బీజేపీ వర్సెస్ టీఆర్ఎస్: నిన్న ఐటీఐఆర్.. ఇవాళ రైల్వే కోచ్ ఫ్యాక్టరీ..!

ఎమ్మెల్సీ ఎన్నికల పుణ్యమా అని తెలంగాణ రాజకీయాల్లో రోజుకో అంశం హైలెట్ అవుతోంది. హైదరాబాద్ ఎమ్మెల్సీ స్థానం గురించి బీజేపీపై విమర్శలు చేసేటప్పుడు ఐటీఐఆర్ ప్రాజెక్టును హైలెట్ చేసిన కేటీఆర్.. వరంగల్‌కు పోయి.. రైల్వే కోచ్ ఫ్యాక్టరీ అంశాన్ని లేవనెత్తి బీజేపీపై తీవ్ర విమర్శలు చేశారు. వరంగల్, నల్లగొండ, ఖమ్మం పట్టభద్రుల స్థానానికి పల్లా రాజేశ్వర్ రెడ్డి పోటీ చేస్తున్నారు. అక్కడా బీజేపీ కూడాగట్టిగానే పోటీ పడుతూండటంతో… కేంద్రం చేస్తున్న అన్యాయంపై కేటీఆర్ గళమెత్తారు. తెలంగాణకు అన్యాయం చేయడం కేంద్రానికి అలవాటైందని.. కోచ్‌ ఫ్యాక్టరీ ఏర్పాటు చేయకుంటే తెలంగాణకు తీవ్ర నష్టం జరుగుతుందని ఆందోళన వ్యక్తంచేశారు.

పార్లమెంట్‌ సాక్షిగా తెలంగాణకు ఇచ్చిన హామీని.. రద్దు చేసే అధికారం బీజేపీ ప్రభుత్వానికి లేదన్నారు. కేటీఆర్ రైల్వే కోచ్ ఫ్యాక్టరీ గురించి ప్రస్తావించడంతో బీజేపీ నేతలు ఉలిక్కి పడ్డారు. ఐటీఐఆర్ తరహాలోనే… టీఆర్ఎస్ వల్లే కోచ్ ఫ్యాక్టరీ రాలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. భూసేకరణలో అలసత్వం కారణంగానే కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ మరో రాష్ట్రానికి తరలిపోయింది, కోచ్ ఫ్యాక్టరీ తెలంగాణకు వచ్చే అవకాశాలు లేవని బీజేపీ నేత డీకే అరుణ తేల్చి చెప్పేశారు. ఇతర నేతలు కూడా అదే చెబుతున్నారు.

కేంద్రం విభజన హామీల ప్రకారం చూసుకుంటే .. అనేక హామీలు నెరవేర్చాల్సి ఉంది. ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారానికి ఖమ్మంకు వెళ్తే అక్కడ లేవనెత్తడానికి బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ రెడీగా ఉంటుంది. నల్లగొండలోనూ… అనేక అంశాలు ఉంటాయి. బీజేపీని ఇరుకున పెట్టడానికి టీఆర్ఎస్‌కు కావాల్సినన్ని అస్త్రాలున్నాయి. అయితే.. అన్నింటినీ టీఆర్ఎస్ వల్లే రాలేదంటూ దూకుడుగా ఎదురుదాడికి దిగుతూ.. బీజేపీ కూడా ఘాటు రాజకీయం చేస్తూనే ఉంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

video

‘ప్ర‌స‌న్న‌వ‌ద‌నం’ ట్రైల‌ర్‌: కొత్త పాయింటే ప‌ట్టారు

https://www.youtube.com/watch?v=uy8tkUFAsnA సుహాస్‌పై ప్రేక్ష‌కుల‌కు ఓ మంచి అభిప్రాయ‌మే ఉంది. త‌ను క‌చ్చితంగా విభిన్న ప్ర‌య‌త్నాలు చేస్తాడ‌నది అంద‌రి న‌మ్మ‌కం. క‌ల‌ర్ ఫొటో నుంచి అంబాజీ పేట మ్యారేజీ బ్యాండు వ‌ర‌కూ త‌న ట్రాక్ రికార్డ్...

హరీష్ రావు ఉత్తుత్తి రాజీనామా – కామెడీ చేసిన కాంగ్రెస్ !

తెలంగాణ ఉద్యమం కోసం ఇప్పటికే ఎన్నో సార్లు రాజీనామా చేశానని.. తనకు పదవులు ఓ లెక్క కాదంటూ చెప్పే హరీష్ రావు.. తాజాగా చేసిన రాజీనామా ఆయనను ట్రోల్ చేసేలా ఉంది....

చేసింది పొన్నవోలే కానీ చేయించింది జగన్ కాదట !

సీబీఐ చార్జిషీట్‌లో వైఎస్ఆర్ పేరును సోనియా గాంధీ పెట్టించారంటూ ఇంత కాలం జగన్ చేస్తున్న ప్రచారానికి షర్మిల ఒకే ఒక్క డైలాగ్ తో చెక్ పెట్టారు. పొన్నవోలు ద్వారా...

నారా భువనేశ్వరి డీప్ ఫేక్ ఆడియోతో వైసీపీ అరాచకం !

ఇంట్లో సొంత కుటుంబసభ్యుల్ని అత్యంత హీనంగా దూషిస్తున్న జగన్మోహన్ రెడ్డి పార్టీ.. ఆ పార్టీ సోషల్ మీడియా విభాగం పూర్తిగా కంట్రోల్ తప్పిపోయింది. ఏకంగా నారా భువనేశ్వరి ఆడియో పేరుతో డీప్ ఫేక్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close