మున్సిప‌ల్ ఎన్నిక‌ల‌పై భాజ‌పా జాతీయ నాయ‌క‌త్వం ప్ర‌త్యేక శ్ర‌ద్ధ‌!

ఒక ల‌క్ష్యాన్ని నిర్దేశించుకున్న‌ప్పుడు, దాన్ని సాధించుకునే దిశ‌గా వేసే ప్ర‌తీ అడుగూ ఎంత శ్ర‌ద్ధ‌గా వెయ్యాలో భాజ‌పాని చూసి ఇత‌ర పార్టీలు నేర్చుకోవాల్సి ఉంది! తెలంగాణ‌లో పార్టీని విస్త‌రించాల‌నీ, మ‌రో ఐదేళ్ల త‌రువాత రాష్ట్రంలో అధికారంలోకి రావాల‌నేది వారి ల‌క్ష్యం. లోక్ స‌భ ఎన్నిక‌ల త‌రువాతి నుంచి హ‌డావుడి మొదలుపెట్టిన భాజ‌పా… ఇప్పుడు ఒక్క‌సారి వెన‌క్కి తిరిగి చూసుకుంటే తెలంగాణ‌లో చాలామంది నేత‌లు ఆ పార్టీలో క‌నిపిస్తున్న ప‌రిస్థితి. కాంగ్రెస్, టీడీపీల దీన ప‌రిస్థితిని త‌మ‌కు అనుకూలంగా మార్చుకుని చ‌క‌చ‌కా వ‌ల‌స‌ల్ని ప్రోత్స‌హిస్తున్నారు. స‌భ్య‌త్వ నమోదు కార్య‌క్ర‌మాన్ని పార్టీ జాతీయ అధ్య‌క్షుడు, హోంమంత్రి అమిత్ షా స్వ‌యంగా ఇక్క‌డికి వ‌చ్చి ప్రారంభించారు. ఇప్పుడు… త్వ‌ర‌లో ఇక్క‌డ జ‌ర‌గ‌బోతున్న మున్సిప‌ల్ ఎన్నిక‌ల‌పై కూడా జాతీయ స్థాయి నేత‌లు ప్ర‌త్యేక శ్ర‌ద్ధ పెడుతున్న‌ట్టు స‌మాచారం!

రాబోయే మున్సిప‌ల్ ఎన్నిక‌ల్లో తెరాస‌కు గ‌ట్టి పోటీ ఇవ్వాల‌నీ, పెద్ద సంఖ్య‌లో సీట్ల‌ను ద‌క్కించుకోవాల‌న్న‌ది భాజ‌పా ల‌క్ష్యం. ఈ ఎన్నిక‌ల్లో మెరుగైన స్థానాలు గెలిస్తే, గ‌ట్టి పునాది ప‌డ్డ‌ట్టే అవుతుంది. ఈ ఎన్నిక‌ల్లో అనుసరించాల్సిన వ్యూహంపై ఢిల్లీలో కొంత‌మంది ప్ర‌ముఖ భాజ‌పా నేత‌లు చ‌ర్చించిన‌ట్టు స‌మాచారం. రాబోయే రోజుల్లో తెలంగాణ‌లో అనుస‌రించాల్సిన వైఖ‌రిపై ఒక ప్ర‌ణాళిక సిద్ధం చేశార‌నీ, దాన్ని రాష్ట్ర నేత‌ల‌కు రేపు హైద‌రాబాద్ కి వ‌స్తున్న భాజ‌పా జాతీయ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ జేపీ న‌డ్డా వివ‌రిస్తార‌ని స‌మాచారం. 18, 19న జేపీ న‌డ్డా తెలంగాణ‌లో ప‌ర్య‌టిస్తున్న సంగ‌తి తెలిసిందే. ఆయ‌న రాగానే.. ముందుగా రాష్ట్ర నేత‌ల‌తో మున్సిప‌ల్ ఎన్నిక‌ల అంశ‌మే ప్ర‌ధానంగా చ‌ర్చించ‌బోతున్నారు. సాయంత్రం 4 గంట‌ల‌కు నాంప‌ల్లిలో జ‌రిగే స‌భ‌లో చేరిక‌లుంటాయి.

కాశ్మీరులో ఆర్టిక‌ల్ 370 ర‌ద్దు, ట్రిపుల్ త‌లాక్ ర‌ద్దు అంశాల‌ను మున్సిప‌ల్ ఎన్నిక‌ల్లో పెద్ద ఎత్తున ప్ర‌చారం చేయ‌బోతున్నారు. స్థానికంగా, కేసీఆర్ స‌ర్కారు వైఫ‌ల్యాల‌ను ఎండ‌గ‌ట్టే ప్ర‌య‌త్న‌మూ చేస్తారు. సెంటిమెంట్ ని వాడుకునేంద‌కు విమోచ‌న దినం అంటూ కూడా హ‌డావుడి చేయ‌డానికి సిద్ధ‌మౌతున్నారు. తెలంగాణ‌లో జ‌రిగే మున్సిప‌ల్ ఎన్నిక‌ల‌పై పార్టీ జాతీయ నాయ‌క‌త్వ‌మే ప్ర‌త్యేక శ్ర‌ద్ధ తీసుకుంటోందంటే… ఇంకా ఎలాంటి వ్యూహాలు అమ‌లు చేయ‌బోతున్నారో చూడాలి. ఏదేమైనా, తెరాస‌కు గ‌ట్టి పోటీ ఇచ్చే దిశ‌గా భాజ‌పా స‌మాయ‌త్తం అవుతున్న ప‌రిస్థితి క‌నిపిస్తోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

అలా చేస్తే రాహుల్ నపుంసకుడో కాదో తేలుతుంది..కాంగ్రెస్ నేత సంచలన వ్యాఖ్యలు

ఎన్నికలు వచ్చిన ప్రతిసారి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పెళ్లి విషయంపై బీజేపీ నేతలు కామెంట్స్ చేయడం పరిపాటిగా మారింది. ఆయనకు మగతనం లేదని అందుకే పెళ్లి చేసుకునేందుకు భయపడుతున్నారని బీజేపీ నేతలు...

బీజేపీకి రాజాసింగ్ షాక్…ఏం జరిగిందంటే..?

హైదరాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి మాధవీలత నామినేషన్ కు ఎమ్మెల్యే రాజాసింగ్ డుమ్మా కొట్టారు.హైదరాబాద్ సెగ్మెంట్ ఇంచార్జ్ గా తన అభిప్రాయాన్ని తీసుకోకుండానే ఏకపక్షంగా మాధవీలత అభ్యర్థిత్వాన్ని ఫిక్స్ చేశారని రాజాసింగ్ అసంతృప్తిగా...

తెలంగాణలో ఛాలెంజింగ్ పాలిటిక్స్

లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ హోరాహోరీగా తలపడుతున్నాయి. ప్రజాభిప్రాయం ఎలా ఉన్నా మెజార్టీ సీట్లు మావంటే మావేనని ప్రకటిస్తున్నాయి. ప్రత్యర్ధి పార్టీలపై ఆయా పార్టీల నేతలు విమర్శలు, ప్రతి విమర్శలు...

కొనసాగింపు కథల బాక్సాఫీసు వేట

‘బాహుబలి’ సినిమా సైజ్ ని పెంచింది. ప్రేక్షకులందరికీ థియేటర్స్ లోకి తీసుకురాగలిగితే బాక్సాఫీసు వద్ద ఎలాంటి మాయ చేయొచ్చు నిరూపించింది. సినిమా కథకు కూడా కొత్త ఈక్వేషన్ ఇచ్చింది. బహుబలికి ముందు దాదాపు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close