కశ్మీరీ యువతులపై బీజేపీ ముఖ్య నేతల రోత వ్యాఖ్యలు..!

ఆర్టికల్ 370 రద్దు వల్ల… ఏం ప్రయోజనం కలిగింది..? ఈ ప్రశ్న.. ఉత్తరాది బీజేపీ నేతల్ని అడిగితే.. మొట్టమొదటగా వచ్చే సమాధానం… కశ్మీరీ యువతులే. చాలా మంది మనసులో అనుకుంటున్నారేమో కానీ… కొంత మంది బయటపడిపోతున్నారు. ఏ మాత్రం మొహమాట లేకుండా.. కశ్మీరీ యువతులపై… అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారు. ఆర్టికల్ 370 రద్దుతో.. తమకు వారిపై అధికారం వచ్చినట్లుగా ఫీలవుతున్నారు. ఓ నేత.. ఇక నిర్భయంగా.. కశ్మీరీ యువతుల్ని పెళ్లాడవచ్చని … బీజేపీ కార్యకర్తలకు సందేశమిస్తారు. మరో నేత.. ఇక కశ్మీర్ నుంచి అమ్మాయిల్ని తెచ్చుకోవచ్చని రిలీఫ్ ఫీలవుతూంటారు. వీళ్లేం బీజేపీలో… సాదాసీదా నేతలు కాదు.. ఒకరు ఎమ్మెల్యే.. మరొకరు ముఖ్యమంత్రి.

హర్యానా ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్.. ఆర్టికల్ 370 రద్దు చేయడం వల్ల తమ రాష్ట్రానికి గొప్ప ఊరట లభించినట్లు ఫీలయ్యారు. ఆయన మంత్రివర్గ సహచరుడు ఒకరు.. బీహార్ నుంచి.. కోడళ్లను తీసుకొస్తామని చెబుతూ ఉంటారట.. ఇక నుంచి.. కశ్మీర్ నుంచి కూడా అమ్మాయిల్ని తెచ్చుకునేందుకు లైన్ క్లియర్ అయిందని.. తన అభిప్రాయాన్ని నేరుగా చెప్పేశారు. హర్యానాలో.. స్త్రీ – పురుషుల నిష్పత్రి బాగా తగ్గిపోయింది. అక్కడ యువకులకు పెళ్లిళ్లు కావడం కష్టంగా మారింది. ఈ ఉద్దేశంతోనే.. ఓ మంత్రి బీహార్ నుంచి కోడళ్లను తెచ్చుకుంటామని.. చెబుతారు. ముఖ్యమంత్రికి… ఆర్టికల్ 370 రద్దుతో.. ఆ సమస్య పరిష్కరానికి కశ్మీర్ అమ్మాయిలు కూడా.. ఇక చాయిస్ అవుతారని.. విశ్లేషించుకున్నారు.

ఉత్తరప్రదేశ్ ప్రజాప్రతినిధుల్లోనూ.. ఆర్టికల్ 370 రద్దు వల్ల వచ్చే ప్రయోజనం.. వారికి ముందుగా… కశ్మీరీ యువతుల్లోనే కనిపిస్తోంది. ఉత్తరప్రదేశ్‌లోని ముజఫర్ నగర్ బీజేపీ ఎమ్మెల్యే విక్రమ్ సైనీ ఇక కశ్మీర్ యువతుల్ని బీజేపీ బ్యాచిలర్లు వివాహం చేసుకోవచ్చని ప్రకటించారు. కశ్మీర్‌కు వెళ్లాలని అక్కడ స్థలాలు కొనుక్కోవాలని మహిళలను పెళ్లి చేసుకోవాలని పిలుపునిచ్చారు. వీరు ఇలా మాట్లాడటానికి పెళ్లిళ్లు చేసుకోవడానికి అమ్మయిల కొరత ఉండటం ఒక్కటే కారణం కాదు.. గతంలో.. బయట వ్యక్తిని కశ్మీర్ యువతిని పెళ్లి చేసుకుంటే ఆమె పౌరసత్వం కశ్మీర్ లో రద్దు అయిపోతుంది. అందుకే బీజేపీ నేతలు తమ వికారాన్ని ఇలా చూపిస్తున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com