తెలంగాణ‌లో బెంగాల్ మోడ‌ల్ అమ‌లుకు రాం మాధ‌వ్ వ్యూహం!

గ‌డ‌చిన రెండ్రోజులుగా హైద‌రాబాద్ లోని పార్క్ హ‌య్య‌త్ హోట‌ల్ వార్త‌ల్లోకి వ‌స్తోంది! ఎందుకంటే, భాజ‌పా జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి రామ్ మాధ‌వ్ అక్క‌డే బ‌స చేశారు. తెలంగాణ‌కు చెందిన కాంగ్రెస్, తెరాస నాయ‌కుల‌తో ఆయ‌న భేటీ అవుతున్న‌ట్టు క‌థ‌నాలు వ‌స్తున్నాయి. అంటే, ఆప‌రేష‌న్ తెలంగాణ ఆయ‌న మొద‌లుపెట్టేసిన‌ట్టే. ఈశాన్య రాష్ట్రాల్లో ఉనికి లేని భాజ‌పాని, అధికారంలోకి తీసుకుని రావ‌డంలో రామ్ మాధ‌వ్ వ్యూహం ఎంత ప‌క్కాగా వ‌ర్కౌట్ అయిందో తెలిసిందే. ఇప్పుడు ద‌క్షిణాదిన క‌ర్ణాట‌క త‌రువాత నాలుగు ఎంపీల‌తో తెలంగాణ‌లో కొంత బేస్ దొరికింది కాబ‌ట్టి, ఆయ‌న ఆప‌రేష‌న్ మొద‌లైంద‌ని అనిపిస్తోంది. అయితే, ప‌శ్చిమ బెంగాల్ లో ఏ త‌ర‌హా వ్యూహం అనుస‌రిస్తున్నారో… అదే మోడ‌ల్ ను తెలంగాణ‌లో కూడా అమ‌లు చేయాల‌ని భావిస్తున్న‌ట్టు స‌మాచారం.

రాజ‌కీయ ప‌రిస్థితుల దృష్ట్యా చూసుకుంటే… తెలంగాణ‌లో కూడా బెంగాల్ త‌ర‌హా వాతావ‌ర‌ణ‌మే ఉంద‌నేది భాజ‌పా అంచ‌నా. రాష్ట్రంలో వామ‌పక్షాల‌ను నిర్వీర్యం చేసేస్తే, త‌న‌కు తిరుగుండ‌ద‌ని మ‌మ‌తా బెన‌ర్జీ అనుకున్నారు. తెలంగాణ‌లో కూడా కాంగ్రెస్ ను మ‌రింత బ‌ల‌హీనప‌రిస్తే, ఎదురుండ‌ద‌ని కేసీఆర్ కూడా భావించారు. అందుకే, ఏకంగా సీఎల్పీని విలీనం చేసేశారు. బెంగాల్ లో భాజాపా చొర‌బ‌డేందుకు ఎలాంటి అనువైన ప‌రిస్థితిని మ‌మ‌తా సృష్టించారో, తెలంగాణ‌లో కూడా అదే త‌ర‌హాలో కేసీఆర్ ఆ పార్టీకి చోటిచ్చార‌ని అనొచ్చు! ఇంకోటి ముస్లిం ఓటు బ్యాంకు విష‌యంలో కూడా బెంగాల్ లో మ‌మ‌తా ఏం ఏశారూ… మైనారిటీ ఓటు బ్యాంకును గట్టిగా ప‌ట్టుకుంటే చాల‌నుకున్నారు. ఇక్క‌డా కేసీఆర్ అదే ప‌ని చేస్తూ… ఎమ్.ఐ.ఎమ్.ను మిత్ర‌ప‌క్షంగా చేసుకున్నారు. ప్ర‌తిప‌క్షాలు లేని ప‌రిస్థితిని క్రియేట్ చేసుకుంటే, మ‌రో పార్టీకి అవ‌కాశం ఉండ‌ద‌ని భావించారు. కానీ, భాజ‌పా ప్రస్తుతం అధికారంలో ఉన్న జాతీయ పార్టీ. పైగా, తెరాస‌తో ఎలాంటి రాజ‌కీయ అవ‌స‌రాలు లేని స్థితిలో ఉంది! తెలంగాణ‌లో వ్యూహం అమ‌లుకు ఇంకెందుకు ఆల‌స్యం?

బెంగాల్ మారిదిగా భాజ‌పాకి ఇక్క‌డ‌ అడ్వాంటేజ్ క‌నిపిస్తోంది. హిందూ ఓటు బ్యాంకును ల‌క్ష్యంగా చేసుకుని అక్క‌డ లోక్ స‌భ ఎన్నిక‌ల్లో భాజ‌పా లాభ‌ప‌డింది. తెలంగాణ‌లో కూడా ఇదే డివిజ‌న్ తీసుకొస్తూ, హిందూ ఓటు బ్యాంకు ఆక‌ర్ష‌ణ ల‌క్ష్యంగా భాజపా పావులు క‌దిపేందుకు సిద్ధ‌ప‌డుతున్న‌ట్టుగా క‌నిపిస్తోంది. అందుకే, ముందుగా కొంత‌మంది నాయ‌కుల్ని ఆక‌ర్షించి, త‌రువాత బెంగాల్ తోపాటు ఈశాన్య రాష్ట్రాల్లో అనుస‌రించిన వ్యూహంతో పార్టీని బ‌లోపేతం చేయ‌డ‌మే రామ్ మాధ‌వ్ ముందున్న రాజ‌కీయ ల‌క్ష్యంగా క‌నిపిస్తోంది. మొత్తానికి, ఆప‌రేష‌న్ తెలంగాణ నెమ్మ‌దిగా మొద‌లైన వాతావ‌ర‌ణ‌మే నెల‌కొంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

రేవంత్ సర్కార్ చేస్తున్న అప్పుల కన్నా “రీ పే” ఎక్కువ !

రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూడా అప్పులు భారీగా చేస్తోందని బీఆర్ఎస్ నేతలు చేస్తున్న విమర్శలకు కాంగ్రెస్ కౌంటర్ ఇస్తోంది. తాము తెచ్చిన అప్పుల కన్నా చెల్లించేది ఎక్కువని లెక్కలు విడుదల చేసింది. కేసీఆర్...

వైసీపీలో బొత్స వర్సెస్ విజయసాయి..!?

దశాబ్దాల చరిత్ర ఉన్న విశాఖ వాల్తేరు క్లబ్ పై వైసీపీ సీనియర్ నేత విజయసాయి రెడ్డి వ్యాఖ్యలు పార్టీలో కొత్త వివాదానికి తెరలేపాయి.2014లో వైఎస్ విజయమ్మ ఓటమికి ప్రధాన కారణాల్లో ఒకటిగా ...

కవిత కోసం బీజేపీకి కేసీఆర్ సరెండర్ అయ్యారా..?

లిక్కర్ స్కామ్ లో అరెస్ట్ అయిన కవితను కాపాడుకునేందుకు కేసీఆర్ ప్రధాని మోడీతో కుమ్మక్కయ్యారా..? అందులో భాగంగానే ఐదు లోక్ సభ స్థానాల్లో బీజేపీకి సహకరించేందుకు కేసీఆర్ ఒప్పందం కుదుర్చుకున్నారా..? రాష్ట్రంలో రేవంత్...

డబ్బుతో కొడుతున్నారు : లాజిక్ మిస్సవుతున్న వైసీపీ !

డబ్బుతో ఏమైనా చేయవచ్చా ?. ఏమీ చేయలేరని చాలా ఘటనలులు నిరూపించాయి. చివరికి ఎన్నికల్లో కూడా గెలవలేరని.. డబ్బులు విచ్చలవిడిగా పంచినా.. బీఆర్ఎస్ ఓటమి నిరూపించింది....

HOT NEWS

css.php
[X] Close
[X] Close