అసెంబ్లీ సమావేశాల్లో అమరావతినే హాట్‌టాపిక్..!

అమరావతి విషయంలో.. అసెంబ్లీ సమావేశాల్లో క్లారిటీ ఇవ్వాలని ప్రభుత్వం భావిస్తోంది. జీఎన్‌రావు అనే మాజీ ఐఏఎస్ అధికారి నేతృత్వంలో వేసిన నిపుణుల కమిటీ.. అసెంబ్లీ సమావేశాల్లోపే… నివేదిక ఇవ్వనుంది. ఈ నెల తొమ్మిదో తేదీ నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అమరావతిలో పర్యటించిన రోజున..ఈ కమిటీ సభ్యులు జగన్మోహన్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. అప్పుడు.. జగన్… అసెంబ్లీ సమావేశాల్లోపు.. నివేదిక ఇవ్వాలని సూచించారు. దానికి వారు అంగీకరించారు. నిజానికి ఈ కమిటీని నియమించిన ఉద్దేశం.. నగరాలు, పట్టణాల సమగ్రాభివృద్ధికి సూచనలు చేయడం. కానీ.. బొత్స మాత్రం.. ఇది కేవలం.. రాజధానికి సంబంధించినదని.. ఈ కమిటీ సిఫార్సు మేరకే.. రాజధానిని కొనసాగిస్తామని చెప్పుకొస్తున్నారు. దీంతో.. రాజధానిపైనే సిఫార్సులు చేస్తుందని.. వైసీపీ వర్గాలు చెబుతున్నాయి.

అసెంబ్లీ సమావేశాల్లో అమరావతిపై ప్రభుత్వం నిర్ణయం ప్రకటించే అవకాశం ఉండటంతో.. ఒత్తిడి పెంచేందుకు టీడీపీ కొత్త మార్గాలు ఎంచుకుంటోంది. అన్ని ఇతర పార్టీలు, సంఘాలతో కలిసి.. ఓ రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేసింది. రాజధాని అమరావతిలో ఇప్పటివరకూ జరిగిన పురోగతి, రైతులిచ్చిన భూమి, రైతులకు తిరిగి అందించిన రిటర్నబుల్ ప్లాట్లు, రాజధాని అమరావతి ప్రస్తుత పరిస్థితి, అమరావతిపై ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలపై ఈ సమావేశంలో చర్చిస్తారు. ఈ రౌండ్ టేబుల్ సమావేశం ద్వారా ప్రభుత్వంపై రాజధాని నిర్మాణం పట్ల ఒత్తిడి పెంచాలని నిర్ణయించారు. అన్ని రాజకీయపక్షాలు ఏకమై రాజధానిపై గళం విప్పాలని భావిస్తున్నారు..

నిజానికి ఇటీవల నిర్వహించిన సీఆర్డీఏ సమీక్షా సమావేశంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాజధానిలో 50 శాతం పైబడి జరిగిన నిర్మాణాలను కొనసాగించాలని సీఆర్డీఏ అధికారులను ఆదేశించారు. రైతులకిచ్చిన ప్లాట్లలో మౌలిక సదుపాయాల కల్పన కోసం కూడా ఏర్పాట్లు చేయాలని సూచించారు. రహదారుల నిర్మాణంపై కూడా స్పష్టమైన ఆదేశాలిచ్చారు. అయితే రాజధాని రైతులు మాత్రం సీఎం జగన్ ప్రకటనలను పెద్దగా నమ్మడం లేదు. నిర్మాణాలను ఆపొద్దని జగన్ చెప్పినప్పటికీ… అధికారుల పరంగా ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు. ప్రభుత్వం కూడా.. ఊరకే మాట వరుసకు ఆ మాట చెప్పినట్లుగా ఉంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

రివ్యూ: ‘నిఫా వైర‌స్‌’

ప్ర‌పంచం మొత్తం.. క‌రోనా భ‌యంతో వ‌ణికిపోతోంది. ఇప్పుడైతే ఈ ప్ర‌కంప‌న‌లు కాస్త త‌గ్గాయి గానీ, క‌రోనా వ్యాపించిన కొత్త‌లో... ఈ వైర‌స్ గురించి తెలుసుకుని అల్లాడిపోయారంతా. అస‌లు మ‌నిషి మ‌నుగ‌డ‌ని, శాస్త్ర సాంకేతిక...

సర్వేలు.. ఎగ్జిట్ పోల్స్ అన్నీ బోగస్సే..!

గ్రేటర్ ఎన్నికల విషయంలో ఎగ్జిట్ పోల్స్ మొత్తం బోల్తా కొట్టాయి. ఒక్కటంటే.. ఒక్క సంస్థ కూడా సరిగ్గా ఫలితాలను అంచనా వేయలేకపోయింది. భారతీయ జనతా పార్టీ పట్ల ప్రజల్లో ఉన్న వేవ్ ను...

కాంగ్రెస్ పనైపోయింది..! ఉత్తమ్ పదవి వదిలేశారు..!

పీసీసీ చీఫ్ పోస్టుకు ఉత్తమ్ కుమార్ రెడ్డి రాజీనామా చేశారు. తాను ఎప్పుడో రాజీనామా చేశానని.. దాన్ని ఆమోదించి.. కొత్తగా పీసీసీ చీఫ్ ను నియమించాలని ఆయన కొత్తగా ఏఐసిసికి లేఖ రాశారు....

గ్రేటర్ టర్న్ : టీఆర్ఎస్‌పై బీజేపీ సర్జికల్ స్ట్రైక్..!

గ్రేటర్‌ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ అనూహ్యమైన ఫలితాలు సాధించింది. హోరాహోరీగా సాగిన ఎన్నికల్లో టీఆర్ఎస్ కాస్త ముందు ఉన్నట్లుగా కనిపిస్తోంది కానీ.. భారతీయ జనతా పార్టీ.. టీఆర్ఎస్‌పై సర్జికల్‌ స్ట్రైక్...

HOT NEWS

[X] Close
[X] Close