బీజేపీ ఆకర్ష్..! టీడీపీకి “రాజ్యసభ” గుడ్‌బై..!?

తెలుగుదేశం పార్టీపై భారతీయ జనతా పార్టీ పంజా విసురుతోంది. ఆ పార్టీకి చెందిన ఆరుగురు రాజ్యసభ సభ్యుల్లో ఐదుగుర్ని చేర్చుకోవడానికి మంతనాలు జరుపుతోంది. రాజ్యసభలో భారతీయ జనతా పార్టీకి… కావాల్సిన మెజార్టీ లేకపోవడంతో… బిల్లులు ఆమోదం పొందలేకపోతున్నారు. ఈ క్రమంలో.. పలు పార్టీల నుంచి.. రాజ్యసభ ఎంపీలను చేర్చుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. టీడీపీ ఎంపీలను సంప్రదించి.. బేరసారాలు పూర్తి చేసినట్లుగా ఢిల్లీలో ప్రచారం జరుగుతోంది.

సీఎం రమేష్, సుజనా చౌదరి కూడా జంప్..!?

తెలుగుదేశం పార్టీ భ్రష్టుపట్టిపోవడానికి కారణం ఎవరు అంటే.. తెలుగుదేశం పార్టీలో ముందుగా వినిపించే రెండు పేర్లు సుజనా చౌదరి, సీఎం రమేష్. ప్రజల్లో ఏ మాత్రం పలుకుబడి లేని వీర్ని… కేవలం తెలుగుదేశం పార్టీని ఆర్థికంగా ఆదుకున్నారన్న కారణంగా చంద్రబాబునాయుడు నెత్తికెక్కించుకున్నారు. ఇద్దరికీ వరుసగా రెండు సార్లు రాజ్యసభ సభ్యత్వాలు కట్టబెట్టారు. సుజనా చౌదరిని అయితే కేంద్రమంత్రిని కూడా చేశారు. ఇప్పుడు.. టీడీపీ ఓడిపోయే సరికి.. వారికి వారి వ్యాపారాలు గుర్తుకు వచ్చాయి. ఇప్పటికే సుజనాపై జరిగిన ఐటీ, ఈడీ దాడులు అన్నీ ఇన్నీ కావు. ఇక సీఎం రమేష్ పరిస్థితి కూడా అంతే. ఇప్పుడు.. వీరిద్దరూ తమ వ్యాపారాల కోసం తమ దారి తాము చూసుకోవాలనుకున్నట్లుగా ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే రామ్‌మాధవ్‌తో చర్చలు కూడా జరిపారంటున్నారు.

మిగతా ముగ్గురిని కలిపి ప్రచారం చేస్తున్నారా..? నిజంగానే వెళ్తారా..?

టీడీపీకి తెలంగాణ నుంచి గరికపాటి మోహన్ రావు రాజ్యసభ ఎంపీగా ఉన్నారు. టీజీ వెంకటేష్, తోట సీతారామలక్ష్మి, కనకమేడల రవీంద్రకుమార్.. మిగతా సభ్యులు. వీరిలో.. సుజనా చౌదరి, సీఎం రమేష్ పారిశ్రామిక కోటా నుంచి ఎంపికయ్యారు. టీజీ వెంకటేష్ కూడా.. అదే కోటాలో వచ్చారు. అయితే.. ఆయన బీజేపీలో చేరుతారా.. లేదా అన్నదానిపై.. క్లారిటీ లేదు. ఆయనకు చాలా.. పారిశ్రామిక సంస్థలు ఉన్నాయి కాబట్టి… చేరినా ఆశ్చర్యపోవాల్సిన పని లేదు. ఇక తోట సీతారామలక్ష్మి, గిరకపాటి, కనకమేడల మాత్రం… బీజేపీలో ఎందుకు చేరుతారన్న చర్చ జరుగుతోంది. గరికపాటికి రాజ్యసభ సీటు ఇచ్చినప్పుడు.. మోత్కుపల్లి లాంటి వాళ్లు… పార్టీలో చేసిన రచ్చ అంతా ఇంతా కాదు. అయినా చంద్రబాబు ఆయనను ప్రొత్సహించారు. అలాగే.. తోట సీతారామలక్ష్మికి సీటు ఇచ్చినప్పుడు.. కూడా చాలా పోటీ ఉంది. అయినా.. చంద్రబాబు అందరికీ ఒప్పించి సీట్లు ఇచ్చారు. రాజ్యసభకు పంపారు. తెలంగాణలో పార్టీ లేదు కాబట్టి తాను పార్టీ మారతానని గరికపాటి చెబితే.. అంత కంటే హాస్యస్పదమైన కారణం ఏమీ ఉండదు.. ఎందుకంటే.. ఆయన ప్రత్యక్ష రాజకీయాల్లో పాల్గొని పది ఓట్లు తెచ్చుకున్న ఫీట్ ఎప్పుడూ చేయలేదు.

రాజ్యసభ సభ్యులు వెళ్తే టీడీపీ గండి పడినట్లే..!?

టీడీపీని ఫినిష్ చేయడానికి… బీజేపీ ఓ ప్రణాళిక ప్రకారం.. వ్యవహారం నడుపుతోంది. దానికి వైసీపీ సంపూర్ణంగా సహకరిస్తోంది. ప్రస్తుతం రాజ్యసభసభ్యులతో ప్రారంభించారు. తర్వాత అన్ని స్థాయిల నేతలనూ లాగేసుకునే అవకాశం ఉంది. ఈ పరిణామంతో.. వారు అనుకున్నట్లుగా.. ఏపీలో టీడీపీ ఫినిష్ అయిపోయినా ఆశ్చర్యం లేదన్న అభిప్రాయం.. ఇతర పార్టీల నుంచి వస్తోంది. బీజేపీ రాజకీయాలు అలాగే ఉంటాయంటున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఒకే టైటిల్… మూడు సినిమాలు

టాలీవుడ్ లో టైటిళ్ల‌కు కొర‌త వ‌చ్చిందా? ప‌రిస్థితి చూస్తుంటే అదే అనిపిస్తోంది. త‌మ సినిమాల‌కు ఎలాంటి టైటిల్ పెట్టాలో అర్థం కాక‌, ఒక‌టే టైటిల్ తో మూడు సినిమాలు తీసేస్తున్నారు. టాలీవుడ్ లో...

బీజేపీపై పోస్టర్లు – అప్పట్లో బీఆర్ఎస్ ఇప్పుడు కాంగ్రెస్

బీజేపీపై చార్జిషీట్ అంటూ కాంగ్రెస్ పార్టీ నేతలు పోస్టర్లు రిలీజ్ చేశారు. తెలంగాణకు బీజేపీ చేసిన అన్యాయం అంటూ విభజన హామీలు సహా అనేక అంశాలను అందులో ప్రస్తావించింది. వాటిని హైదరాబాద్...

నామినేషన్‌లో పవన్ ఫోటో వాడేసుకున్న గుడివాడ అమర్నాథ్ !

రాజకీయ నాయకులకు కొంచెమైన సిగ్గు.. ఎగ్గూ ఉండవని జనం అనుకుంటూ ఉంటారు. అది నిజమేనని తరచూ కొంత మంది నిరూపిస్తూంటారు. అలాంటి వారిలో ఒకరు గుడివాడ్ అమర్నాథ్. పవన్ కల్యాణ్ పై...

కవిత అరెస్ట్ వెనక సంతోష్ రావు..!?

కవిత లిక్కర్ స్కామ్ లో కటకటాల పాలవ్వడానికి ఆ నేతే కారణమా..? తన స్వప్రయోజనాల కోసం ఆయన కవితను ఇరికించారా..?నమ్మకస్తుడిగా ఉంటూనే కేసీఆర్ కు వెన్నుపోటు పొడిచారా..?గత కొద్ది రోజులుగా సంతోష్ రావు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close