్రి నినాదం… ఎస్సీ వర్గీకరణ హామీ… పవన్ కల్యాణ్ సాయంతో కాపు ఓట్లు.. ఈ మూడు కలిస్తే గెలిచేస్తామని బీజేపీ ఆశలు పెట్టుకుంది. ఆ ప్రకారమే పని చేసుకుంటూ పోతోంది. బీజేపీ గెలిస్తే బీసీ సీఎం వస్తారని బీజేపీ ఇప్పటికే ఉద్ధృతంగా ప్రచారం చేస్తోంది. అది ప్రజల్లోకి వెళ్తుందా లేదా అన్న సంగతి పక్కన పెడితే… తెలంగాణలో మెజార్టీ వర్గం బీసీలు. వారికి సీఎం పదవి ఇస్తామని చెబుతున్నారు. బండి సంజయ్, ఈటల వంటి వారు ఈ పదవి కోసం ఇప్పటి నుంచే పోటీ పడుతున్నారు.

అయితే అందరు బీసీలు ఏకపక్షంగా మద్దతివ్వరు కాబట్టి… మరో రెండు కాంబినేషన్లు సెట్ చేసుకున్నారు. అందులో మాదిగ వర్గం ఒకటి. ఎస్సీ వర్గీకరణకు కమిటీ వేస్తామని చెప్పేందుకు మోదీ భారీ బహిరంగసభ ఏర్పాటు చేసుకున్నారు. మందకృష్ణ ముందుండి నడిపించారు. ప్రధాని వంటి వ్యక్తి పిలిచి సభ ఏర్పాటు చేయమంటే మందకష్ణ వద్దనుకుంటారా ?. సభలో మందకృష్ణను దగ్గరకు తీసుకుని ఓదార్చడం దగ్గర్నుంచి .,. ఈ విషయంలో తమ నాయకుడు మందకృష్ణేనని చెప్పడం వరకూ ఆ వర్గాన్ని మోదీ ఎలా ఆకట్టుకోవాలో అలా ఆకట్టుకోవడానికి ప్రయత్నించారు.

ఇటీవల ఎల్బీ స్టేడియంలో జరిగిన బీసీ ఆత్మగౌరవసభలో పవన్ కల్యాణ్ కు కూడా మోదీ అదే తరహా ట్రీట్ మెంట్ ఇచ్చారు. ఆప్యాయంగా పలకరించారు. తన వెనుక పవన్ ఉన్నారని గొప్పగా చెప్పుకున్నారు. మున్నూరు కాపు ఓట్లపై మోదీ కన్నేసి ఇలా చేశారని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అయితే తెలంగాణలో … అన్నీ వదిలేసి ప్రజలు కులాల వెంటపడి… మూడు కాంబినేషన్లు కలిపింది కదా అని బీజేపీకి ఓటేస్తారా అన్నదే ఇక్కడ సస్పెన్స్.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ప్రచారం ముగిసింది – 30న అసలు యుద్ధం !

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు అసలు ప్రచారం ముగిసింది. ఇప్పటి వరకూ ప్రచారంలో ముందు మేమున్నామంటే.. మేమున్నాని చెప్పుకునేందుకు జన సమీకరణ కోసం భారీగా ఖర్చు చేసిన పార్టీలు.. ఇప్పుడు అసలు యుద్ధం ప్రారంభించాయి....

మరో ఇద్దరు ఏపీ ఐఏఎస్‌లకు జైలు శిక్ష – సిగ్గు రాదా ?

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ నిర్వాకాల గురించి గ్రంధాలు రాసినా తరగనంత సాహిత్యం పోగుపడిపోయింది. కోర్టుల దగ్గర ఉన్న ధిక్కార పిటిషన్లను లెక్కేసుకోవడానికి ఐదేళ్లు చాలవు. అతి కష్టం మీద తీర్పు వచ్చినా వాటిని అమలు...

ఏపీ సర్కార్ వారి డేటా ఎనలిటికల్ యూనిట్ – పెద్ద ప్లానే !

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొత్తగా డేటా ఎనలిటికల్ యూనిట్ ను ఏర్పాటు చేస్తూ నిర్ణయం తీసుకుంది. ఏం డేటా ఎనలటిక్స్ చేస్తుందంటే... ఆదాయమంట. ఆదాయం ఎక్కడ తగ్గిపోయిందో గుర్తించి పెంచడానికి ఈ యూనిట్...

చంద్రబాబు బెయిల్ రద్దు కాలేదు సరి కదా సర్కార్‌కు సుప్రీం షరతు !

చంద్రబాబు జనాల్లోకి వస్తే తమ పరిస్థితి ఏమి అయిపోతుందోనని కంగారు పడిపోతున్న జగన్ రెడ్డి అండ్ గ్యాంగ్ సుప్రీంకోర్టులోనూ దాని కోసమే ప్రయత్నించారు. చంద్రబాబు రాజకీయ ర్యాలీలు, సమావేశాల్లో పాల్గొనకుండా షరతులు విధించాలని...

HOT NEWS

css.php
[X] Close
[X] Close