బీజేపీలోనే ఎక్కువ మంది క్రిమినల్స్‌….!

మన దేశంలో నేరాలు ఎవరు చేస్తారు? అత్యాచారాలు ఎవరు చేస్తారు? లారీ డ్రైవర్లు క్లీనర్లా? వ్యసనాలకు బానిసలైన కాలేజీ విద్యార్ధులా? జల్సాగా తిరిగే సంపన్నుల పిల్లలా? రౌడీ మూకలతో, మందుబాబులతో తిరిగే యువకులా? ఫలానావారే నేరం చేయాలని లేదు కదా. వ్యసనాలు ఉన్నవారే కాదు లేనివారూ చేస్తారు. ఇందుకు అనేక రకాల కారణాలు, అనే రకాలైన నేపథ్యాలు ఉంటాయి. ఈ చర్చ అలా పక్కన పెడదాం. రాష్ట్రాల్లో అసెంబ్లీలకు, అత్యున్నత చట్టసభ పార్లమెంటుకు ఎన్నికయ్యే వారిలో ఎంతోమంది నేరస్తులున్న సంగతి చాలామందికి తెలిసిందే. చట్టసభల్లో వీరిని గౌరవ సభ్యులని సంభోదిస్తుంటారు. సమాజంలో వీరికొక గౌరవం ఉంది. వీరికంటూ ప్రొటోకాల్‌ ఉంటుంది.

వీరు నేరస్తులుగా ఉంటే ప్రజలు వీరి నుంచి ఏం నేర్చుకుంటారు? ప్రజాప్రతినిధులను చూసి నేర్చుకునే కాలం పోయింది. వీరిలో కరడుగట్టిన క్రిమినల్స్‌ ఉన్నా ప్రభుత్వం, చట్టాలు ఏమీ చేయలేకపోతున్నాయి. అత్యాచారం చేసినవారిని ఎన్‌కౌంటర్‌ చేసే పోలీసులు క్రిమినల్‌ కేసులున్న ప్రజాప్రతినిధులను ఏం చేస్తున్నారు? హైదరాబాద్‌ దిశ ఘటనతో పార్లమెంటు దద్దరిల్లిన సందర్భంలో పార్లమెంటు సభ్యుల్లో క్రిమినల్‌ కేసులున్నవారిపై ఏం చర్యలు తీసుకుంటున్నారనేదానిపై మీడియాలో చర్చ జరిగింది. అసోసియేషన్‌ ఆఫ్‌ డెమొక్రటిక్‌ రిఫార్మ్స్‌ (ఎడీఆర్‌) ఈ ఏడాది మే నెలలో విడుదల చేసిన సమాచారం ప్రకారం…ఈ ఏడాది జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో కొత్తగా ఎన్నికైన సభ్యుల్లో సగం మంది క్రిమినల్‌ ఆరోపణలు ఉన్నవారే.

2014 కంటే ఎన్నికలప్పటికంటే ఈ సంఖ్య 26 శాతం పెరగ్గా, 2009 ఎన్నికల కంటే 44 శాతం పెరిగింది. మొత్తం 539 మంది లోక్‌సభ సభ్యుల్లో 233 మంది ఎంపీలపై (43 శాతం) క్రిమినల్‌ కేసులున్నాయి. రాష్ట్రాల అసెంబ్లీల్లో ఎమ్మెల్యేలను, లోక్‌సభ సభ్యులను చూసుకున్నట్లయితే క్రిమినల్స్‌లో ఎక్కువమంది బీజేపీ సభ్యులే ఉన్నారు. వీరిలో ఎక్కువమందిపై మహిళలపై అత్యాచారాలు, లైంగిక వేధింపులు, హత్యలు, కిడ్నాప్‌ కేసులున్నాయి. బీజేపీ సభ్యుల్లో 116 మంది మీద (39 శాతం) క్రిమినల్‌ కేసులున్నాయి. ఇక 29 మంది కాంగ్రెసు సభ్యుల మీద, 13 మంది జేడీయు, 10 మంది డీఎంకె, 9 మంది టీఎంసీ సభ్యుల మీద క్రిమినల్‌ కేసులున్నాయి. లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీకే మెజారిటీ వచ్చిన సంగతి తెలిసిందే. ఈ పార్టీ సభ్యుల్లో 87 మంది మీద చాలా సీరియస్‌ క్రిమినల్‌ కేసులున్నాయి. 29 మంది మీద నాన్‌ సీరియస్‌ కేసులున్నాయి. జేడీయూ నుంచి ఎన్నికైన ఎంపీల్లో అత్యధికమందిపై క్రిమినల్‌ కేసులున్నాయి. వీరిలో 50 శాతం మంది సీరియస్‌ క్రిమినల్‌ కేసులు ఎదుర్కొంటున్నారు.

లోక్‌సభ సభ్యుల్లో మొత్తంగా 81 శాతం మంది సీరియస్‌ క్రిమినల్‌ కేసులు ఎదుర్కొంటున్నారు. 19 మంది ఎంపీలు మహిళలకు సంబంధించిన నేరాల్లో ఉండగా, ముగ్గురు రేప్‌ కేసుల్లో , ఆరుగురు కిడ్నాప్‌ కేసుల్లో నిందితులు. 2014 ఎన్నికల్లో ఎన్నికైన లోక్‌సభ సభ్యుల్లో 185 మందిపై (34 శాతం) క్రిమినల్‌ కేసులుండగా, 112 మందిపై సీరియస్‌ క్రిమినల్‌ కేసులున్నాయి. క్రిమినల్‌ కేసులున్నవారిని చట్టసభలకు వెళ్లకుండా నియంత్రించే వ్యవస్థ లేదు. ఏ కేసులోనైనా దోషిగా తేలేవరకు నిర్దోషి అనే సూత్రాన్ని అడ్డం పెట్టుకొని పార్టీలు క్రిమినల్స్‌కు టిక్కెట్లు ఇస్తున్నాయి. జనం కూడా కేసుల విషయం పట్టించుకోకుండా క్రిమినల్‌ను చట్టసభలకు ఎన్నిక చేస్తున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

అలా చేస్తే రాహుల్ నపుంసకుడో కాదో తేలుతుంది..కాంగ్రెస్ నేత సంచలన వ్యాఖ్యలు

ఎన్నికలు వచ్చిన ప్రతిసారి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పెళ్లి విషయంపై బీజేపీ నేతలు కామెంట్స్ చేయడం పరిపాటిగా మారింది. ఆయనకు మగతనం లేదని అందుకే పెళ్లి చేసుకునేందుకు భయపడుతున్నారని బీజేపీ నేతలు...

బీజేపీకి రాజాసింగ్ షాక్…ఏం జరిగిందంటే..?

హైదరాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి మాధవీలత నామినేషన్ కు ఎమ్మెల్యే రాజాసింగ్ డుమ్మా కొట్టారు.హైదరాబాద్ సెగ్మెంట్ ఇంచార్జ్ గా తన అభిప్రాయాన్ని తీసుకోకుండానే ఏకపక్షంగా మాధవీలత అభ్యర్థిత్వాన్ని ఫిక్స్ చేశారని రాజాసింగ్ అసంతృప్తిగా...

తెలంగాణలో ఛాలెంజింగ్ పాలిటిక్స్

లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ హోరాహోరీగా తలపడుతున్నాయి. ప్రజాభిప్రాయం ఎలా ఉన్నా మెజార్టీ సీట్లు మావంటే మావేనని ప్రకటిస్తున్నాయి. ప్రత్యర్ధి పార్టీలపై ఆయా పార్టీల నేతలు విమర్శలు, ప్రతి విమర్శలు...

కొనసాగింపు కథల బాక్సాఫీసు వేట

‘బాహుబలి’ సినిమా సైజ్ ని పెంచింది. ప్రేక్షకులందరికీ థియేటర్స్ లోకి తీసుకురాగలిగితే బాక్సాఫీసు వద్ద ఎలాంటి మాయ చేయొచ్చు నిరూపించింది. సినిమా కథకు కూడా కొత్త ఈక్వేషన్ ఇచ్చింది. బహుబలికి ముందు దాదాపు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close