సుభాష్ – ఏపీలో రాష్ట్రపతి పాలన ఎప్పటి నుంచి ..?

మీరు అరుణాచల్ ప్రదేశ్ గురించి తెలుసా..?..

బీజేపీ కేంద్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత అక్కడ రాష్ట్రపతి పాలన విధించారు. ఈశాన్య రాష్ట్రం కాబట్టి.. బీజేపీ ఏం చేసినా ఓకే అన్న హవా అప్పట్లో ఉంది కాబట్టి.. ఎవరూ పట్టించుకోలేదు. బీజేపీ రాజకీయాల దెబ్బకు… మాజీగా మారిన ముఖ్యమంత్రి కలికో ఫుల్ ఆత్మహత్య చేసుకున్నారు. ఆయన సూసైడ్‌ నోట్‌ లో వివరాలున్నాయి. ఎవరూ పట్టించుకోలేదు.

మీకు ఉత్తరాఖండ్ గురించి తెలుసా..?

ఆక్కడా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నానా తిప్పలు పడేలా చేసి.. రాష్ట్రపతి పాలన విధించారు. దాన్ని అక్కడ హైకోర్టు కొట్టి వేసింది. ఇదంతా చేసింది మోడి హయాంలో.. అమిత్ షానే.

ఇప్పుడు ఏపీపై గురి పెట్టారా..?

ఈ రెండు మాత్రమే కాదు.. ఢిల్లీలో కేంద్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత ఈశాన్య రాష్ట్రాల్లో దాదాపు అన్ని చోట్లా.. రాష్ట్రపతి పాలన ప్రయోగించి.. ప్రభుత్వాల్ని మార్చేశారు. ఈశాన్యంలో పట్టు సాధించారు. ఇప్పుడు అదే వ్యూహాన్ని ఏపీలో అమలు చేయబోతున్నారు. అది ఏపీ నుంచే ప్రారంభం కాబోతోందన్న సూచనలు కనిపిస్తున్నాయి. అందులో భాగంగా మొదటి రాష్ట్రం.. ఆంధ్రప్రదేశ్. ఈ కోవలోనే.. బీజేపీ నేతలు.. వరుసగా రాష్ట్రపతి పాలన ప్రకటనలు చేస్తున్నారు. శాంతిభద్రతల విషయంలో అట్టడుగున ఉండే.. యూపీ, బీహార్ లాంటి రాష్ట్రాల్లో .. ఏం జరిగినా.. రాష్ట్రపతి పాలన అనే మాటే వినిపించదు. కానీ.. ఏపీలో మాత్రం.. చీమ చిటుక్కుమన్నా రాష్ట్రపతి పాలనకు బీజేపీ నేతలు డిమాండ్ చేస్తూ ఉంటారు.

ఏపీలో రాష్ట్రపతి పాలన ఎప్పటి నుంచి ..?

రాజకీయంగా విమర్శలు చేస్తేనే.. రాష్ట్రపతి పాలన విధిస్తామనే హెచ్చరికలు తాజాగా.. బీజేపీ నేతలు చేస్తున్నారు. ఉత్తరప్రదేశ్ నుంచి ఎంపీగా ఎన్నికయి.. ఏపీలో బీజేపీ రాజకీయాల్ని ఒంటి చేత్తో శాసిస్తున్న జీవీఎల్ నరసింహారావు … నేరుగా ముఖ్యమంత్రికే హెచ్చరికలు జారీ చేశారు. ఇది మొదటి సారి కాదు. గతంలో అమిత్ షా తిరుమల పర్యటనకు వచ్చినప్పుడు… కన్నా జిల్లాల పర్యటనల్లో ప్రజలు విభజన హామీలు నెరవేర్చాలని నిరసన వ్యక్తం చేసినప్పుడూ.. ఇదే డిమాండ్ వినిపించారు. అంతకు మించి విశాఖ విమానాశ్రయంలో జగన్ పై జరిగిన కోడికత్తి దాడి జరిగిన క్షణాల్లోనే ఢిల్లీలో ప్రెస్మీట్ పెట్టి.. ఏపీలో రాష్ట్రపతి పాలన విధించాల్సిందేనని డిమాండ్ చేసిన వైనం.. అప్పట్లోనే అనేక అనుమానాలను రేకెత్తిచింది. ఓ వైపు గవర్నర్ నేరుగా డీజీపీకి ఫోన్ చేయడం.. అక్కడ జీవీఎల్ గ్రౌండ్ ప్రిపేర్ చేసినట్లు మాట్లాడటంతో… ఏదో జరగబోతోందన్న సంకేతం వచ్చింది.

ఎన్‌ఐఏ రాక వెనుక పెద్ద కథ ఉందా..?

జీవీఎల్ ఏపీకి వచ్చి రాష్ట్రపతి పాలన విధిస్తామని బెదిరింపులు ప్రారంభించారు. అయితే ఇవన్నీ ఆషామాషీగా జరగడం లేదన్న అభిప్రాయం మాత్రం రాజకీయవర్గాల్లో సీరియస్ గా ఉంది. ఓ పద్దతి ప్రకారమే.. ఏపీలో రాష్ట్రపతి పాలనకు ప్రయత్నాలు చేస్తున్నారన్న అనుమానాలు టీడీపీ నేతల నుంచి వస్తున్నాయి. ఎన్నికలకు వెళ్లే సమయంలో ఏపీలో ప్రభుత్వం ఉండకూడదన్న ఆలోచన.. బీజేపీ అగ్రనేతల్లో ఉందని.. తెలుగుదేశం పార్టీ నేతలు నమ్ముతున్నారు. ఇటీవలి కాలంలో.. ఏపీలో కేంద్ర దర్యాప్తు, నిఘా సంస్థల కార్యకలాపాలు పెరిగాయి. ఎలాంటి అధికారం లేకపోయినా.. రాజ్యాంగ పరంగా.. కేసును చేతుల్లోకి తీసుకునే అవకాశం లేకపోయినా.. కోర్టు అనుమతి వస్తుందో లేదో అన్న అనుమానంతో.. కోడి కత్తి కేసును ఎన్ఐఎ తన అధీనంలో తీసుకోవడమే దీనికి సాక్ష్యాంగా చెబుతున్నారు. పైకి కోడికత్తి కేసు విచారణ అయినప్పటికీ.. అంతర్గతంగా చాలా వ్యవహారమే డుస్తోందన్నసమాచారం.., ప్రభుత్వానికి అందుతోందంటున్నారు.

ఏదీ తోసిపుచ్చలేం.. అక్కడ మోడీ…షా మరి..?

బీజేపీ నేతల హెచ్చరికలను తేలిగ్గా తీసుకోకూడదనేది రాజకీయవర్గాల అంచనా. ఎందుకంటే.. బీజేపీ జాతీయ పార్టీ. ఎలాంటి వ్యూహమైన ఢిల్లీలో ఖరారవుతుంది. అక్కడి నుంచి వచ్చే సూచనల ప్రకారమే.. నేతలు వ్యవహరిస్తారు.ప్రకటనలు చేస్తారు. అందులో భాగంగానే పకడ్బందీగా బీజేపీ నేతలు రాష్ట్రపతి పాలన హెచ్చరికలు జారీ చేస్తున్నారన్న అభిప్రాయం ఉంది. ఏం జరిగినా జరగొచ్చు. ఎందుకంటే.. ఢిల్లీలో ఉంది మోడీ, షాలు మరి..!

—సుభాష్

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

పరశురాం డబ్బులు వెనక్కి ఇస్తాడా ?

ఫ్యామిలీ స్టార్ నిరాశ పరిచింది. విజయ్ దేవరకొండ, పరసురాం సక్సెస్ కాంబినేషన్ లో మంచి అంచనాలతో వచ్చిన సినిమా అంచనాలని అందుకోలేకపోయింది. గీతగోవిందం మ్యాజిక్ మరోసారి వర్క్ అవుట్ అవుతుందని భావించారంతా. కానీ...

మాధవీలత ఆస్తులు ఎన్ని కోట్లో తెలుసా..?

హైదరాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థిగా మాధవీలత ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీపై పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. పాతబస్తీ గడ్డపై బీజేపీ ఎగరేసి ఒవైసీకి ఓటమి రుచి చూపిస్తానని ధీమా వ్యక్తం చేస్తున్నారు....

ఎన్నికల వరకు జగన్ అంతే..!?

ఏపీ సీఎం జగన్ రెడ్డిపై రాయి దాడి జరిగి రెండు వారాలు కావొస్తోంది. బస్సు యాత్రలో భాగంగా ఓ వ్యక్తి రాయి విసరడంతో జగన్ ఎడమ కంటిపైన స్వల్ప గాయమైంది. బ్యాండేజ్...

పిఠాపురంలో వైసీపీ చీప్ ట్రిక్స్..!!

కుప్పం, పిఠాపురం...ఈ రెండు నియోజకవర్గాల్లో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ను ఓడించేందుకు వైసీపీ కుట్రలకు పదును పెడుతోంది. చంద్రబాబుపై ఎంత బురద జల్లుతున్నా అవేవీ ప్రజలు విశ్వసించడం లేదు. దీంతో పిఠాపురంలో పవన్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close