సభ్యత్వ నమోదులో టీఆర్ఎస్ కంటే ముందున్న బీజేపీ..!

టీఆర్ఎస్‌లో నేతలెక్కువైపోయిన ఇబ్బంది స్పష్టంగా కనిపిస్తోంది. సభ్యత్వ నమోదు లక్ష్యాలను చేరుకోవడం లేదు. లోక్ స‌భ ఎన్నిక‌ల త‌ర్వాత మారిన ప‌రిణామాల‌తో బీజేపీ టీఆర్ఎస్‌తో పోటీగా రాజకీయాలు చేస్తోంది. ఈ క్రమంలో.. రెండు పార్టీల మధ్య పోటీ వాతావరణం ఏర్పడింది. అర్బన్ ఏరియాలే కాదు గ్రామీణ ప్రాంతాల్లో కూడా బీజేపీ హవా కనిపిస్తోంది. యువ‌త ఎక్కువ‌గా బీజేపీ స‌భ్యత్వం వైపు మొగ్గు చూపుతున్నారని ఆ పార్టీ నేతలు ప్రచారం చేసుకుంటున్నారు. 2014-18కి గాను బీజేపీకి తెలంగాణలో 18 లక్షల మంది కార్యకర్తలు ఉన్నారు. ఈ సారి 36 ల‌క్షల మందిని టార్గెట్ చేశారు.

2014 లో అధికారంలోకి వ‌చ్చిన‌ప్పటినుంచి  స‌భ్యత్వ కార్యక్రమాల‌ను టీఆర్ఎస్ సీరియస్‌గా చేస్తోంది. గ‌త సంవ‌త్సరం 70 ల‌క్షల మందికి స‌భ్యత్వం ఇచ్చే టార్గెట్ పెట్టుకున్నారు. ్యితే అది 46 ల‌క్షల దగ్గర ఆగిపోయింది.  ఈ యేడాది ఒక్కొక్క ఎమ్మెల్యేకు 50 వేల టార్గెట్ ను విధించింది టీఆర్ ఎస్ అధిష్టానం. ఈ ఏడాది 60 ల‌క్షల టార్గెట్ తో స‌భ్యత్వాన్ని ప్రారంభించారు. అయితే గ‌త ఏడాది స‌భ్యత్వంలో క‌నిపించిన జోష్ ఈసారి క‌న‌ప‌డ‌టం లేదు. అర్బన్ ఏరియాల్లో టీఆర్‌ఎస్‌కు ఆశించినంత స‌భ్యత్వం కావటం లేద‌ని ఆ పార్టీ వ‌ర్గాలే గుసగుసలాడుతున్నాయి. మున్సిప‌ల్ ఎన్నిక‌లు జరగనున్న తురణంలో… అర్బన్ ఏరియాలనే టీఆర్ఎస్ టార్గెట్ చేసింది. అయితే పార్టీలో గ్రూపు త‌గాదాలు, ఇత‌ర పార్టీల నుంచి వ‌చ్చిన నేత‌ల పెత్తనంతో స‌భ్యత్వ న‌మోదు న‌త్తన‌డ‌క‌న సాగుతోంద‌ి.

టిఆర్ఎస్ సభ్యత్వ నమోదు కార్యక్రమం ఓ వైపు నత్తనడక నడుస్తోంటే…మరోవైపు గ్రూపు తగాదాలతో వర్గాలుగా విడిపోయిన నేతలు మనకెందుకులే ఈ బాధ అనుకుంటూ సభ్యత్వ నమోదుకు డుమ్మా కొడుతున్నారు. కార్యకర్తల సహాయ నిరాకరణ కూడా టిఆర్ఎస్ నేతలకు తలనొప్పిగా మారింది. పలు చోట్ల మంత్రుల ఎదుట కార్యకర్తలు హల్ చల్ చేస్తున్నారు. మమ్మల్ని నేతలు పట్టించుకోవటం లేదంటూ నిరసనలకు దిగుతున్నారు.ఇవన్నీ సభ్యత్వ నమోదు కార్యక్రమానికి ఆటంకం కలిగిస్తున్నాయి. బీజేపీకి ఈ సమస్యలేమీ లేకపోవడంతో..  వారు జోరుగా వారి పని వారు చేసుకుంటున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

టీఆర్‌పీ స్కాంలో పీఎంవోనీ తెచ్చిన ఆర్నాబ్..!

రిపబ్లిక్ టీవీ ఓనర్ కం జర్నలిస్ట్ ఆర్నాబ్ గోస్వామి వ్యవహారం ఇప్పుడు.. మీడియా వర్గాల్లో పెను సంచలనంగా మారుతోంది. టీఆర్‌పీలను మార్ఫింగ్ చేసిన స్కాంపై జరుగుతున్న విచారణలో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి....

ఎన్నికలపై ఓవర్ టైం వర్క్ చేస్తున్న కేటీఆర్..!

తెలంగాణ రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ ఇప్పుడు అసలైన పరీక్షను ఎదుర్కొంటున్నారు. అందుకే ఆయన పండుగ మూడ్‌లో లేరు. అసలు సంక్రాంతిని పట్టించుకోకుండా... పూర్తిగా పార్టీ పనిపైనే దృష్టి పెట్టారు. మూడు...

బీజేపీకి చిక్కులు తెచ్చి పెడుతున్న సోము వీర్రాజు ఆత్రం..!

బీజేపీ అధ్యక్షుడిగా హైకమాండ్ నియమించిన తర్వాత సోము వీర్రాజు ఆత్రానికి హద్దే లేకుండా పోతోందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. బీజేపీని ఇట్టే బలపరచాలన్న లక్ష్యంతో ఆయన వేస్తున్న అడుగులు నవ్వుల పాలు చేస్తున్నాయి. అందర్నీ...

“విగ్రహాలు ధ్వంసం చేసిన” పాస్టర్ ప్రవీణ్ ఆస్తులు రూ. వెయ్యి కోట్లు..!

విగ్రహాలను తానే ధ్వంసం చేశానని స్వయంగా ప్రకటించుకున్న తూర్పుగోదావరి జిల్లాలోని ప్రవీణ్ కుమార్ అనే పాస్టర్ వ్యవహారం ఇప్పుడు కలకలం రేపుతోంది.  35 ఏళ్లలోపే ఉన్న ఆ పాస్టర్ దిగువ మధ్య తరగతి...

HOT NEWS

[X] Close
[X] Close