ఎల్ల‌య్య మ‌ల్ల‌య్య‌ వ్యాఖ్య‌ల‌పై కేంద్రం సీరియ‌స్ అవుతుందా?

ముఖ్య‌మంత్రి కేసీఆర్ చేసే కొన్ని వ్యాఖ్య‌లు ఎంత వ్యంగ్యంగా దెప్పిపొడుపుగా ఉంటాయో తెలిసిందే. మొన్ననే, ఆర్టీసీ ఉద్యోగుల‌పై వ‌రాలు కురిపించిన స‌మ‌యంలో కేంద్రంపై ఇదే త‌ర‌హాలో మాట్లాడారు క‌దా. ఆర్టీసీలో కేంద్రం వాటా ఉంద‌నీ, రావాల్సిన నిధుల‌పై లెక్క‌తేల్చేస్తామ‌నీ, అవ‌స‌ర‌మైతే కోర్టుకుపోతామ‌న్నారు. ఇక్క‌డి ప్ర‌తిప‌క్షాలు ఢిల్లీకి పోతామ‌ని అంటున్నారు, ఢిల్లీ ఎల‌య్య చేతిలో ఏముంది అన్నారు. అక్క‌డి నుంచి ఎల్ల‌య్య వ‌స్తాడా, మ‌ల్ల‌య్య వస్తాడా అంటూ కేంద్రంపై విమ‌ర్శ‌లు చేసేశారు. ఈ వ్యాఖ్య‌లు చేసి రెండు రోజులు తిర‌క్క‌ముందే ముఖ్య‌మంత్రి కేసీఆర్ ఢిల్లీ వెళ్లారు. ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోడీతోపాటు కొంత‌మంది కేంద్ర‌మంత్రుల్ని ఇవాళ్ల కేసీఆర్ క‌లిసే అవ‌కాశం ఉంది. దిశ ఘ‌ట‌న‌ అంశంతోపాటు విభ‌జ‌న చ‌ట్టంలోని కొన్ని అంశాలు, కేంద్రం ఇచ్చిన హామీల అమ‌లుపై కేంద్రంతో చ‌ర్చిస్తార‌ని తెరాస వ‌ర్గాలు అంటున్నాయి.

అయితే, సీఎం కేసీఆర్ ఢిల్లీ ప‌ర్య‌ట‌న‌ను భాజ‌పా ఈసారి కాస్త సీరియ‌స్ గానే తీసుకుంటుందా, తాజాగా చేసిన విమ‌ర్శ‌ల‌ను దృష్టిలో ఉంచుకునే సీఎంని భాజ‌పా నేత‌లు ట్రీట్ చేసే అవ‌కాశం ఉందా… అంటే అవున‌నే అనిపిస్తోంది. నిన్న‌నే, భాజ‌పా ఎంపీ బండి సంజ‌య్ మాట్లాడుతూ… ఢిల్లీ నుంచి ఎల్ల‌య్య వ‌స్తాడా మ‌ల్ల‌య్య వ‌స్తాడా అని మాట్లాడావ్ క‌దా, ఇప్పుడు ఎవ‌ర్ని క‌ల‌వ‌డానికి ఢిల్లీ వ‌స్తున్నావ్ అంటూ కేసీఆర్ ని ప్ర‌శ్నించారు. ఢిల్లీకి వ‌చ్చింది ఎల్ల‌య్య‌ని క‌ల‌వ‌డానికా, మ‌ల్ల‌య్య‌ని క‌ల‌వ‌డానికా చెప్పాల‌న్నారు. కేంద్ర పెద్ద‌ల గురించి మాట్లాడేప్పుడు సంస్కార‌వంతంగా, గౌర‌వం ఇచ్చే విధంగా మాట్లాడాల‌న్నారు. ఈ ఎల్ల‌య్య మ‌ల్ల‌య్య వ్యాఖ్య‌ల గురించి ఇప్ప‌టికే భాజ‌పా నాయ‌క‌త్వానికి టి.ఎంపీలు ఓ నివేదిక ఇచ్చిన‌ట్టు స‌మాచారం.

ఆర్టీసీలో కేంద్రం వాటా లెక్క‌ల‌పై కూడా కేసీఆర్ ఘాటు వ్యాఖ్య‌లు చేశారు. నిజానికి, స‌మ్మె స‌మ‌యంలో త‌మ వాటా పేరుతో రాష్ట్రంలో జోక్యం చేసుకునేందుకు భాజ‌పా సిద్ధ‌మైంది. కార్మికుల వెంట ఉంటామంటూ రాజ‌కీయంగా వాడుకునే ప్ర‌య‌త్న‌మూ చేసింది. కానీ, చివ‌రి నిమిషంలో వ్యూహాత్మ‌కంగా కేసీఆర్ యూట‌ర్న్ తీసుకుని కార్మికుల‌తో పాలాభిషేకాలు అందుకున్నారు. ఆర్టీసీ స‌మ్మెను రాజ‌కీయంగా త‌మ‌కు అనుకూలంగా మార్చుకోవ‌డానికి భాజ‌పా స‌ర్వం సిద్ధం చేసుకునేలోపు కేసీఆర్ ట్విస్ట్ ఇచ్చేశారు. దీంతో ఈ స‌మ్మె అంశం భాజ‌పాకి ఏర‌కంగానే ఉప‌యోగ‌పడ‌‌కుండా పోయిన‌ట్ట‌యింది. ఓర‌కంగా ఈ అసంతృప్తీ భాజ‌పా నేత‌ల్లో ఇప్పుడుంది. ఆర్టీసీలో కేంద్రానికీ వాటా ఉంది క‌దా, రాష్ట్రం తీసుకున్న నిర్ణ‌యాలు ఏవైనాస‌రే కేంద్రానికి చెప్పాల్సిన ఉంటుంద‌ని గ‌తంలో కోర్టు కూడా స్ప‌ష్టంగా చెప్పింది. ఇప్పుడీ పాయింట్ ని ప‌ట్టుకుని కేంద్రం స్పందించే అవ‌కాశం ఉందేమో చూడాలి. ఏదేమైనా, ఢిల్లీలో ఇవాళ్టి కేసీఆర్ భేటీల‌పై కొంత ఆస‌క్తి నెల‌కొంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఛోటా కె.నాయుడు Vs హ‌రీష్ శంక‌ర్‌… ఏం జ‌రిగింది?

'మ‌ళ్లీ నా జోలికొచ్చారో... చూసుకొందాం' అంటూ సినిమా ఫ‌క్కీలో కెమెరామెన్‌ ఛోటా కె.నాయుడుకు వార్నింగ్ ఇచ్చాడు హ‌రీష్ శంక‌ర్‌. వీరిద్ద‌రూ క‌లిసి 'రామ‌య్యా వ‌స్తావ‌య్యా' సినిమా చేశారు. అప్ప‌టి నుంచీ ఇద్ద‌రి మ‌ధ్యా...

సమయం లేదు…ఆ నియోజకవర్గాలకు అభ్యర్థులను ఎప్పుడు ప్రకటిస్తారు..?

తెలంగాణలో 15 లోక్ సభ సీట్లు గెలుపొందుతామని ధీమా వ్యక్తం చేస్తోన్న అధికార కాంగ్రెస్ ఇంకా పూర్తిస్థాయిలో అభ్యర్థులను ప్రకటించకపోవడం విస్మయానికి గురి చేస్తోంది. నామినేషన్ల పర్వం మొదలై రెండు రోజులు అవుతున్నా...

షర్మిలకు రూ. 82 కోట్ల అప్పు ఇచ్చిన జగన్ !

నామినేషన్ దాఖలు చేసే ముందు వైఎస్ జగన్‌కు షర్మిల పెద్ద చిక్కు తెచ్చి పెట్టింది. తాను జగన్మోహన్ రెడ్డికి రూ. 82 కోట్లకుపైగా బాకీ ఉన్నట్లుగా అఫిడవిట్‌లో తెలిపారు. వదిన భారతి...

మోత్కుపల్లికి అస్వస్థత.. కారణం అదేనా..?

మాజీ మంత్రి , కాంగ్రెస్ అసంతృప్త నేత మోత్కుప‌ల్లి న‌ర్సింహులు(69) తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. శనివారం ఒక్కసారిగా ఆయన బీపీ డౌన్ కావడం , షుగర్ లెవల్స్ పడిపోవడంతో అస్వస్థతకు గురైనట్లుగా...

HOT NEWS

css.php
[X] Close
[X] Close