ఎన్.టి.ఆర్ సినిమాలో మోహన్ లాల్

మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ సినిమాలో నటిస్తున్నాడని ఫిల్మ్ నగర్ టాక్. ప్రస్తుతం ఎన్.టి.ఆర్ నాన్నకు ప్రేమతో సినిమా షూటింగ్లో బిజీగా ఉన్నాడు. ఆ సినిమా తర్వాత కొరటాల శివ డైరక్షన్లో జనతా గ్యారేజ్ సినిమా కమిట్ అయ్యాడు ఎన్.టి.ఆర్. యంగ్ టైగర్ లోని మాస్ ఎమోషన్ని ఈ సినిమా ద్వారా మరోసారి ప్రేక్షకులకు అందించనున్నాడు కొరటాల శివ. బృందావనం సినిమాతో రైటర్ గా పరిచయమున్న శివతో ఎన్.టి.ఆర్ సినిమా చేయడం విశేషం.

అయితే ఈ సినిమాలో మలయాళ సూపర్ స్టార్ నటిస్తున్నాడని అధికారికంగా ఎనౌన్స్ చేశారు సినిమా నిర్మాతలు మైత్రి మూవీ మేకర్స్ వారు. శ్రీమంతుడు సినిమా నిర్మించిన మైత్రి మూవీ మేకర్స్ వారే ఈ సినిమాను నిర్మించడం జరుగుతుంది. సినిమాలో హీరోతో పాటుగా మరో ఎమోషన్ క్యారక్టర్ ఉంది. ముందు ఈ పాత్రకు హరికృష్ణని పెడదామనుకున్నా, కొరటాల శివ ఆ పాత్రకు మోహన్ లాల్ ని సూచించడంతో ఆయన్నే ఫైనల్ చేశారు.

గాంధీవం సినిమాలో ఏయన్నార్ తో ‘గోరువంక వాలగానే…’ పాటలో కనిపించి అలరించిన మోహన్ లాల్ తర్వాత తెలుగు సినిమాలు చేయలేదు. ఆయన మలయాళంలో చేసిన ఎన్నో సినిమాలు తెలుగులో రీమేక్ అవ్వడం జరిగింది. ఎన్.టి.ఆర్, మోహన్ లాల్ కలిసి నటిస్తున్న ఈ సినిమా ఎలాంటి సంచలనాలను సృష్టిస్తుందో చూడాలి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఎన్నికల వరకు జగన్ అంతే..!?

ఏపీ సీఎం జగన్ రెడ్డిపై రాయి దాడి జరిగి రెండు వారాలు కావొస్తోంది. బస్సు యాత్రలో భాగంగా ఓ వ్యక్తి రాయి విసరడంతో జగన్ ఎడమ కంటిపైన స్వల్ప గాయమైంది. బ్యాండేజ్...

పిఠాపురంలో వైసీపీ చీప్ ట్రిక్స్..!!

కుప్పం, పిఠాపురం...ఈ రెండు నియోజకవర్గాల్లో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ను ఓడించేందుకు వైసీపీ కుట్రలకు పదును పెడుతోంది. చంద్రబాబుపై ఎంత బురద జల్లుతున్నా అవేవీ ప్రజలు విశ్వసించడం లేదు. దీంతో పిఠాపురంలో పవన్...

ఎక్స్‌క్లూజీవ్‌: పాట‌లే లేకుండా రౌడీ ప్ర‌యోగం

ఇది వ‌ర‌కు సినిమా అంటే ఆరు పాట‌లు ఉండాల్సిందే అనే అలిఖిత నిబంధ‌న ఉండేది. నిన్నా మొన్న‌టి వ‌ర‌కూ ఇదే కొన‌సాగింది. అయితే... ఇప్పుడు సినిమాలో ఒక్క పాట ఉన్నా చాలు, జ‌నాల్లోకి...

ఒకటో తేదీన పించన్లిస్తారా ? మరో 30 మంది వృద్ధుల బలి కోరతారా ?

మళ్లీ ఒకటోతేదీ వస్తోంది. పించన్లు పంచే సమయం వస్తోంది. వారం రోజుల ముందు నుంచే ప్రతిపక్ష పార్టీలు ప్రభుత్వాన్ని అప్రమత్తం చేయడం ప్రారంభించాయి. ప్రభుత్వ యంత్రాంగాన్ని ఉపయోగించుకుని ...

HOT NEWS

css.php
[X] Close
[X] Close