ఎలక్ట్రానిక్ మీడియా సంగతులు: కాస్ట్ కటింగ్‌లో చానల్స్..!

తెలుగు ఎలక్ట్రానిక్ మీడియాలో కరెక్షన్ వస్తోంది. ఎన్నికలకు రెండేళ్ల ముందు నుంచి ప్రారంభమైన హడావుడి ఇప్పుడు పూర్తిగా సద్దుమణిగింది. ఎన్నికల సమయంలో.. తమదైన ప్రత్యేకత చూపాలని.. చానళ్లనీ… బడ్జెట్ ఎక్కువైనా.. సీనియర్లను నియమించుకుని.. తమదైన రీతిలో వార్తలు ప్రసారం చేశాయి. ఇప్పుడు.. ఎన్నికలు ఫలితాలొచ్చాయి. ప్రభుత్వాలు ఏర్పడిపోయాయి. ఇప్పుడు ఆయా ప్రభుత్వాల మీద విరుచుకుపడేంత వెసులుబాటు కూడా లేదు. అందుకే.. ఇప్పుడు.. భారాన్ని తగ్గించుకునే పనిలో పడ్డాయని ఎలక్ట్రానిక్ మీడియాలో జరుగుతున్న పరిణామాలు నిరూపిస్తున్నాయి.

10 టీవీ, ఎన్టీవీలో కాస్ట్ కటింగ్ చర్యలు..!

తెలుగు టాప్ త్రీ చానల్‌లో ఒకటిగా ఉన్న ఎన్టీవీ.. యాజమాన్యం నెలవారీ బడ్జెట్ ను తగ్గించుకునే ప్రయత్నంలో పడింది. ఆ చానల్‌లో మ్యాన్ పవర్ అత్యధికంగా ఉంటుంది. రూ. లక్షకుపైబడి జీతాలు తీసుకునేవారు కూడా.. కాస్త అధిక సంఖ్యలోనే ఉన్నారు. వారు కాకుండా.. ఎన్నికల సమయంలో.. చాలా మందిని నియమించుకున్నారు. ఇటీవలి కాలంలో.. కొంత మంది సంస్థను విడిచిపెట్టి.. వెళ్లినప్పటికీ.. వారంతా.. ఓ మాదిరి ఉద్యోగులే. భారీ జీతాలు తీసుకునేవారెవరూ కదలడం లేదు. అందుకే ఎన్టీవీ యాజమాన్యం కొంత మంది సీనియర్లను తగ్గించుకునే ప్రయత్నం చేస్తోందని చెబుతున్నారు. అదే సమయంలో.. ప్రముఖ పారిశ్రామికవేత్తల చేతికి చేరిన 10 టీవీలో కూడా.. కాస్ట్ కటింగ్ చర్యలు ప్రారంభమయ్యాయి. ఇప్పటికే.. వస్తున్న ఆదాయం.. చేస్తున్న ఖర్చుకు ఆ చానల్‌లో పొంతన కుదరడం లేదు. అందుకే.. వీలైనంత వరకూ.. సిబ్బందిని తగ్గించుకుని ఇతర ఖర్చులను కూడా నియంత్రించుకోవాలనుకుంటున్నారు.

తెలంగాణలో టీవీ9ని రీప్లేస్ చేస్తున్న V6 ..!

తెలంగాణ మీడియాలో ఓ రకమైన స్తబ్ధమైన వాతావరణం కనిపిస్తోంది. ప్రభుత్వ వ్యతిరేక వార్తలేవీ వినిపించడం లేదు. ఏ చానల్‌ కానీ.. ఏ పత్రిక అయినా.. కానీ.. అదే పరిస్థితి. చివరికి.. నిన్నామొన్నటిదాకా.. కాస్త ఎగ్రెసివ్ గా ఉండే… టీవీ9 కూడా ఇప్పుడు… అధికార పార్టీ మద్దతు మీడియాలో చేరిపోయింది. ఇప్పుడు.. తెలంగాణ సర్కార్‌కు కానీ.. టీఆర్ఎస్‌కు కానీ వ్యతిరేకంగా వార్తలు ఇచ్చే పరిస్థితి లేదు. అందుకే.. ప్రజలు.. ఆల్టర్‌నేటివ్‌గా.. V6ని ఎంచుకుంటున్నారు. బార్క్ రేటింగ్స్‌లో ఈ విషయం స్పష్టమవుతోంది. నిన్నామొన్నటిదాకా… V6 చైర్మన్ గడ్డం వివేక్.. టీఆర్ఎస్‌లోనే ఉండేవారు. కానీ… ఇప్పుడు బీజేపీలో చేరారు… కాబట్టి.. ఎలాంటి మొహమాటాలు కూడా ఉండవని అంచనా వేస్తున్నారు. ఇప్పుడు.. ప్రభుత్వ వ్యతిరేక వార్తలు కనిపించేది.. ఒక్క V6లోనే కావడం.. తెలంగాణ ఐడెంటిటీని ఆ చానల్ పక్కాగా క్యాచ్ చేయడంతో.. టీవీ9కి బదులుగా.. తెలంగాణలో V6నే పాపులర్‌గా మారింది.

మోజో టీవీ ఉద్యోగులకు 5 నెలల జీతం..!

ఒక్క నెల జీతం ఇచ్చి ఉద్యోగుల్ని పంపేసి … చానల్‌ను మూసివేయాలనుకున్న మోజో టీవీ యాజమాన్యంపై.. ఉద్యోగులు చేసిన పోరాటం ఫలించింది. పోలీసులతో బెదిరింపులు… ఇతర హెచ్చరికలు.. పని చేయకపోవడం.. ఉద్యోగులు.. రాజకీయ నాయకుల మద్దతు కోసం ప్రయత్నించారు. ఉద్యోగులకు మూడు నెలల జీతం సెటిల్ చేసి… ఆ డబ్బులు .. మాజీ సీఈవో రేవతికి ఇచ్చామని చేయబోయిన ప్రచారం కూడా బెడిసికొట్టింది. దీంతో.. విషయం పెద్దది కాక ముందే.. మోజో టీవీ యాజమాన్యం సెటిల్ చేసుకుంది. ఉద్యోగులందరికీ.. దాదాపుగా నాలుగున్నర నెలల జీతాలు ఇచ్చి.. పంపేయాలని నిర్ణయించుకుంది. దాంతో ఉద్యోగులకు కాస్త ఊరట లభించినట్లయింది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

video

‘ప్ర‌స‌న్న‌వ‌ద‌నం’ ట్రైల‌ర్‌: కొత్త పాయింటే ప‌ట్టారు

https://www.youtube.com/watch?v=uy8tkUFAsnA సుహాస్‌పై ప్రేక్ష‌కుల‌కు ఓ మంచి అభిప్రాయ‌మే ఉంది. త‌ను క‌చ్చితంగా విభిన్న ప్ర‌య‌త్నాలు చేస్తాడ‌నది అంద‌రి న‌మ్మ‌కం. క‌ల‌ర్ ఫొటో నుంచి అంబాజీ పేట మ్యారేజీ బ్యాండు వ‌ర‌కూ త‌న ట్రాక్ రికార్డ్...

హరీష్ రావు ఉత్తుత్తి రాజీనామా – కామెడీ చేసిన కాంగ్రెస్ !

తెలంగాణ ఉద్యమం కోసం ఇప్పటికే ఎన్నో సార్లు రాజీనామా చేశానని.. తనకు పదవులు ఓ లెక్క కాదంటూ చెప్పే హరీష్ రావు.. తాజాగా చేసిన రాజీనామా ఆయనను ట్రోల్ చేసేలా ఉంది....

చేసింది పొన్నవోలే కానీ చేయించింది జగన్ కాదట !

సీబీఐ చార్జిషీట్‌లో వైఎస్ఆర్ పేరును సోనియా గాంధీ పెట్టించారంటూ ఇంత కాలం జగన్ చేస్తున్న ప్రచారానికి షర్మిల ఒకే ఒక్క డైలాగ్ తో చెక్ పెట్టారు. పొన్నవోలు ద్వారా...

నారా భువనేశ్వరి డీప్ ఫేక్ ఆడియోతో వైసీపీ అరాచకం !

ఇంట్లో సొంత కుటుంబసభ్యుల్ని అత్యంత హీనంగా దూషిస్తున్న జగన్మోహన్ రెడ్డి పార్టీ.. ఆ పార్టీ సోషల్ మీడియా విభాగం పూర్తిగా కంట్రోల్ తప్పిపోయింది. ఏకంగా నారా భువనేశ్వరి ఆడియో పేరుతో డీప్ ఫేక్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close