బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి కుమారుడు సుధీర్ రెడ్డి హైదరాబాద్ లోని నానక్ రామ్ గూడలో తన ఇంట్లో డ్రగ్స్ తీసుకుంటూ ఈగల్ టీంకు చిక్కారు. సుధీర్ రెడ్డితో పాటు మరో వ్యక్తి డ్రగ్స్ తీసుకుంటూండగా పోలీసులకు పక్కా సమాచారం రావడంతో ఈగల్ టీం రెయిడ్ చేసి పట్టుకుంది. వెంటనే వారికి డ్రగ్స్ టెస్టులు నిర్వహించారు. పాజిటివ్ గా తేలడంతో డీఅడిక్షన్ సెంటర్ కు తరలించారు.
వారు డ్రగ్స్ వినియోగదారులు కావడంతో డీఅడిక్షన్ సెంటర్ కు తరలించారు. వారికి డ్రగ్స్ సప్లయ్ చేసిందెవరన్నదానిపై పోలీసులు దృష్టి పెట్టారు. జమ్మలమడుగు నుంచి ఎమ్మెల్యేగా ఉన్న ఆదినారాయణరెడ్డి కుమారుడు ఇప్పటి వరకూ పెద్దగా రాజకీయాల్లో జోక్యం చేసుకోలేదు. ఆయన లో ప్రోఫైల్ మెయిన్టెయిన్ చేస్తారు. అయితే హఠాత్తుగా డ్రగ్స్ కేసులో పెట్టుబడటంతో సంచలనంగా మారింది.
మొదట కాంగ్రెస్ లో ఆ తర్వాత వైసీపీలో ఉన్న ఆదినారాయణరెడ్డి తర్వాత టీడీపీ నుంచి బీజేపీలో చేరారు. ఫ్యాక్షన్ ప్రభావిత నియోజకవర్గం కావడంతో ఆయన దూకుడుగా ఉంటారు. తన కుమారుడ్ని రాజకీయాలకు దూరంగా ఉంచాలని ముందుగానే అనుకున్నట్లుగా తెలుస్తోంది. తన సోదరుడి కుమారుడు భూపేష్ రెడ్డిని ఇప్పటికే తన రాజకీయ వారుసుడిగా కూడా ప్రకటించారు. అయితే ఆది బీజేపీలో ఉంటే.. ఆయన సోదరుడి కుమారుడు టీడీపీలో ఉన్నారు.
