మోదీకి 2 గంటలే నిద్ర.. మిగతా అంతా పనే !

టీడీపీ అధినేత చంద్రబాబు పదిహేడు గంటలు పని చేస్తారని టీడీపీ నేతలు ప్రచారం చేసుకుంటూ ఉంటారు. ఇప్పుడు టీడీపీ నేతల్ని మించి బీజేపీ నేతలు మోదీ గురించి ప్రచారం చేసుకుంటున్నారు. పదిహేడు గంటలు అంటే… మిగతా ఏడు గంటలు ఏం చేస్తారని ప్రజలు, ప్రతిపక్షాలు ప్రశ్నిస్తాయని అనుకున్నారేమో కానీ ఏకంగా ఇరవైరెండు గంటలు ఆయన పని చేస్తారని చెప్పుకుంటున్నారు. మోదీ రెండు గంటలు మాత్రమే నిద్రపోతారని ఇరవై రెండు గంటలు దేశంకోసం పని చేస్తారని మహారాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు చెప్పారు.

ప్రస్తుతం మహారాష్ట్రలోని కొల్హాపూర్ నార్త్ అసెంబ్లీ ఉప ఎన్నికలు జరుగుతున్నాయి. అక్కడ బీజేపీ కోసం ప్రచారం చేస్తూ… మోదీని ఓ రేంజ్‌లో పొగుడుతున్నారు. అందులోభాగంగా రెండు గంటల నిద్ర విషయంబయటకు వచ్చింది. అంతే కాదు.. ఆ రెండు గంటల నిద్ర కూడా అవసరం లేకుండా… ఇప్పుడు ప్రయోగాలు చేస్తున్నారట. ఎందుకో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.. ఆ రెండు గంటలు కూడా దేశం కోసం పని చేయడానికే. దేశం కోసం 24 గంటలు పనిచేయాలని తపిస్తున్నారని మహారాష్ట్ర బీజేపీ చీఫ్ చంద్రకాంత పాటిల్ చెబుతున్నారు.

పాటిల్ వ్యాఖ్యలు కాస్త అతిశయోక్తిగా ఉన్నా మోదీ కూడా ఓ సారి తన నిద్ర గురించి చెప్పారు. 2012లో గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఓ తాను 3-4 గంటలు మాత్రమే నిద్రపోతానని ఎన్నోఏళ్లుగా అదే అలవాటని పేర్కొన్నారు. ప్రధాని అయిన తర్వాత దాన్ని ఓ గంట తగ్గించుకున్నారని చంద్రకాంత పాటిల్ మాటలను బట్టి మనం అర్థం చేసుకోవచ్చు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కడపలో సీన్ మార్చేస్తున్న షర్మిల !

షర్మిలతో రాజకీయం అంత తేలిక కాదని ఆమె నిరూపిస్తున్నారు. హోంగ్రౌండ్ లో కడప ఎంపీగా గెలిచేందుకు ఆమె చేస్తున్న రాజకీయ వైసీపీ నేతలకు మైండ్ బ్లాంక్ చేస్తోంది. రెండు రోజుల...
video

‘వీర‌మ‌ల్లు’ టీజ‌ర్‌: లెక్క‌లు స‌రిచేసే రాబిన్ హుడ్‌

https://www.youtube.com/watch?v=4TriF7BfHyI ప‌వ‌న్ క‌ల్యాణ్ - క్రిష్ కాంబినేష‌న్‌లో రూపుదిద్దుకొంటున్న చిత్రం 'హ‌రి హ‌ర వీర‌మ‌ల్లు'. ప‌వ‌న్ రాజ‌కీయాలు, ఇత‌ర సినిమాల బిజీ వ‌ల్ల‌... 'వీర‌మ‌ల్లు'కి కావ‌ల్సిన‌న్ని డేట్లు కేటాయించ‌లేక‌పోయాడు. దాంతో ఈ సినిమా పూర్త‌వుతుందా,...

వృద్ధాప్య పెన్షన్ – జగన్‌ను ముంచిన సలహాదారుడెవరు ?

2014లో తాను సీఎం అయ్యే నాటికి రూ. 200 ఉన్న వృద్ధాప్య పెన్షన్ ను అధికారంలోకి రాగానే రూ. వెయ్యి చేశారు. మళ్లీ ఎన్నికలకు ఆరు నెలల ముందు రూ....

ఒక్క కేసీఆర్ మాటలే వినిపించాయా – అదీ నెల తర్వాత !

కేసీఆర్‌ ప్రచారంపై ఈసీ రెండు రోజులు బ్యాన్ చేయడంపై ఆశ్చర్యం వ్యక్తమవుతోంది. అన్ని పార్టీల నేతల్లోనూ కేసీఆర్ మాటల్ని ఈసీ ఇంత సీరియస్ గా తీసుకుందా అన్న డౌట్ కు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close