జయలలితను మోడీ ప్రసన్నం చేసుకోగలరా?

తమిళనాడు రాష్ట్రంలో ఇటీవల వచ్చిన తుఫాను వలన సుమారు రూ. 8,500 కోట్ల ఆస్తి నష్టం జరిగినట్లు తమిళనాడు ప్రభుత్వం కేంద్రానికి తెలియజేసింది. దానిపై స్పందించిన కేంద్రప్రభుత్వం తక్షణమే రూ. 940 కోట్లు విడుదల చేసింది. అంతే కాదు ముఖ్యమంత్రి జయలలిత అభ్యర్ధన మేరకు తుఫాను నష్టాన్ని అంచనా వేయడానికి 9మంది సభ్యులతో కూడిన కేంద్ర పరిశీలన బృందం ఒకటి నేడు తమిళనాడుకి పంపించింది. తుఫాను వల్ల నష్టపోయిన చెన్నై, కాంచీపురం, తిరువళ్లూర్, కడలూరు ప్రాంతాలలో వారు రెండు రోజుల పాటు పర్యటించి తుఫాను నష్టాన్ని స్వయంగా అంచనా వేసి కేంద్రానికి నివేదిక సమర్పిస్తారు. దానిని బట్టి కేంద్రప్రభుత్వం అవసరమయితే తమిళనాడు రాష్ట్రానికి మరిన్ని నిధులు విడుదల చేయవచ్చును.

కేంద్రప్రభుత్వం ఇంత చురుకుగా సానుకూలంగా స్పందించడం చాలా హర్షణీయం. కానీ ఇదే చురుకుదనం, సానుకూల స్పందన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో హుదూద్ తుఫాన్ ఏర్పడినప్పుడు ఎందుకు చూపించలేదు? అని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు ప్రశ్నిస్తే ఆశ్చర్యం లేదు. హుదూద్ తుఫాను తగ్గిన వెంటనే ప్రధాని నరేంద్ర మోడి స్వయంగా తుఫాను నష్టాన్ని పరిశీలించేందుకు విశాఖకు వచ్చి, రూ.1, 000 కోట్లు ఆర్ధిక సహాయం ప్రకటించినప్పుడు రాష్ట్ర ప్రజలందరూ చాలా సంతోషించారు. కానీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు డిల్లీ చుట్టూ ఆరు నెలలు తిరిగితే కానీ ఆ డబ్బు విడుదల చేయలేదు? అది కూడా రెండు వాయిదాలలో విడుదల చేసారు! తెదేపా-బీజేపీలు మిత్రపక్షాలుగా, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలలో భాగస్వాములుగా ఉన్నప్పుడు, అంతకంటే పెద్ద మొత్తం తక్షణమే విడుదల చేస్తారని అందరూ ఆశించారు. కానీ ప్రధాని స్వయంగా ప్రకటించిన ఆ మొత్తం విడుదల చేయడానికే ఆరు నెలల సమయం పట్టింది! తమిళనాడు రాష్ట్రానికి సహాయం చేయడం చాలా అత్యవసరం. వీలయినంత ఎక్కువ సహాయం చేయాలనే ఎవరయినా కోరుకొంటారు. కానీ బీజేపీ భాస్వామిగా ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పట్ల కేంద్రం ఈవిధంగా వ్యవహరిస్తుండటాన్ని ఎవరూ జీర్ణించుకోలేకపోతున్నారు.

బిహార్ అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని ప్రధాని నరేంద్ర మోడి ఆ రాష్ట్రానికి ఎవరూ అడగకపోయినా రూ.1.65లక్షల కోట్ల భారీ ఆర్దికప్యాకేజి ప్రకటించినందున, వచ్చే ఏడాది తమిళనాడులో రాబోయే ఎన్నికలను దృష్టిలో ఉంచుకొనే అధికార అన్నా డి.ఎం.కె. అధినేత్రి జయలలితను ప్రసన్నం చేసుకోవడానికే కేంద్రం ఇంత చురుకుగా, సానుకూలంగా వ్యవహరిస్తోందా? అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. జయలలితను ప్రసన్నం అయితే ఆమె బీజేపీకి మహా అయితే కొన్ని ఎంపీ, ఎమ్మెల్యే సీట్లు కేటాయించవచ్చును తప్ప బీజేపీ ఎన్ని విశ్వప్రయత్నాలు చేసినా తమిళనాడులో బలమయిన రాజకీయ శక్తిగా ఎదగడం చాలా కష్టమనే భావించవచ్చును.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

హోదా ఇస్తేనే విభజన చట్టం అమలు..! హైకోర్టుకు ఏపీ సర్కార్ అఫిడవిట్..!

అమరావతి మార్పు గురించి ప్రస్తావన లేని పిటిషన్‌పై వేసే అఫిడవిట్లలో అటు కేంద్రం..ఇటు ఏపీ...రాజధాని మార్పు గురించి తమ విధానానని హైకోర్టులో చెప్పడం... ఆశ్చర్యానికి గురి చేస్తోంది. 2018 మార్చి 29న విభజన...

ఆహా ప్లానింగ్ : చిరుతో వెబ్ సిరీస్… 42 షోస్‌

తొట్ట తొలి ఓటీటీ సంస్థ ఆహా.. భారీ ప్లానింగ్ తో రాబోతోంది. వ‌రుస‌గా సినిమాలు కొంటూ, వెబ్ సిరీస్ లు రూపొందిస్తూ.. కంటెంట్ బ్యాంక్ ని పెంచుకుంటోంది ఆహా. రాబోయే రోజుల్లో ఆహా...

170 కోట్ల‌తో ఓటీటీ సినిమానా?

ఓటీటీ.. ప‌రిధి పెరుగుతోంది. చిత్ర‌సీమ‌ని మెల్ల‌మెల్ల‌గా ఓటీటీ ఆక్ర‌మించుకుంటోంది. నిర్మాత‌ల‌కు ఇదో ప్ర‌ధాన ఆదాయ వ‌న‌రుగా మారింది. థియేట‌ర్ల‌కు ప్ర‌త్యామ్నాయంగా ఓటీటీ త‌న రూపాన్ని మార్చుకుంటోంది. ఓటీటీ సంస్థ‌లే... భారీ పెట్టుబ‌డితో సినిమాలు...

ఫ్లాప్ హీరోతో.. యూవీ సినిమా

ద‌ర్శ‌కుడు శోభ‌న్ గుర్తున్నాడా? వ‌ర్షం సినిమా ద‌ర్శ‌కుడు. ప్ర‌తిభావంత‌మైన ద‌ర్శ‌కుడు... చాలా త‌క్కువ వ‌య‌సులోనే క‌న్నుమూశాడు. త‌న త‌న‌యుడే సంతోష్. త‌ను నేను, పేప‌ర్ బోయ్ సినిమాల‌లో హీరోగా క‌నిపించాడు. ఆ...

HOT NEWS

[X] Close
[X] Close