వైసీపీ తుడిచి పెట్టుకుపోతుందనే బీజేపీ భావన !

టీడీపీ-జనసేన-బీజేపీ పొత్తులు కొలిక్కి వచ్చాయి. అధికారిక ప్రకటన వచ్చింది. సీట్ల షేరింగ్ కూడా పూర్తయింది. అంతాస్మూత్ గా వెళ్లిపోవడం ఖాయంగా కనిపిస్తోంది. రెండు, మూడు రోజుల్లో అభ్యర్థుల ప్రకటన కూడా ఉంటుంది. అయితే టీడీపీ ఎన్డీఏలో చేరకుండా జగన్ మోహన్ రెడ్డి విశ్వ ప్రయత్నాలు చేశారు. స్వయంగా ప్రధాని ద్వారా ప్రయత్నాలు చేశారు. చంద్రబాబు అమిత్ షాతో భేటీ అయితే… జగన్ నేరుగా ప్రధానితో భేటీ అయి తానుండగా.. టీడీపీ అవసరం ఏమిటని చెప్పారు. ఈటీజీ సర్వేలను ఇచ్చి…తనకే ఎక్కువ పార్లమెంట్ సీట్లు వస్తాయని కూడా చెప్పారని అంటున్నారు.

అయితే తెలివితేటలు తనకే ఉన్నాయని జగన్ రెడ్డి అనుకున్నారేమో తెలియదు కానీ ఏపీలో పరిస్థితులపై బీజేపీకి స్పష్టమైన అవగాహన ఉందని మాత్రం ఇప్పుడు వైసీపీ నేతలకు అర్థమయిందని అంటున్నారు. ఏపీలో వైసీపీ పరిస్థితి బాగుందని కొన్నిజాతీయ మీడియాలకు ప్యాకేజీ ఇచ్చి రాయించుకున్నా… అసలు నిజమైన పరిస్థితిని తెలుసుకునేందుకు కేంద్రానికి ఓ వ్యవస్థ ఉందన్న సంగతిని జగన్ రెడ్డి మర్చిపోయారన్న సెటైర్లు వినిపిస్తున్నాయి. పరిస్థితి చేయి జారిపోవడంతో ఇప్పుడు వైసీపీలో గుబులు ప్రారంభమయింది.

వైసీపీ ఆరోపణలుకాస్త విచిత్రంగా ఉంటాయి. ఒకవైపు బీజేపీతో పొత్తుకు ప్రయత్నిస్తూనే మరోవైపు కాంగ్రెస్‌ను కూడా తన చెప్పుచేతల్లో ఉంచుకుంటున్నారని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఏపీ పీసీసీ వైఎస్ షర్మిలారెడ్డి తన సోదరుడు జగన్ మోహన్ రెడ్డి చెప్పినట్లుగా కాకుండా చంద్రబాబు చెప్పినట్లుగా రాజకీయం చేస్తున్నారని సజ్జల అంటున్నారు. అదెలా సాధ్యమా అన్నది పక్కన పెడితే.. ఒక్క షర్మిల విషయంలోనేకాదు.. వైఎస్ వివేకా హత్య కేసులో ఏదైనా పరిణామం సంభవించినా.. దానికి కారణం చంద్రబాబే అంటున్నారు. కడప, పులివెందులలో వైఎస్ కుటుంబసభ్యులు ఎవరు .. ఏ పార్టీ తరపునపోటీ చేయాలన్నది కూడా చంద్రబాబే నిర్దారిస్తున్నారని గతంలోనేసజ్జల ఆరోపించారు. ఇలా తమకు వ్యతిరేకంగా జరుగుతున్న ప్రతీ పరిణామం చంద్రబాబే అని చెప్పడం వల్ల ఎంత పొలిటికల్ మైలేజీ వస్తుందో కానీ.. వైసీపీ మాత్రం ఒత్తిడిలో కూరుకుపోయిందని అర్థం చేసుకోవచ్చు.

నిఖార్సుగా సర్వేలు చేసే సీఓటర్ వంటి సంస్థలు… వైసీపీ పరిస్థితి ఊహించనంత ఘోరంగా ఉందని ఇప్పటికే తేల్చాయి. అందుకే బీజేపీ ఇక వైసీపీని నమ్మడం దండగన్న నిర్ణయానికి వచ్చింది. ఎన్నికల తర్వాత కూడా బీజేపీ .. వైసీపీని కాపాడేందుకు.. సాహసించకపోవచ్చన్న అంచనాలు ఉన్నాయి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కడప అసెంబ్లీ రివ్యూ : టీడీపీ గెలుపు ఖాయమని ఉద్ధృతంగా మౌత్ టాక్ !

రాష్ట్రం మొత్తం వైసీపీకి ఎదురుగాలి వీస్తోందని అందరూ చెప్పుకుంటున్నారు. వైసీపీ నేతలు కూడా ఒప్పుకుంటున్నారు. కానీ కడప జిల్లాలో మాత్రం వైసీపీదే అధిపత్యం అన్న నమ్మకంతో ఉన్నారు. జిల్లా మొత్తం పక్కన...

ఇక ఏపీలో ఆస్తి కొంటే జిరాక్సులే !

ఆంధ్రప్రేదశ్ ప్రభుత్వం ఆస్తుల రిజిస్ట్రేషన్లలో కొత్త పద్దతి ప్రవేశ పెట్టింది. ఇక నుంచి ఎవరికీ అక్కడ అసలైన పత్రాలివ్వరు. జిరాక్సులు మాత్రమే ఇస్తారు. వాటితోనే లావాదేవీలు నిర్వహించుకోవాలి. ఈ డేటా ,...

కరెంట్‌తో కితకితలు పెట్టుకుంటున్న బీఆర్ఎస్

బీఆర్ఎస్ పార్టీలో పై నుంచి కింది స్థాయి వరకూ ఎవరూ నేల మీదకు దిగడం లేదు. బీఆర్ఎస్ అధికారం కోల్పోయిన ఐదు నెలల్లోనే ఏదో జరిగిపోయిందని ప్రజల్ని నమ్మించేందుకు ప్రయత్నిస్తున్నారు. తామున్నప్పుడు...

తెలంగాణలో కనిపించని ఎన్నికల హడావుడి – ఖర్చు భయమే !

తెలంగాణలో లోక్ సభ ఎన్నికలు జరుగుతున్నాయి. మీడియాలో తప్ప క్షేత్ర స్థాయిలో ఎక్కడా ఎన్నికల ప్రచార హడావుడి కనిపించడం లేదు. అన్ని ప్రధాన పార్టీలు ఇంకా ప్రచారాన్ని ఉద్ధృతం చేయలేదు. మరో...

HOT NEWS

css.php
[X] Close
[X] Close