షర్మిలను ఏపీ వైపు మళ్లించేలా బీజేపీ రాజకీయం !?

పాదయాత్ర ఆపేసి మరీ రెండు రోజుల పాటు షర్మిల ఢిల్లీ పర్యటనకు వెళ్తున్నారు. ఆరు, ఏడు తేదీల్లో ఆమె ఢిల్లీలో ఉంటారు. బీజేపీ పెద్దలతో భేటీ అవుతారని .. వైఎస్ఆర్‌టీపీ వర్గాలు చెబుతున్నాయి. ఇంత వరకూ ఆమెకు ప్రత్యక్షంగా కానీ.. పరోక్షంగా కానీ ఎక్కడా భారతీయ జనతా పార్టీతో టచ్‌లో ఉన్నారన్న వార్తలు రాలేదు. కానీ హఠాత్తుగా ఆమె ఢిల్లీలో బీజేపీ పెద్దలతో భేటీ కానున్నారు. ఇందులో కొన్ని బహిరంగ సమావేశాలుంటాయి కానీ అంతర్గత చర్చలు ఎక్కువగా జరుగుతాయని తెలుస్తోంది.

తెలంగాణ విషయంలో షర్మిల కష్టపడి.. ఖర్చు పెట్టుకుని పాదయాత్ర చేస్తున్నారు కానీ ప్రయోజనం ఉండటం లేదు. ప్రజల్లో కనీసం చర్చ జరగడం లేదు. కనీసం ఆమె పార్టీని ఓ కాంపిటీటర్‌గా కూడా చూడటం లేదు. ఎన్నికల్లో అధికారంలోకి రావాలనుకుంటున్న బీజేపీ ఇలాంటి పార్టీల వల్ల సమస్యలు వస్తాయని అనుకుంటోంది. అందుకే వ్యూహాత్మకంగా ఆయా పార్టీలను లైన్ నుంచి తప్పించేందుకు ప్రయత్నిస్తోంది. షర్మిల విషయంలోనూ ఇదే వ్యూహాన్ని అమలు చేస్తున్నారని.. ఢిల్లీలో ఆమెకు బీ జేపీ వ్యూహకర్తలు కొన్ని ప్రతిపాదనలు పెడతారుని చెబుతున్నారు.

రాబోయే రోజుల్లో ఏపీలో జరగనున్న పరిణామాలను వివరించి.. ఏపీలో మంచి భవిష్యత్ ఉంటుందని.. అక్కడే తేల్చుకోవాలని ఆమెకు ఢిల్లీ బీజేపీ పెద్దలు సలహా ఇస్తారని అంటున్నారు. తాము అండగా ఉంటామని భరోసా ఇచ్చే అవకాశం ఉందంటున్నారు. ఇటీవల సోదరుడితో షర్మిలకు పూర్తి స్థాయి దూరం పెరిగింది. హెల్త్ వర్శిటీ పేరు మార్పును కూడా ఖండించారు. కుటుంబ పరంగా ఆస్తుల పంపకాల్లోనూ విభేదాలు వచ్చాయని చెప్పుకుంటున్నారు. అన్నింటికీ మించి షర్మిల రాజకీయంగా షైన్ అవ్వాలనుకుంటున్నారు.

అయితే వైసీపీలో ఆమెకు చోటు ఉండదు. సొంత పార్టీ పెట్టుకోవాల్సిందే. తెలంగాణలో ఏ మాత్రం వర్కవుట్ అవదని తేలిన తర్వాత షర్మిల ఖచ్చితంగా ఏపీ వైపు చూస్తారని.. అది ఎప్పుడో కాదు.. ఇప్పుడే ఉండేలా బీజేపీ ప్లాన్ చేస్తోందన్న అభిప్రాయం ఢిల్లీలో గట్టిగా వినిపిస్తోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

అలా చేస్తే రాహుల్ నపుంసకుడో కాదో తేలుతుంది..కాంగ్రెస్ నేత సంచలన వ్యాఖ్యలు

ఎన్నికలు వచ్చిన ప్రతిసారి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పెళ్లి విషయంపై బీజేపీ నేతలు కామెంట్స్ చేయడం పరిపాటిగా మారింది. ఆయనకు మగతనం లేదని అందుకే పెళ్లి చేసుకునేందుకు భయపడుతున్నారని బీజేపీ నేతలు...

బీజేపీకి రాజాసింగ్ షాక్…ఏం జరిగిందంటే..?

హైదరాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి మాధవీలత నామినేషన్ కు ఎమ్మెల్యే రాజాసింగ్ డుమ్మా కొట్టారు.హైదరాబాద్ సెగ్మెంట్ ఇంచార్జ్ గా తన అభిప్రాయాన్ని తీసుకోకుండానే ఏకపక్షంగా మాధవీలత అభ్యర్థిత్వాన్ని ఫిక్స్ చేశారని రాజాసింగ్ అసంతృప్తిగా...

తెలంగాణలో ఛాలెంజింగ్ పాలిటిక్స్

లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ హోరాహోరీగా తలపడుతున్నాయి. ప్రజాభిప్రాయం ఎలా ఉన్నా మెజార్టీ సీట్లు మావంటే మావేనని ప్రకటిస్తున్నాయి. ప్రత్యర్ధి పార్టీలపై ఆయా పార్టీల నేతలు విమర్శలు, ప్రతి విమర్శలు...

కొనసాగింపు కథల బాక్సాఫీసు వేట

‘బాహుబలి’ సినిమా సైజ్ ని పెంచింది. ప్రేక్షకులందరికీ థియేటర్స్ లోకి తీసుకురాగలిగితే బాక్సాఫీసు వద్ద ఎలాంటి మాయ చేయొచ్చు నిరూపించింది. సినిమా కథకు కూడా కొత్త ఈక్వేషన్ ఇచ్చింది. బహుబలికి ముందు దాదాపు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close