“చెంగిచెర్ల” మీదుగా బీజేపీ ఎలక్షన్ ప్లాన్లు !

మేడ్చల్ నియోజకవర్గం చెంగిచెర్ల గ్రామంలో హోలీ పండుగ సందర్భంగా ఘర్షణ జరిగింది. డీజే పాటలు పెట్టుకొని హోలీ సంబరాలు చేసుకుంటుండగా.. మరో వర్గానికి చెందిన వారు ఆ పాటలు ఆపాలని కోరారు. ఈ క్రమంలో ఇరు వర్గాలు ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. ఘటనకు సంబంధించిన దృశ్యాలు సోషల్‌ మీడియాలో వైరల్‌ కావడంతో వెంటనే బీజేపీ రాజకీయం ప్రారంభించింది. అది హిందూ ముస్లిం గొడవ ..అని.. ఒక్క చెంగిచెర్ల ఇష్యూ కాదని.. రాష్ట్రం మొత్తం ఇష్యూ అని ఒకరి తర్వాత ఒకరు పరామర్శలు ప్రారంభించారు.

మొదట కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి బాధితులను పరామర్శించారు. హిందువులపై దాడులు చేస్తే సహించేది లేదన్నారు. తర్వాత బండి సంజయ్ బుధవారం పిలుపునిచ్చి మరీ చెంగిచెర్ల వెళ్లారు. బండి పిలుపుతో.. పెద్ద ఎత్తున బీజేపీ నేతలు, హిందూ సంఘాల నేతలు రావడంతో పోలీసులు వారిని అడ్డుకున్నారు. కాసేపు అక్కడి వాతావరణం రణరంగంగా మారింది. బీజేపీ కోరుకున్నట్లుగా స్టేట్ పొలిటికల్ ఇష్యూగా మారింది. బండి సంజయ్ తమ విధులకు ఆటంకం కలిగించారని పోలీసులు కేసులు పెట్టారు. ఈ వివాదానికి కొనసాగింపుగా రాజాసింగ్ అక్కడకు వెళ్లేందుకు ప్రయత్నించడంతో ఆయనను హౌస్ అరెస్ట్ చేశారు.

బీజేపీకి ఇలాంటి అవకాశాలు దొరికితే ఏం చేస్తుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అదే చేస్తుంది. ఈ ఇష్యూని ఇంతటితో వదిలే అవకాశం ఉండదు. ఎన్నికల అంశంగా మార్చుకున్నా ఆశ్చర్యం లేదు. కాంగ్రెస్ విషయంలో బీజేపీ కార్నర్ చేయడానికి హిందూ, ముస్లిం అంశాలను ఎప్పుడూ ముందుకు తెస్తుంది. అందుకే ఈ విషయాన్నీ హైలెట్ చేస్తుంది. మరి తెలంగాణ ప్రజలు ఎలా తీసుకుంటారో !

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

వేలంపాట మాదిరి వైసీపీ మేనిఫెస్టో..!?

వైసీపీ మేనిఫెస్టో చూసిన వారందరికీ వేలంపాట గుర్తుకు రాక మానదు. టీడీపీ ఒకటి అంటే...మేము రెండు అంటాం అనే తరహలో వైసీపీ మేనిఫెస్టోను రూపొందించినట్లుగా కనిపిస్తోంది. రాష్ట్ర ఆర్థిక స్థితిగతులను ఏమాత్రం అంచనా...

వైజాగ్ నుంచి పాలన… జగన్ ను జనం విశ్వసించేనా..?

మూడు రాజధానుల పేరుతో ఏపీకి రాజధాని లేకుండా చేసిన జగన్ రెడ్దికి ఎన్నికల్లో క్యాపిటల్ ఫియర్ పట్టుకున్నట్లు కనిపిస్తోంది. రెండో దఫా అధికారంలోకి వస్తే విశాఖ కేంద్రంగా పాలన కొనసాగుతోందని మేనిఫెస్టో విడుదల...

సేమ్ మేనిఫెస్టో : ఆశలు వదిలేసుకున్న జగన్ !

వైసీపీ అధినేత జగన్ ఈ ఎన్నికలపై ఆశలు వదిలేసుకున్నట్లుగా కనిపిస్తోంది. ఏ మాత్రం అమలు చేయలేపోయిన గత ఎన్నికల మేనిపెస్టోను మళ్లీ ప్రకటించారు. కాకపోతే గతం కన్నా కాస్తంత ఎక్కువ డబ్బులు ఇస్తానని...

ప్రజల ట్రోలింగ్ దెబ్బకు బ్యాండేజ్ మాయం..!!

ఏపీ సీఎం జగన్ రెడ్డి ఎట్టకేలకు బ్యాండేజ్ వదిలేశారు. జగన్ కనుబొమ్మపై రాయి దాడి జరిగి రెండు వారాలైనా బ్యాండేజ్ విప్పకపోవడంతో ఇదంతా సానుభూతి డ్రామా అనే చర్చ జరిగింది. జగన్ కు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close